📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Minister Savita: హస్తకళలకు మరింత ప్రోత్సాహం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

Author Icon By Tejaswini Y
Updated: December 12, 2025 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో హస్త కళలకు మరింత ప్రోత్సాహం అందివ్వనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత(Minister Savita) తెలిపారు. జాతీయ హస్త కళల వారోత్సవాల్లో భాగంగా రెండ్రోజుల కిందట ఢిల్లీలో భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ 2023, 2024కు సంవత్సరాలకు సంబంధించి ప్రకటించిన అవార్డుల్లో ఏపీకి చెందిన అయిదుగురు హస్త కళాకారులు అవార్డులు అందుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఈ అవార్డులు ఏపీకి వరించాయన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

Read Also: AP: అమరావతిలో కాగ్ కార్యాలయ నిర్మాణానికి అనుమతి: మంత్రి పెమ్మసాని

శ్రీకాళహస్తిలో అవార్డు గ్రహీతలకు రాష్ట్ర సన్మానం

జాతీయ హస్త కళల వారోత్సవాలు (డిసెంబర్ 8-14) సందర్భంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖ 2023, 2024కు సంవత్సరాలకు సంబంధించి అవార్డులు ప్రకటించిందన్నారు. ఏపీకి 2023 సంవత్సరానికి రెండు అవార్డులు, 2024 సంవత్సరానికి ఒక అవార్డుతో పాటు రెండు ప్రత్యేక ప్రస్తావన అవార్డులు లభించాయన్నారు. 2023కు సంబంధించి, మహిళల విభాగంలో శ్రీ కృష్ణ చరిత తోలు బొమ్మల తయారీలో డి.శివమ్మకు శిల్ప గురు అవార్డు లభించిందన్నారు. కలంకారి హ్యాండ్ పెయింటింగ్లో విజయలక్షి జాతీయ హస్తకళ అవార్డు వరించిందన్నారు.

Minister Savita: Further encouragement for handicrafts

తోలుబొమ్మలు, కలంకారి, ఏటికొప్పాక కళలకు జాతీయ గుర్తింపు

2024కు సంబంధించి ఏటికొప్పాక బొమ్మల తయారీలో గోర్సా సంతోష్కు జాతీయ అవార్డు, తోలు బొమ్మల తయారీలో కందాయ్ అంజన్నప్పకు, క్రాఫ్ట్ లో తోలుబొమ్మల తయారీ విభాగంలో ఖండే హరనాథ్కు ప్రత్యేక ప్రస్తావన అవార్డులు వరించాయన్నారు. ఆవార్డు గ్రహీతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్కు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారన్నారు. రాష్ట్రంలో హస్త కళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితంగానే అవార్డులు వరించాయన్నారు. కళాకారుల సంక్షేమంతో పాటు హస్తకళా రంగాన్ని కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తోందన్నారు.

కళాకారులకు శిక్షణతో పాటు ఉత్పత్తులకు విసృత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోందన్నారు. హస్త కళాకారులకు ఆర్థిక భరోసాతో కూడిన గౌరవ ప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హస్త కళల రంగానికి విశేష ప్రోత్సాహమందిస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. అవార్డులు అందుకున్న కళాకారులకు మంత్రి సవిత అభినందనలు తెలిపారు. జాతీయ అవార్డులు అందిన స్ఫూర్తితో హస్త కళలకు మరింత ప్రాచుర్యం కల్పించేలా కృషి చేస్తామన్నారు.

13న అవార్డు గ్రహీతలకు శ్రీకాళహస్తిలో సన్మానం

13న అవార్డు గ్రహీతలకు సన్మానం అవార్డు గ్రహీతలకు ఈ నెల 13న శ్రీకాళహస్తిలో సన్మానించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. జాతీయ హస్త కళల వారోత్సవాల్లో భాగంగా ఈ సన్మానం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇదే కార్యక్రమంలో వంద మంది హస్త కళాకారులకు ఒక్కొక్కరికీ రూ.10 వేల విలువ చేసే టూల్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు ఆ ప్రకటనలో మంత్రి సవిత వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh artisans Handicraft awards Minister Savitha National Handicrafts Week

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.