📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mana Mitra: ఇకపై ‘మన మిత్ర’తో ఆరోగ్య సేవలు

Author Icon By Anusha
Updated: March 15, 2026 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mana Mitra: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ (Mana Mitra) వాట్సాప్ చాట్‌బాట్ సేవలు ఇప్పుడు ఆరోగ్య శాఖకు కూడా విస్తరించాయి. 9552300009 నంబర్‌కు కేవలం ఒక్క ‘HI’ అని మెసేజ్ చేయడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను పొందడం సులభతరం అయింది. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డిజిటల్ పద్ధతిలో పనులు పూర్తి చేసుకోవచ్చు.

Read Also: Chandrababu Naidu: అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

ఆధార్ తో అనుసంధానమైన ఫోన్ నెంబర్ తో లాగిన్ అందులో ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీ అపాయింట్మెంట్ సేవలను పొందే వీలు కలుగుతుంది. దానిద్వారా సంబంధిత జిల్లా, ఆసుపత్రి విభాగం వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఎవరైతే ఏ విభాగంలో ఆరోగ్యసేవలను కోరుకుంటున్నారో వారు తమ ఆధార్ తో అనుసంధానమైన ఫోన్ నెంబర్ తో ఓటిపి ద్వారా దీనికి లాగిన్ అయ్యి తమ పూర్తిపేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్, చిరునామా, జిల్లా, పిన్కోడ్, రాష్ట్రం సహా అందులో అడిగిన వివరాలను నమోదు చేసుకోవాలి.

Health services with ‘Mana Mitra’

ఆన్ లైన్ లోనే వాట్సప్ ద్వారా అపాయింట్మెంట్

ఈ ప్రక్రియ తర్వాత ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాని చివరి 4 అంకెలు నమోదు చేయగానే మీకు ఏ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ అపాయింట్మెంట్ బుక్ అవుతుంది. అందులో మీకు అలాట్ చేసిన సమయం కూడా ఇవ్వబడుతుంది. దీంతో కేటాయించిన సమయానికి అక్కడికి వెళ్లి వైద్య సేవలను పొందే వీలుంటుంది.

గతంలో ఆసుపత్రులకు వెళ్లాలంటే పేషెంట్లు అక్కడికి వెళ్లి ఓపి కోసం క్యూలైన్లో నిలబడి ఓపి రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా సెల్ ఫోన్ లో నుంచి నేరుగానే ఓపి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని, ఆ సమయానికి ఆసుపత్రికి వెళ్లి సమయం వృధా కాకుండా వైద్య సేవలను పొందవచ్చు. ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే ఇబ్బంది పడిన పేషెంట్స్ ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Health Services Government Hospital OP Appointment Mana Mitra WhatsApp Number 9552300009

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.