Latest News: Beautician Course: ఏపీలో ఫ్రీగా ట్రైనింగ్ బ్యూటీషియన్ కోర్స్

Read Time:  1 min
Beautician Course
Beautician Course
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) మహిళల ఆర్థిక సాధికారత కోసం వివిధ రంగాల్లో నూతన పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు, వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Sathyakumar: సదరం సర్టిఫికెట్ జారీకి లంచండాక్టరుకు ఉద్వాసన

ఈ క్రమంలో తాజాగా మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణా కార్యక్రమం (Beautician training program) ప్రారంభించింది. మూడు నెలలపాటు కొనసాగే ఈ కోర్సు ద్వారా మహిళలు ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా ఎదగడానికి అవసరమైన ప్రాక్టికల్, సాంకేతిక జ్ఞానాన్ని పొందవచ్చు.

ఈ కార్యక్రమాన్ని ఆరిలోవలోని ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, మహిళా సాధికారిత కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బ్యూటీ, మేకప్, హెయిర్ స్టైలింగ్, స్కిన్ కేర్, కస్టమర్ సర్వీస్ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వబడుతుంది.

ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందడమే

శిక్షణ పూర్తయిన తర్వాత పాల్గొన్న వారికి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సర్టిఫికేట్ (AP Skill Development Institute Certificate) అందజేస్తారు. ఈ సర్టిఫికేట్ ఆధారంగా మహిళలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందడమే కాకుండా, సొంతంగా పార్లర్ ప్రారంభించే అవకాశమూ ఉంటుంది.ఈ శిక్షణ పొందినవారు బ్యాంకుల నుంచి రుణాలు పొంది సొంతంగా బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు.

Beautician Course
Beautician Course

ఈ (Beautician Course) కోర్సు వ్యవధి మూడు నెలలు కాగా.. 18 నుంచి 40 ఏళ్ల లోపు మహిళలు అర్హులు. ఈ సంస్థలో ఫేషియల్స్, హెయిర్‌ స్టైలింగ్, హెయిర్‌ కేర్‌ టెక్నిక్స్, మెహందీ, చర్మ సౌందర్యం చిట్కాలు, హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ వంటి అనేక రకాల మేకప్‌లు, సౌందర్య చికిత్సలపై శిక్షణ ఇస్తున్నారు. అలాగే మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు అవసరమైన పాఠాలు కూడా బోధిస్తున్నారు.

14 రకాల అంశాలపై ప్రత్యేక శిక్షణ

గతంలో శిక్షణ పొందిన 22 మందిలో 18 మంది ఇప్పటికే బ్యూటీషియన్ (Beautician) వృత్తిలో స్థిరపడ్డారు. అంతేకాదు ఈ కోర్సు తర్వాత ప్రభుత్వం అందజేసిన ధ్రువపత్రంతో వీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంతంగా బ్యూటీ పార్లర్లు (Beauty parlors) ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. బయట ప్రైవేట్ సంస్థల్లో ఈ కోర్సు నేర్చుకోవాలంటే వేలల్లో ఖర్చు అవుతుందని, కానీ ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

అయితే త్వరలోనే కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుందని తెలిపారు.. ఆసక్తిగల మహిళలు 62812 61415 నంబరుకు ఫోన్ చేసి ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. బ్యూటీషియన్ కోర్సు (Beautician Course) తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ (Data entry operator), హ్యాండ్‌ ఎంబ్రాయడరీ (మగ్గం వర్క్‌) కోర్సులు కూడా ప్రారంభం కానున్నాయని వివరించారు. ఇటు శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల వారీగా నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఈ కేంద్రాల ద్వారా అభ్యర్థులకు 14 రకాల అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పలాస, బలగ, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలు. టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఈ స్కిల్ హబ్‌లు నెలకొల్పారు. అయితే ఈ నైపుణ్య కేంద్రాలలో చదువు పూర్తి చేసినవారితో పాటుగా మధ్యలో ఆపేసిన వారు కూడా ఉద్యోగాలు పొందేలా శిక్షణ అందిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.