📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Today News : Ration Cards – ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు : మంత్రి మనోహర్

Author Icon By Shravan
Updated: August 23, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Ration Cards : ప్రజలకు సంక్షేమంతోపాటు పారదర్శకంగా కొత్త సాంకేతికతతో ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) తెలిపారు. కానూరులోని సివిల్ సప్లైస్ భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సామాన్యుడిని ఆదుకునే విధంగా నిజాయితీతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేస్తుంటారని, ఆవిధంగా పనిచేస్తున్నామన్నారు. ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టామన్నారు. నాలుగు దశల్లో 1 కోటీ 45 లక్షల స్మార్డ్ కార్డుల పపిణీ రేషన్ కార్డుల దుకాణాల వద్దనే గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో పంపిణీ చేస్తున్నామన్నారు. 6,71,000 కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, 16,67,032 రేషన్ కార్డుల (Ration cards) అప్లికేషన్స్ కి అప్రూవల్ ఇచ్చామని, కార్డుల జారీ నిరంతర ప్రక్రియని, ఆన్ లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. రేషన్ పంపిణీ 93 శాతానికి పెరిగిందన్నారు. రేషన్ డెలివరీలో సర్వీసు పెరిగిందన్నారు. స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించి సంబంధిత సిబ్బందికి శిక్షణ అందించామన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు సాంకేతికతను ఉపయోగించి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Ration Cards – ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు : మంత్రి మనోహర్

ఆగస్టు 25 నుంచి ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

భారీ స్థాయిలో సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం దేశంలో బహుశా ఇదే మొదటిసారి అని అన్నారు. స్మార్ట్ సభ్యుల వివరాలు, సేఫ్టీ కోసం క్యూఆర్ కోడ్, కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుందన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చన్నారు. 2 నెలలుగా స్మార్ట్ రేషన్ కార్డుల కసరత్తు చేశామన్నారు. చివరి మైలులో ఉన్న వ్యక్తికి కూడా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. స్మార్ట్ కార్డులు రాష్ట్రం నుంచి జిల్లాకు అక్కడ నుంచి మండలాలకు, మండలాల నుంచి ఆయా రేషన్ షాపులకు బాక్స్ ల్లో భద్రంగా క్యూఆర్ కోడ్ తో చేరుస్తామన్నారు. దీనివల్ల ట్రేస్ ఉంటుందన్నారు. రేషన్ ను ఇప్పటికే ప్రతి నెలా దివ్వాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన దాదాపు 16,73,000 డెలివరీ చేస్తున్నామన్నారు. ఆగస్టు 25 నుంచి 9 జిల్లాల నుంచి ఉచిత స్మార్ట్ కార్డుల పంపిణీని ఆయా జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగ వాతావరణంలో ప్రారంభిస్తారన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/kanaka-durga-goddess-kanaka-durga/andhra-pradesh/534827/

AP Welfare Schemes Breaking News in Telugu Free Ration Cards Government Services Latest News in Telugu Public Distribution System Smart Ration Cards Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.