📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Free Path: ఉచిత మీమాంస తగునా!

Author Icon By Sudha
Updated: February 17, 2026 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏదో ‘ఉచితానుచితాలు మరచి అనుకుంటాం కానీ ఏది ఉచితం, ఏది అనుచితం అని చెప్ప గలిగే వాళ్లెవరైనా ఉన్నారా అని పరకాయించి చూస్తే అన్నీ సందేహాలమయమే. రాజకీయాల్లో ఉచితాలనండి, ప్రజాకర్షక పథకాలనుండి ఏవైనా వాటి లబ్దిదారులను సోమరిపోతుల్లా పెంచి పోషించడమేనని పెద్దలు పదేపదే పలు సందర్భాల్లో హితవు చెబుతూనే ఉన్నారు. ప్రధానంగా పూర్వ రిజర్వుబ్యాంకు గవర్నర్లు దువ్వూరి సుబ్బారావు, రఘురామరాజన్లో నిర్ద్వందం గానే చెప్పజూసారు. వాళ్లకు దొరికిన వేదికమీదల్లా దేశాభివృద్ధిలో ఉచితాలనబడేవి తిరోగమనానికి సాక్షీ భూతాలుగా అభివర్ణించారు. కానీ ఎందుకో రాజకీయ నేతల చెవికెక్కడం లేదు. ఎంత నిజాయితీగా ఉన్నా తాయిలాలు లేకపోతే ఓటర్లు తమను పట్టించుకోరనే ఆందోళనతో అలా చేసి ఉండవచ్చు. ఇలా ఓటర్లను ఆకర్షించే పథకాలు ఎన్నాళ్లు అనే సంశయం ఉండనే ఉంది. ఇలాంటి వాటితోనే జాతి జనుల సామర్థ్యాలు నిర్వీర్యమైపోతాయనే అంచనాలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆయా సమస్యలు మళ్లీ మళ్లీ అధికారం లోకి తామే రావాలనే ఆకాంక్షలతో ఉచితాలు(Free) గుప్పిస్తు న్నారు. తాజాగా మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశ ఆదాయ వ్యయాల పట్టికలో ఉత్పాదకతను పెంచేలా ఖర్చులు ఉండాలన్న అభిమతంతో కేంద్ర సర్కారు బడ్జెట్ లో ప్రజాకర్షక పథకాల జోలికి పోలేదని వివరించారు. ఈ యేడాది బడ్జెట్ అందుకు లోబడే ఏర్చికూర్చినందుకు ఆనందపడాల్సిందే. కానీ త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలలో ఏయే పార్టీ ఎలాంటి ఉచిత వ్యూహాలు పన్ను తుందో ఇప్పుడిప్పుడే చెప్పలేం. స్వల్పకాలిక ప్రజాకర్షక పథకాలను తాము ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టామని ప్రధాని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రజాకర్షక పథకాల కన్నా ప్రజల జీవన ప్రమాణాలను పెంచామనే సంకల్పం తో ముందడుగు వేస్తున్నట్లుగా చెప్పారు. బీహార్ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించి అమలు చేసిన మహిళా అనుకూల పథకాలే ఎన్డీఎకు పట్టం కట్టాయాన్న విషయం జగద్వితమే. అంతలోనే ఇంత మార్పా అని మనం నోరెళ్ల బెట్టినా వచ్చే తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికల నాటికి వ్యూహాలు ఎలా ఉంటాయో అప్పుడే చెప్పలేం. ఇప్పటికే తమిళనాడులో అధికార పార్టీ డిఎంకె మహిళ లను ఆకట్టుకునే పనిలో పడింది. బీహార్లో గత అధికార పార్టీ అమలు చేసినట్లే ఓకపథకానికి అంకురార్పణ చేసింది. కాగా తమిళనాడులోని దాదాపు 1.3 కోట్ల మంది మహిళా లబ్దిదారులకు ఖాతాల్లో ‘మగలిక ఉరిమై తిట్టమ్ ప్లస్’ పథకం కింద ఐదువేల రూపాయల నగదు జమ చేయుటకు ఉద్దేశించబడింది. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చాక నెలవారీ సహాయం రెండువేల కన్నా రెట్టింపుగా ఉంటుందని ఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ ప్రకటించారు. ఈ బాపతు నగదు బదలీని ఏమనుకోవాలి. బీ
హార్లో స్త్రీ శక్తిని ఆకట్టుకుని నితీష్ కుమార్ గెలిచినట్లే తానూ గెలవాలని స్టాలిన్ సంకల్పం కావచ్చు. తమిళ మహిళల సంక్షేమం గురించి ఆలోచించడానికి ఎన్నికల ముందువరకు ఎందుకు వేచి ఉన్నారని విపక్షాలు నిలదీసాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ఉచిత (Free)పథ కాలు దేశ ఆర్థిక వ్యవస్థను అప్పుల ఊబిలోకి నెడుతున్నా యని 2025-26 ఆర్థిక సర్వే హెచ్చరిస్తోంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నివేదికలోని అంశాలు గమనిస్తే నిబంధనలు లేని నగదు బదలీ పథకాల కోసం రాష్ట్రాలు చేస్తున్న ఖర్చు గత మూడేళ్లలో ఐదు రెట్లు పెరిగి, ఈ యేడాది 1.7 లక్షల కోట్లకు చేరుకుంది. జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఉచిత పథకాలకు వెచ్చించే సొమ్ము ఆయా రాష్ట్రాల ఆదా యంలో దాదాపు 62శాతం అని తేలింది. పర్యవసానంగా రోడ్లు, రైల్వేలు, ఆసుపత్రులు విద్యావైద్య సౌకర్యానికి అవసరమైన మూలధనవ్యయం దారుణంగా తగ్గిపోతుం దని సర్వే వివరించింది. అప్పులు చేసి మరీ ప్రజల చేతిలో ఉచితంగా నగదు అందించడం వలన పేదరికం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదని ఆనివేదికలో పేర్కొంది. ఇలాంటి అప్పులు, వినియోగాల ఖర్చుల వలన రాష్ట్రాలు దివాలా తీసినా అనుమానించక్కర్లేదని సర్వే నివేదిక సారాంశం. మళ్లీ ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు బ్రెజిల్లో విజయవంతమై ‘బోల్సా ఫ్యామిలియా’ తరహా విధానాన్ని అనుసరించాలని ఆ ఆర్థిక సర్వే సూచించింది. ఉచితంగా నగదు బదిలీ చేయడంకన్నా కొన్ని నిబంధన లు కూడా ఈ పథకానికి జడించడం తప్పనిసరియని నివేదిక పేర్కొంది. ప్రభుత్వంనుంచి ప్రయోజనాలు పొందే కుటుంబంలోని పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలకు వెళ్లాలి. చదువు
మీద శ్రద్ధ చూపించాలి. సకాలంలో వైద్యం, టీకాలు వేయించాల్సిన అవశ్యకత ఉందని నివేదికలు తేల్చిచెప్పిన విషయాలు. ఇదే అతిపెద్ద సామాజిక బాధ్యత అవుతుంది. ప్రతి పథకానికి ఒక ముగింపు గడువు ఉండాలి. లేకుంటే ప్రజల స్వయం ఉపాధి గురించి ఆలోచించక ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తుంటారని, తామేమిటో తమ బ్రతుకు తెరువు ఎలాగోనని ఆలోచించుకోగలిగే శక్తి కోల్పోతారని సూచిస్తోంది. స్వయం సమృద్ధి సాధించే విధంగా పథకాల రూపకల్పన అవసరం. నగదు బదలీ అనగానే మరో ఉపాధి రంగంలోకి వెళ్లకుండా కళ్లెం వేస్తున్నట్లేనని కూడా అంచనాలున్నాయి. దేశ ఉత్పాదకతపై ప్రభావం చూపే ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పడం మంచిది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News decision making free advice free consultation latest news life choices Personal Growth Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.