📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Free HPV Vaccine AP: క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: సీఎం

Author Icon By Aanusha
Updated: March 1, 2026 • 12:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Free HPV Vaccine AP: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడు గుర్రాల్లా పరుగులు పెట్టిస్తున్నామని, ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావివలసలో జరిగిన కార్యక్రమంలో ఆయన హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Read Also: Bomb Explosion Kakinada : ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం – సీఎం చంద్రబాబు

మహిళల ఆరోగ్యం కోసం ఉచిత టీకాలు

మహిళల్లో అత్యధికంగా వస్తున్న సర్వైకల్ క్యాన్సర్‌ను (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ప్రాథమిక దశలోనే అరికట్టేందుకు 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ టీకాలను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బయట మార్కెట్లో ఒక్కో టీకా ధర సుమారు రూ. 4,000 వరకు ఉంటుందని, అయితే రాష్ట్రంలోని 3.45 లక్షల మంది బాలికలకు వీటిని ఉచితంగా అందజేస్తున్నామని సీఎం వెల్లడించారు.

Free HPV Vaccine AP: The goal is a cancer-free society: CM

ఈ బృహత్తర కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 14.11 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు.కర్నూలులో రూ.50 కోట్లతో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నామని, తాజా బడ్జెట్‌లో వైద్య రంగానికి ఏకంగా రూ.19,305 కోట్లు కేటాయించామని తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cervical Cancer Prevention CM Chandrababu naidu Free HPV Vaccine AP Vizianagaram news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.