విజయవాడ Free Bus : ఎపిఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ (Women’s free travel) పథకం స్త్రీశక్తికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. దీంతో వారికి రూ.7 కోట్లకు పైగా ఆదా అయ్యింది. పథకం ప్రవేశపెట్టిన నాలుగు రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగా.. దాదాపు రూ.19 కోట్ల మేర వారికి ఆదా అయ్యింది. రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం అమలు తీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సచివాలయంలో సిఎం సమీక్షించారు. ఘాట్ రూట్లలోని ఆర్టీసీ సర్వీసుల్లో స్త్రీ శక్తి పథకం అమలుకు సిఎం అంగీకా రాన్ని తెలిపారు. ఈమేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీసీ ఉచితబస్సు (Free Bus) ప్రయాణ పథకం కింద ప్రయాణించే మహిళల గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ జిరాక్సుతో పాటు మొబైల్ డిజిటల్ లాకర్లోని సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మరోవైపు రోజువారీ ప్రయాణంలో తమకు ఎంతమేర ఆదా అవుతుం దన్న అంశాలను మహిళలు తమతో సంతోషంగా పంచుకుంటున్నట్టు అధికారులు సిఎంకు తెలిపారు. స్త్రీశక్తి పథకం వర్తించే సర్వీసులను మహిళలు సుల భంగా గుర్తించేలా బస్సు లోపలా బయటా బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యతన్నారు. ప్రజలు ఆనందించే ప్రతీ పథకాన్ని అవహేళన చేయటమే వైఎస్సార్సీ పనిగా పెట్టుకుందన్నారు.
స్త్రీ శక్తి పథకం అమలు: వైఎస్సార్సీకి కడుపుమంట
దిగ్విజయంగా అమలవుతున్న స్త్రీ శక్తి పథకాన్ని చూసి కడుపుమంటతో వైఎస్సార్సీ ఓర్వలేక పోతోందన్నారు. ఆధార్, పాన్, ఓటర్ కార్డులలాంటివి జిరాక్సులు, సాఫ్ట్ కాపీలు కూడా అనుమ తిస్తున్నామన్నారు. స్త్రీ శక్తి పథకం దిగ్విజయంగా అమలు కావడం వైఎస్సార్సీ వారికి నచ్చడం లేదన్నారు. లక్షలాది మంది ఆక్క, చెల్లెమ్మలకు ఈ పథకంద్వారా నేరుగా లబ్ధి చేకూరుతుంది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలులో వైఎ స్సార్సీ నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ, అక్కసుతో ప్రవర్తించడం పట్ల ప్రజలు తీవ్ర ఆక్షేపణ చేస్తున్నారన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :