📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Free Bus : రేపటినుంచే మహిళలకు ఉచిత బస్సు: రాష్ట్ర రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Author Icon By Shravan
Updated: August 14, 2025 • 8:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కడప Free Bus : రేపటినుంచే మహిళలకు ఉచిత బస్సు: రాష్ట్ర రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికి రేపటి నుండి శ్రీకారం చుట్టనుంది. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్సక్స్ పథకంలో భాగంగా స్త్రీశక్తి పథకం కింద మహిళలకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు. ఉచిత ప్రయాణం మహిళలకు వరంగా చెప్పవచ్చు. దేశంలోనే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇతర రాష్ట్రాల కంటే ఆదర్శంగా ఉంటుంది. ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్ర దినోత్సవం (Independence Day) పురస్కరించుకొని ప్రారంభించ నున్నామని ఈ పథకాన్ని పరిశీలన ద్వారా మరింత అధ్యయనం చేసి ఇంకా మంచి ఏర్పాట్లు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం అని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రోడ్డు రవాణా సంస్థకు 11,495 బస్సులు ఉన్నాయి ఇందులో ఆర్టీసికి సంబంధించి 8716 బస్సులు, అద్దె బస్సులు 2779 ఉన్నాయి.ఈ బస్సుల ద్వారా ఆర్టీసీకి ఏడాదికి 7176 కోట్ల ఆదాయం వస్తుంది. సగటున రోజుకు ఆర్టీసీకి 15 కోట్లు ఆదాయం వస్తుంది. ప్రతిరోజు ఆర్టిసి 33.55 లక్షల మంది ప్రయాణికులను గమ్యాన్ని చేరుస్తోంది. 38.59 కిలోమీటర్ల పరిధిలో ఆర్టీసీకి నెట్వర్క్ ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిరోజు 14,123 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుతోందన్నారు. ప్రతి బస్సులో ఆక్యుపెన్సి రేట్ 73.67 శాతం.

అయితే ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రేటు ఏ మేరకు పెరుగుతుందో పరిశీలిం చాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సులు అదనంగా తీసుకోవాలని నిర్ణయించాం. రద్దీకి అనుగుణంగా దాదాపు 1500 మంది డ్రైవర్లను పిలిచిన వెంటనే డ్యూటీకి వచ్చేలా ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి తెలిపారు. పరిస్థితిని బట్టి మహిళకు మరింత మెరుగైన సేవలు ఆర్టీసీ ద్వారా ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని తెలిపారు. రద్దీకి అనుగుణంగా మహిళలకు ఆర్టీసీ డిపోల్లో (RTC Depots) కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఉచిత మహిళల ప్రయాణం ద్వారా ఆర్థికంగా ప్రతి ఏటా 2400 కోట్లు భారమైన వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

ఈ పథకాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ఇతర రాష్ట్రాలు ఆంధ్ర వైపు చూసేలా చేస్తామని రాంప్రసాదొడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదురకాల బస్సులే రాష్ట్రంలో 85 శాతం పైబడి ప్రయాణికులను రవాణా చేయడం గుర్తుంచుకోవాలని వెల్లడించారు. అందుకే ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణాన్ని కల్పించినట్లు వివరించారు. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ అధ్యయనం తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. అంతేకాక ఎన్నికల హామీలన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేస్తామని రాంప్రసాదొడ్డి తెలిపారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/trump-warns-putin-ahead-of-meeting/international/530034/

Breaking News in Telugu Free Bus Travel Latest News in Telugu Public Transport RTC free travel Today news Women Empowerment women safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.