📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

fog: పొగమంచు కాటేసింది!

Author Icon By Sudha
Updated: December 18, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పొగమంచు పగమంచుగా మారి తెల్లవారు జామున ప్రమాదాలకు కారణమౌతోంది. శీతా కాలపు చలితోపాటు పొగమంచు కారణంగా రాత్రి వేళ ప్రయాణం చేస్తున్న వాహనాలకు ముందు దారి కనపడటం లేదు. దారి మసక మసకగా మంచుతెరలు, పొగమంచు తెరలు అడొచ్చి ప్రయాణం ఒక అడుగుకూడా ముందుకు సాగడం లేదు. దారిలో ఎదురుగా ఏవాహనం వస్తోందో ఎటువైపు నుంచి వస్తోందో కానరావడం లేదు. ముందు వాహనం ఉందో, ఆటో ఉందో సైకిలే ఉందో కనపడక డ్రైవర్లు ప్రమాదానికి చేరువవుతున్నారు. ఢిల్లీ పౌరులకు ఒకపక్క కాలుష్య సమస్యలుంటే నగరమంతా పొగ మంచుకు తోడు ఇతరత్రా సమస్యలు పీడిస్తున్నా యి. రాజధాని డేంజర్ జోన్ గా మారిందన్న విషయం తెలిసిందే. ఇలాంటి సంక్లిష్టమైన వాతావరణం ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంది. యమునా ఎక్స్ప్రెస్వే ఓ యమపాశంగా మారి తాజాగా జరిగిన ప్రమాదంలో కనీ సం 13 మంది మృతిచెందారు. ఆ రహదారిపై దట్టంగా అలుముకున్న కాలుష్యంతో కూడిన పొగమంచు(fog) మను షుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సందర్భాలు కనప డుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో దారి కనపించక ఆగ్రా నోయిడా రహదారిపై ఎనిమిది బస్సులు, మూడు కార్లు ఢీకొన్నా యి. ధ్వంసమై ఆనవాళ్లు లేకుండాపోయాయి. ఈ ప్రమా దంలో ఆవాహనాలన్నీ ఒకేసారి వరుసగా ఢీ కొనడంతో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన 43 మంది క్షతగాత్రులను స్థానికంగా ఉండే ఆసుపత్రులలో వైద్యానికి చేర్చారు. ఉత్తరప్రదేశ్లోని బలేవ్ పోలీస్ స్టేషన్
పరిధిలో రహదారిపై 127వ నెంబరు మైలురాయి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందుగా రెండు వాహ నాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అటుపై వస్తున్న మరి కొన్ని వాహనాలు స్పీడుగా వచ్చి గుద్దుకున్నాయి. రోడ్డు విజిబిలిటీ ఒక మీటర్ వరకే ఉంది. ఢీ కొన్న వాహనా లన్నీ తుక్కుతుక్కయిపోయాయి. నుజ్జునుజ్జయిన వాహ నాలు అగ్నికీలలకు గురై పనికిరాకుండాపోయాయి. గత 7 ఏళ్లుగా ఎన్నడూలేని స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలే కాకుండా దట్టమైన పొగమంచు చుట్టేసుకుని ఆ ప్రాంతం లో వాహనాలను నిలిపివేసింది. దానికితోడు తీవ్రస్థాయి లో వాయుకాలుష్యం కూడా. ఇప్పటికే ఢిల్లీ వాయు నాణ్యత తీవ్ర ప్రమాదకరస్థాయికి చేరుకొంది. వాయు నాణ్యత సూచీ గణనీయంగా పడిపోయింది. ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 493 మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పొగమంచు మరింత ప్రమాదకర మే. పొగమంచు కారణంగా జరిగే ప్రమాదమైనా తీవ్రమే. ముందు వాహనం ఆగిన ఆచూకీ తెలియక వెనుక స్పీడు గా వచ్చే వాహనం సడెన్ బ్రేక్ వేయడమూ కష్టమే. అందుచేతనే మొన్న జరిగిన ప్రమాద తీవ్రత అలాఉంది. ఇలా ఒకటికి మించి వాహనాలు వరుసబెట్టి ఢీ కొట్టు కుంటే మంటలు చెలరేగుతాయి. ఆ వాహనాల్లో ప్రయా ణికులు ఉండి ఏమాత్రం మంటలు అంటుకున్నా సజీవ దహనం అయ్యేవారే. అదృష్టవశాత్తూ ప్రమాదస్థాయి అంత వరకే పరిమితమైంది. వాళ్లంతా ఇలాంటి పొగమంచు ప్రమాదం ఊహించక, చలికి జాగ్రత్తలు తీసుకుని మఫ్లర్లు, స్వెటర్లు, ధరించిఉన్నా ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా, పొగమంచు చలిగాలులు ఎక్కువగా ఉన్నచోట రాత్రిపూట ప్రయాణాలు లేకుండా ఆ రహదారుల్లో నిషేధం విధిం చడం మంచిది. ఇలాంటి సందర్భాల్లో మంటలకు ఆహు తైన వారి మృతదేహాలను గుర్తించేందుకు మళ్లీ డిఎన్ఎ నమూనాల పద్ధతి అనుసరించాల్సిందే. క్షతగాత్రుల్లో కూడా కొంతమంది చికిత్స సమయంలో మృతిచెందారు. సంతాపాలు, దిగ్భ్రాంతులు, విచారాలు, పరిహారాలు కన్నా ప్రమాదాలు జరుగకుండా చూడడం ముఖ్యం. రాత్రి ప్రయాణాల మీద ఏమాత్రం అవగాహన ఉన్నా మరిన్ని జాగ్రత్తలు తీసుకునే వీలుంది. ఉత్తరాదికి చలిగాలులు, కాలు ష్యం, పొగమంచు (fog) శాపంలా పరిణమించాయి. ఇతర ప్రాంతాల్లోనూ కొన్ని సమస్యలవల్ల ఎన్నో ప్రమాదాలు జరుగు తున్నాయి. రోజుకో అతిపెద్ద ప్రమాదం వాటిల్లి ఎక్కువ మంది ప్రయాణికులను బలితీసుకుంటున్న విషయం విది తమే. ఢిల్లీలో కాలుష్యం కొరకరాని కొయ్యగా మారింది. ఎంతకూ దానిని రూపుమాపే మార్గాలు కనిపించడం లేదు. ఈ అంశంపై ఇటీవల పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు నిరసన ప్రదర్శన కూడా నిర్వహించాయి. పసి కందులు కాలుష్యానికి బలైపోతున్నారని, వృద్ధులుకాలుష్య కారణంగా మరింత వృద్ధాప్య బాధలకు, ముఖ్యంగా శ్వాస కోశ సమస్యలకుగురై ఆస్పత్రుల పాలవుతున్నారని గగ్గోలు పెట్టారు. అంతకుముందే సుప్రీంకోర్టు కూడా ఢిల్లీకాలుష్యం అంశంపై ఓ స్థిర నిర్ణయానికి వచ్చింది. అందరూ అను కున్నట్లు కాలుష్య పాపాన్ని ఆ ప్రాంత రైతుల మీద నెట్టి వేయరాదని గట్టిగా చెప్పింది. అదే పరిష్కారమైతే గతంలో కన్నా వంటకాలుష్య వ్యర్థాలు మండించడం తగ్గింది. కానీ ఢిల్లీ కాలుష్యస్థాయి ఏమాత్రం తగ్గలేదని అభిప్రాయప డింది. మొన్నటి పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్ర యంలో 200 విమానాలు రద్దయ్యాయి. పంట వ్యర్థాల దగ్ధం చేయవద్దని ప్రభుత్వాలు రైతుల మీద జరిమానాలు వేసి తీవ్ర కార్యా చరణ చేపట్టడంతో అలాంటి చర్యలు బాగా తగ్గిపోయాయి. మహా ఉంటే కేవలం ఐదు శాతం మాత్రమే ఉండొచ్చునని కాలుష్య నివారణ సంస్థలు తేల్చి చెప్పాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. యమునా నదికాలుష్య విషయంపై ఎంతో ఆశపెట్టుకున్న కేంద్రం ఢిల్లీ కాలుష్యం గురించి ప్రత్యేక శ్రద్ధ ప్రణాళికల తో కార్యాచరణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Cold wave Dense Fog fog latest news Telugu News Weather Update Winter weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.