📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Today News : Floods – వరద ముంపులో వందలాది గ్రామాలు

Author Icon By Shravan
Updated: August 22, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చింతూరు/కూనవరం Floods : గోదావరి- శబరి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy rains) దంచికొడుతున్నాయి. దాంతో భద్రాచలం వద్ద గోదావరి, చింతూరు వద్ద శబరి నదులు ఉగ్రరూపం దాల్చి పొంగిప్రవహిస్తున్నాయి. వరద ప్రభావంతోనాలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎపిలోని ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం, ఎటపాక మండలాల్లోని వందలాది గ్రామాలను గోదావరి వరద నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు మొత్తం జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. అనేక చోట్ల రహదారులు నీటమునగ టంతో అవకాశం ఉన్న చోట్ల పడవలు, కాస్త వరద తక్కువ ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లపై ప్రజలు వరదనీటిని దాటి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం గోదావరి నది నీటిమట్టం 52.1అడుగులు దాటి మూడవ ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉంది. చింతూరు వద్ద శబరి నది నీటి మట్టం 37.5 అడుగులు దాటింది. తెలంగాణాని భద్రాచలం నుండి ఎపిలోని ముంపు మండలాలైన నెల్లిపాక, కూనవరం, వి.ఆర్.పురం, చింతూరుతో పాటు ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి యన్.హెచ్.30 మునిగిపోయింది. దాంతో రెండు రాష్ట్రాల మద్య రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి.

శబరి వరదలతో రహదారులు మునిగిపోవటంతో వందల గ్రామాలు చిక్కుముడి

భద్రాచలం నుండి నెల్లిపాక మీదుగా కూనవరం, వి.ఆర్.పురం మండలాలను కలిపే రహదారి పూర్తిగా మునిగిపోయింది. చింతూరు నుండి ఒరిస్సాను కలిపే జాతీయ రహదారి యన్.హెచ్. 326 మునిగిపోవటంతో వందలాది వాహనాలు గమ్యం చేరే మార్గం లేక చింతూరు వద్ద బారులుదీరాయి. శబరి నది ఎగపోటు కారణంగా కుయుగూరు వాగు ఉప్పొంది చింతూరు మండల కేంద్రాన్ని చుట్టుముడుతుంది. దాంతో వందలాది ఎకరాల్లో పంటలు నీటిమునిగాయి. చింతూరు నుండి వి.ఆర్.పురం మండలాన్ని కలిపే 33 కిలోమీటర్ల రహదారి అనేక చోట్ల మునిగి పోవటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వి.ఆర్.పురం మండల (V.R.Puram Mandal) కేంద్రాన్ని కలిపే ఉమ్మడివరం వంతెన ఇప్పటికే కొట్టుకొని పోవటంతో ఆ మండలంలోని అనేక గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు లేకుండాపోయింది. కూనవరం-వి.ఆర్.పురం మండలాలను కలిపే శబరి వంతెన వద్ద గోదావరి నీరు శబరి నదిలొకి ఎగబాకుతుంది. వరదభయంతో ముంపు మండలాల్లో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది.

గోదావరి–శబరి వరదలతో ముంపు భయం, ఆర్‌అండ్‌ఆర్ కోరుతున్న ప్రజలు

ప్రజలు వరద భయంతో వణుకుతున్నారు. 2022 వరదలు పునరావృతం అవు తాయన్న భయం ముంపు మండలాల ప్రజలను వెంటాడుతుంది. గురువారం అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద భాధిత కుటుంబాలను పరమర్శించి, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ముంపును దృష్టిలో పెట్టుకోని అధికారులంతా నిత్యం అందుబాటులో ఉంటు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. నిత్యం వరదలతో ఈ భాధలు పడలేమని, తమకు ఆర్ అండ్ ఆర్ చెల్లించి పునఃరావా కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ను ముంపు ప్రాంతాల ప్రజలు కోరారు. బంగాళా ఖాతంలో వరుస వాయుగుండాల కారణంగా గోదావరి, శబరి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.

గోదావరి–శబరి ఉగ్రరూపం: రాకపోకలు నిలిచిపోయి ప్రజల్లో భయం

ఎడతెరపి లేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. శబరి నదికి ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండుకుండాల ఉండటంతో ఏ క్షణమైనా వరద నీటిని దిగువకు వదులుతారు అనే వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. దాంతో ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతా లకు తరలిపోవటానికి సిద్దంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది గోదావరి, శబరి నది ఉగ్రరూపంతో ముంపుమండలాల తాజా పరిస్థితితో పాటు ముంపు మండలాల మీదుగా ఛత్తీస్ఫడ్, ఒరిస్సాలకు పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది గ్రామాలకు రహదారి సౌకర్యం లేకుండా పోయింది. ప్రజలు వరద భయంతో బిక్కు బిక్కు మంటున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/minister-saket-gets-huge-reward-and-deputy-collector-job/andhra-pradesh/534166/

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Telugu News online Telugu News Paper Villages Submerged

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.