📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Fire Accident: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

Author Icon By Sharanya
Updated: May 18, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ నగరంలో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం హృదయ విదారక ఘటనగా నిలిచింది. ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. వివరాల ప్రకారం, ఒక వాణిజ్య భవనంలో ఉన్న షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయని, మంటలు చెలరేగి, తక్కువ సమయంలోనే మూడంచెల భవనమంతా అగ్నికి ఆహుతి అయింది.

మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన 17మంది

ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో 14మంది ఆసుపత్రికి తరలించగానే చికిత్స పొందుతూ మరణించారు. మృతులలో ఎక్కువ మంది అక్కడ పనిచేస్తున్న కార్మికులు, దుకాణ ఉద్యోగులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన అనేక మందిని మలక్‌పేట యశోదా, డీఆర్‌డీఓ, అపోలో ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేర్పించారు.

ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి స్పందన

భారీ ప్రాణ నష్టం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థితిని సమీక్షిస్తూ, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు స్పందన

17మంది మృతి తీవ్ర బాధాకరం అన్న చంద్రబాబు హైదరాబాద్లోని గుల్జార్ హౌస్ వద్ద అత్యంత విషాదకరమైన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ స్పందన

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్ని ప్రమాద ఘటన పైన స్పందించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన తన మనసును కలచి వేసిందని ఆయన అన్నారు ఈ ప్రపంచంలో 17 మంది మృతి చెందడం బాధాకరమైన పేర్కొన్న ఆయన బాధ్యత కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

కేంద్ర మంత్రులు, ఇతర నేతల స్పందన

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ప్రభుత్వం బాధితులకు తగిన సహాయం అందించాలని కోరారు. అగ్నిప్రమాద ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది 10కిపైగా ఫైర్ టెండర్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటల అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి కారణమైన భవన నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయా అనే దానిపై విచారణ జరుగుతోంది.

Read also: Revanth Reddy: అగ్ని ప్రమాద ఘటనలో చనిపోయిన మృతులకు సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

#ChandrababuNaidu #DisasterResponse #FireAccident #GulzarHouseFire #Hyderabad #PawanKalyan Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.