📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Polythene: పాలిథిన్‌ వాడకంపై జరిమానా విధించాలి: రఘు రామకృష్ణరాజు

Author Icon By Anusha
Updated: October 12, 2025 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన పాలిథిన్‌ (Polythene) వినియోగం మళ్లీ చర్చకు వచ్చింది. ఆధునిక జీవనశైలిలో భాగమైన ఈ ప్లాస్టిక్‌ సంచులు ఇప్పుడు ప్రకృతికి, పశువులకు, మనిషికి కూడా భయంకర ముప్పుగా మారాయి.

గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇవే దర్శనమిస్తున్నాయి. వీటిని ఉపయోగించడం సులభమే కానీ, భూమిలో ఇవి కరుగవు. ఫలితంగా నేల పూడిక దెబ్బతింటుంది. వ్యవసాయ భూముల ఉత్పత్తి శక్తి తగ్గిపోతుంది.

Tirupati Crime News: భార్య కాపురానికి రావట్లేదని భర్త ఏం చేసాడంటే?

ఇక పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చెత్త కుప్పల్లో పశువులు ఆహారం కోసం వెతుకుతు పాలిథిన్‌ (Polythene) సంచులు తిని తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాయి. చాలా సార్లు అవి ప్రాణాలు కోల్పోతున్నాయి కూడా.

పర్యావరణానికి హాని కలిగించే ఈ సమస్యను తక్షణమే అరికట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు పలుమార్లు నిషేధం విధించినా.. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఈ నిషేధం కాగితాల మీద మాత్రమే మిగిలిపోతోంది.

కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు (Raghuramakrishna Raju) పాలిథిన్‌ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాలిథిన్‌ సంచులు ఉపయోగిస్తున్న వ్యాపారులపై జరిమానాలు విధించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ప్లాస్టిక్‌ వాడకం తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు.తాజాగా రఘురామకృష్ణరాజు .. ఆకివీడులో స్థానిక వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. పాలిథిన్ సంచులు పర్యావరణానికి నష్టం కలిగించడమే కాక ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.

 Polythene

అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలని

అలాంటి పాలిథిన్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. అలా కాకుండా ఎవరైనా పాలిథిన్ సంచులు అమ్మినా.. వాడినా.. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.పాలిథిన్ వినియోగాన్ని అరికట్టడం కోసం భారీ ఎత్తున జరిమానాలు విధించాలని సూచించారు.

ఆదివారం నుంచి ఆకివీడులో కఠిన నియమాలు అమలు చేయాలని తెలిపారు. దీనిలో భాగంగా ఎవరైనా దుకాణం నిర్వహకుడి వద్ద ప్లాస్టిక్‌ సంచులు నిల్వ ఉన్నా.. అమ్మినా సదరు షాపు యజమానికి వెయ్యి రూపాయలు జరిమానా (fine) విధించాలని సూచించారు. ఎవరైనా పండ్లు, కూరగాయలు, మాంసం, సరుకులు, ఆహార పదార్థాలు,

వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని

తదితర వస్తువులను పాలిథిన్ సంచుల్లో (polythene bags) తీసుకెళ్తే.. వారికి రూ.100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం మళ్లింపు రహదారిని.. పూర్తిస్థాయిలో వినియోగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆక్రమణల తొలగింపు అంశంలో ఎలాంటి రాజీపడొద్దని సూచించారు.

ప్రజలు, షాపుల నిర్వాహకులు.. తమ దుకాణాలు, నివాసాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేసి.. వాటిని పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. ప్రజలు, ప్రభుత్వం సమిష్టి క‌ృషితో ఆదర్శవంతమైన ఆకివీడుగా తీర్చిదిద్దవచ్చని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news plastic pollution Raghu Rama Krishna Raju Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.