అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సంచలనం రేపిన ఫైల్స్ దగ్ధం (Burning files) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఆర్డీవో మురళి (Former RDO Murali) ని సీఐడీ అధికారులు చివరకు అరెస్టు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు.ఫైళ్ల దగ్ధం ఘటన జరిగినప్పటి నుండి మురళి కనిపించకుండా వెళ్లిపోయారు. ఆయన్ని పట్టుకునేందుకు సీఐడీ అధికారులు మదనపల్లె, తిరుపతి, హైదరాబాద్‌ల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎట్టకేలకు తిరుపతిలోని కేఆర్ నగర్ ప్రాంతంలో ఆయనను గుర్తించి అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ స్వయంగా ప్రకటించారు.
ముందస్తు బెయిల్‌కు కోర్టుల అడ్డంకి
మురళి ముందుగా హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరారు. కానీ న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో మురళి సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ అనంతరం, “అరెస్టు చేసిన తర్వాత బెయిల్ ఇవ్వాలి” అనే నిబంధనతో ఉత్తర్వులు జారీ చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో వెంటనే విడుదల
సుప్రీం తీర్పు ప్రకారం, సీఐడీ అధికారులు మురళిని అరెస్టు చేసి వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. ఈ ఘటనతో మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక మలుపు తలెత్తింది.
కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది
ఫైళ్ల దగ్ధం కేసు మదనపల్లెలో ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం కోల్పోయే స్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం సీఐడీ అధికారులు కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. మరికొందరిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also : YSR : త్వరలో అభ్యుదయ రైతులకు వైఎస్ఆర్ పేరుమీద అవార్డులు – భట్టి