వేధిస్తున్న ఎరువుల కొరత
ఖమ్మం : ఉమ్మడి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల పంటలకు ఊపిరి పోసినట్లయింది ఈ ఏడాది ప్రారంభంలో నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించిన ఎప్పటికీ సరైన వర్షాలు కురవలేదు దీంతో మొదట్లో పంటలు సాగు చేసే రైతులు వర్షాలు లేక రెండు మూడు దఫాలుగా దుక్కిలో విత్తనాలను (seeds) నాటవలసి వచ్చింది. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది వానల కోసం రైతులు నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు. జూన్ నెలలొ వర్షాలకు వేసిన విత్తనాలు మొలవక పోవటం అన్నదాతలను ఆందోళన కలిగించింది.
వ్యవసాయ శాఖ
కాలం వచ్చాక పెరిగిన ఎండ వడగాల్పుల వల్ల వేసిన విత్తనాల మొలకలు కూడా ఎండి పోయాయి ఖమ్మం జిల్లాలో వానాకాలంలో 5.80 లక్షల ఎకరాల్లో ఎకరాల్లోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6.30 లక్ష ఎకరాల్లో పంటలు పండించాలని వ్యవసాయ శాఖ (Department of Agriculture) ప్రణాళిక సిద్ధం చేసింది.ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు కుంటలు బావులలో బోర్లలో నీరు చేరటంతో వరి నాట్లు వేసే పనుల్లో రైతులు నిమగ్నమై ఉన్నారు వీటితోపాటు వర్సాభా పరిస్థితి వల్ల ఇంకా సాగు చేయాల్సిన మొక్కజొన్న జొన్న కంది మిరప తోటలను పూర్తిస్థాయిలో వేయలేకపోయారు.
అధిక రేట్లకు
ఈ వర్షాల వల్ల ఆ పంటలను కూడా ఇప్పుడు వేసే అవకాశం ఉంది ఈ దశలో రైతులకు అవసరమైన యూరియా కాంప్లెక్స్ డిఏపి లాంటి ఎరువులు మార్కెట్లో దొరకటం లేదు ఎరుల కోసం రైతులు దుకాణాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు ప్రధానంగా ఖమ్మం కొత్తగూడెం భద్రాచలం పాల్వంచ మధిర సత్తుపల్లి ఇల్లందు తదితర ప్రాంతాల్లో రైతులు ఎరువుల దుకాణాల ముందు ముందు క్యూలు కట్టి నిల్చుంటున్నారు ఒకవైపున ప్రభుత్వం ఎరువులకు ఎలాంటి కొరతలేదని ఎరువులు బ్లాక్ మార్కెట్లో తరలించిన గాని అధిక రేట్లకు వికరించిన గాని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నప్పటికీ వ్యాపారుల్లో మార్పు రావటం లేదు. ఫలితంగా ఒకవైపు ఎరువుల సరఫరా తక్కువగా ఉంటే మరోవైపు మార్కెట్లో ఉన్న ఎరువులు కూడా వ్యాపారులు రైతులకు అందించడం లేదు దీంతో ఉమ్మడి జిల్లాలో ఎరువుల కొరత తీవ్రంగా ఏర్పడింది.
ఎరువులు ఎందుకు ముఖ్యమైనవి?
ఎరువులు వ్యవసాయంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి నేలలో పోషకాలు పెంచి, పంటల వృద్ధి మరియు దిగుబడిని మెరుగుపరుస్తాయి.
ఎరువుల తండ్రిగా ఎవరిని పరిగణిస్తారు?
ఎరువుల పరిశ్రమకు “తండ్రి”గా పరిగణించబడే వ్యక్తి జర్మన్ రసాయన శాస్త్రవేత్త జస్టస్ వాన్ లీబిగ్ (Justus von Liebig) గారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Governor Jishnu Deva Varma: నర్సులే సమాజానికి ప్రాణదాతలు– గవర్నర్ జిష్ణుదేవవర్మ