📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Fertility Center : యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రానికి తాళాలు

Author Icon By Shravan
Updated: July 30, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : విజయవాడలో యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రం (Fertility Center) పేరుతో నడుస్తోన్న ఆస్పత్రికి సిబ్బంది తాళాలువేసి అందుబాటులో లేకుండా పోయారు. పోలీసులు వచ్చిన సమయంలో ఆస్పత్రి గేటుకు తాళాలు వేసి ఉండడంతో బయట నుండి చూసి వెళ్లిపోయారు. ఈ కేంద్రాన్ని ఎన్టిఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. సుహాసిని పరిశీలించారు. ఆస్పత్రి గేటుకు తాళాలు వేసి ఉండడంతో సిబ్బందికి ఫోన్ చేశారు. కిషోర్ అనే – వ్యక్తి వచ్చి తాళాలు తీశారు. అయితే, ఆస్పత్రిలో రికార్డులులేవు. యూనివర్సల్ పేరుతో ఆస్పత్రిని నడుపుతు న్నారని, సృష్టితో సంబంధం లేదని సిబ్బంది చెబుతున్నారు. అయితే, సృష్టి పేరుతో ఉన్న రికార్డులను ఎందుకు మాయం చేశారని, ఆస్పత్రికి ఎందుకు తాళాలు వేశారని సిబ్బందిని డిఎం అండ్ హెచ్ సుహాసిని ప్రశ్నించారు. యూనివర్సల్ సృష్టి పేరుతో నడుస్తున్న ఆస్పత్రిపై తమకు ఫిర్యాదులు రాలేదని ఆమె తెలిపారు. అయితే, ఆస్పత్రికి తాళాలు వేయడం, రికార్డులు మాయం చేయడంపై సమగ్ర విచారణ జరిపి కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. తమ విచారణలో అక్రమాలు జరిగాయని తెలిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పేరే వేరు.. అంతా సృష్టి : ఐదేళ్ల క్రితం సృష్టి

పేరుతోనే నిర్వహించిన కేంద్రాన్నే యూనివర్సల్ సృష్టి అంటూ బోర్డు మార్చారు. అయితే, గతంలో సృష్టి పేరుతో ఉన్న సిబ్బందే వ్యవ హారం అంతా నడిపిస్తున్నారు. ఆ కేంద్రం వైద్యు లు డాక్టర్ నమ్రతపై నిషేధం ఉండటంతోపాటు పలు ఆరోపణలూ ఉన్నాయి. దీంతో, ప్రస్తుతం విజయవాడ సెంటర్ను డాక్టర్ కరుణ, వైశాలి పేరుతో నడుపుతున్నారు. వీరిద్దరూ కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. విజయవాడ సూర్యారావుపేటలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో ఆస్పత్రి ఉండేది. దీనిపై అనేక ఆరోపణలు రావడంతో అప్పట్లోనే వైద్యురాలు నమ్రతపై కేసు కూడా నమోదైంది. కొంతకాలం తర్వాత మళ్లీ విజయవాడ బెంజిసర్కిల్ రామ చంద్రనగర్ కంచుకోట వీధిలో యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభిం చారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ యూనివర్సల్ (Universal) పేరు ఉన్నా కార్యకలాపాలన్నీ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతోనే డాక్టర్ నమ్రత ఆధ్వ ర్యంలో నడుస్తున్నాయి.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Handri-Neeva : హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా 3850 క్యూసెక్కుల నీరు తరలింపు

Breaking News in Telugu Clinic Closure fertility Health News Latest News in Telugu Telugu News Universal Srushti

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.