📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Chevireddy Bhaskar Reddy : అస్వస్థత కు గురైన చెవిరెడ్డి

Author Icon By Sudheer
Updated: June 21, 2025 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. బెంగళూరులో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు చెవిరెడ్డిని విజయవాడకు తరలించి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జూలై 1 వరకు రిమాండ్ (Remand ) తీసుకున్నారు. ఈ క్రమంలో చెవిరెడ్డి జైల్లో ఉండగా ఛాతీ నొప్పితో అస్వస్థత(Feeling Unwell with Chest Pain)కు గురయ్యారు. వెంటనే జైలు అధికారులు స్పందించి ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించి, సాయంత్రం వరకు పర్యవేక్షణలో ఉంచాలని సూచించినట్లు సమాచారం.

విచారణ సమయంలో చెవిరెడ్డి విచారణ అధికారులను ఎదుర్కొంటూ, వారిని ప్రశ్నలతో నిలదీసినట్టు తెలుస్తోంది. అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తనపై ఒత్తిడి తెస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. చదివిన డాక్యుమెంట్లపై సంతకాలు చేయమని ఒత్తిడి చేసారని, దానికి నిరసనగా వాటిని చించేసినట్లు సమాచారం. ఇదే అంశాన్ని ఆయన న్యాయస్థానంలోనూ ప్రస్తావించారు. తాను విచారణకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా, అప్రతిష్ఠ కలిగించే విధంగా అరెస్ట్ చేశారని న్యాయమూర్తికి విన్నవించారు.

సిట్ అధికారులు తమ దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడుల విచారణ ఫుటేజీని ఏసీబీ కోర్టుకు సమర్పించారు. అయితే చెవిరెడ్డి ఆరోపణలతో విచారణ ప్రక్రియపై నూతన దృష్టి కేంద్రీకరించింది. వైద్యులు పూర్తిస్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చెవిరెడ్డికి అవసరమైన చికిత్సపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేసు స్వరూపం, రాజకీయ ప్రాధాన్యత నేపథ్యంలో ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Read Also : Rakul Preet Singh: ‘ఫిట్ ఇండియా కపుల్’ అవార్డు ర‌కుల్‌ప్రీత్ సింగ్ దంపతులకు

Chevireddy Bhaskar Reddy Google News in Telugu hospital jail

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.