Fee Rules: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు పెరగడంతో ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా, నిజమైన లబ్ధిదారులు మాత్రమే ప్రయోజనాలు పొందేలా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, ఇన్‌కమ్ సర్టిఫికెట్ అప్లికేషన్‌కు రేషన్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేసింది.
Read also:Red Fort Blast : రెడ్ ఫోర్ట్ పేలుడులో ఫొరెన్సిక్ నివేదికతో పెద్ద కుట్ర బహిర్గతం …
ఇప్పటి వరకు కొందరు తప్పుడు ఆదాయ పత్రాలు సమర్పించి పథకం ప్రయోజనాలు పొందుతున్నారని వచ్చిన ఫిర్యాదులతొ, కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇక మీసేవ కేంద్రాల్లో ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కు అప్లై చేసినప్పుడు రేషన్ కార్డ్ డేటా నిజమేనా అనే దానిని సిస్టమ్ ఆటోమేటిక్‌గా వెరిఫై చేస్తుంది. రేషన్ కార్డు లేకపోతే “Missing Food Security Card” అనే మెసేజ్ వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం, ఈ చర్య వల్ల అర్హులు-అనర్హుల మధ్య స్పష్టత వస్తుందని, అక్రమంగా ప్రయోజనాలు పొందే వారి సంఖ్య తగ్గుతుందని భావిస్తోంది.
రేషన్ కార్డు లింక్ ఎందుకు తప్పనిసరి చేశారు?
Fee Rules: రేషన్ కార్డు(Ration card) రాష్ట్రంలో ఆదాయ స్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన రికార్డు ఇస్తుంది. చాలా మంది విద్యార్థులు తక్కువ ఆదాయం చూపించి సబ్సిడీ పొందుతున్నారనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో, ఈ కార్డు లింక్ చేయడం ద్వారా ప్రభుత్వం అసలైన ఆర్థిక స్థితిని నిర్ధారించే అవకాశం పెరుగుతోంది. అదే సమయంలో, ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేని కుటుంబాలు వెంటనే రేషన్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. దీంతో పౌరుల డేటా మరింత పారదర్శకంగా మారి, సంక్షేమ పథకాల పంపిణీ కూడా సిస్టమైజ్డ్ అవుతుంది.
లబ్ధిదారులపై దీని ప్రభావం
నిజమైన అర్హులకు ప్రయోజనం సులభంగా అందుతుంది తప్పుడు ఆదాయ పత్రాలతో రీయింబర్స్‌మెంట్ పొందే అవకాశం తగ్గుతుంది మీసేవ దరఖాస్తుల పరిశీలన వేగవంత అవుతుంది కుటుంబ ఆర్థిక స్థితి డేటా ప్రభుత్వానికి స్పష్టంగా అందుతుంద ఈ స్క్రీనింగ్ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో రీయింబర్స్‌మెంట్ జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండే అవకాశముంది.
రేషన్ కార్డు లేకుండా ఇన్‌కమ్ సర్టిఫికేట్ వస్తుందా?
కాదు. కొత్త నిబంధనల ప్రకారం రేషన్ కార్డు తప్పనిసరి.
“Missing Food Security Card” మెసేజ్ వస్తే ఏం చేయాలి?
మీ కుటుంబానికి రేషన్ కార్డు జారీ కానట్లుగా అర్ధం. ముందుగా రేషన్ కార్డు కోసం అప్లై చేయాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also: