ఇటీవల పెళ్లిళ్లు పెటాకులుగా మారుతున్నాయి. క్షణికమైన సుఖాల కోసం కట్టుకున్న అనుబంధాలను, కన్న బిడ్డలను కూడా దూరం చేసుకుంటున్నారు. కుటుంబ అనుబంధాల కంటే వ్యక్తిగత సుఖాల కోసం ఎంతటికైనా బరితెగిస్తున్నారు. తాజాగా కట్టుకున్న భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి ఓ భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోతే కూతురును పట్టించుకునేవారుండరని ఆ తండ్రి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. కూతురుకు విషం(Poison) ఇచ్చి, అనంతరం తాను కూడా ప్రాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన రణస్థలం మండలం సంచాం గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సంచాం గ్రామానికి చెందిన సంతోష్ కు, జీరుపాలెం గ్రామానికి చెందిన స్వాతికి 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతోష్ కు ఇద్దరు భార్యలు ఉన్నారు. విశాఖలో వేర్వేరు ఇళ్లల్లో నివసిస్తున్నారు. అయితే స్వాతికి రాంబాబుతో వివాహేతర సంబంధం ఉంది. సంతోష్ వృత్తిరీత్యా డ్రైవర్. మొదటి భార్యకి పిల్లలు పుట్టకపోవడంతో స్వాతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన రెండేళ్ల నుంచి నిత్యం భార్య స్వాతితో గొడవలు జరుగుతున్నాయి.
Pawan: అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్ మెరుగైన చికిస్త కోసం హైదరాబాద్ ప్రయాణం
ఉదయం వెళ్లి రాత్రి ఇంటి వచ్చిన భార్యతో గొడవపడి..
పెద్దపాడు గురుకుల పాఠశాలలో చదువుతున్న కుమార్తె హైమా(11)కి దసరా సెలవులు ఇవ్వడంతో ఆమెను ఇంటికి తీసుకుని రావాలని స్వాతిని శనివారం పంపించాడు. అయితే ఆమె పెద్దపాడు వచ్చి రాంబాబుతో(Rambabu) తిరిగి ఆరోజు రాత్రి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లింది. ఉదయం వెళ్లిరాత్రి వరకు ఏం చేశావంటూ సంతోస్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ కట్టుకున్న భార్య మరొకరితో సంబంధం పెట్టుకుందని, చనిపోయేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే కూతురు అనాధ అవుతుందని భావించి, కూతురికి విషం ఇచ్చి తాను విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య స్వాతి, ప్రియుడు రాంబాబు పరారీలో ఉన్నారు. ఈ ఘటనతో సంతోష్ కుటుంబంలో విషాదంలో మునిగిపోయారు.
ఆత్మహత్యకు కారణం ఏమిటి?
భార్య అక్రమ సంబంధం వల్ల కలిగిన మానసిక వేదనతో తండ్రి కూతురుకు విషం ఇచ్చి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనలో ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు?
కూతురు విషం తాగి మృతిచెందగా, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: