సర్వీసు రంగం భారత దేశస్థూల జాతీయోత్పత్తిలో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నది. సర్వీసు రంగంవాటా భారత దేశ జిడిపిలో 54.9శాతంగా ఉంటే, వ్యవసాయ రంగం వాటా 14.4 శాతంగాను, పారిశ్రామికరంగం వాటా 30.7 శాతంగాను ఉంది. అయి తే భారతదేశం ఈనాటికీ ప్రధానంగా వ్యవసాయరంగం మీదే ఆధారపడి ఉంది. వ్యవసాయ ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయం మీదే ఈనాటికీ అధిక శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలోఉంచుకుని ప్రభుత్వాలు భవిష్య అవస రాలు, ఆహార భద్రతను పరిగణలోకి తీసుకుని, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి. వ్యవసాయ మంటే నష్టాలకు నెలవుగా, అప్పుల కొలిమిలా భావించే పరిస్థితులు పోవాలి. వ్యవసాయరంగంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగిపో యాయి. ప్రతీ సంవత్సరం పెరుగుతున్నవ్యవసాయ ఖర్చులు రైతులకు (Farmers) పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఎరువులు, పురుగు మందుల ధరల పెరుగుదలకు అంతం లేకుండా పోయింది. పెట్టుబడులకు, రాబడికి మధ్య హస్తిమశకాంత మంత వ్యత్యాసముంది. తిండి పెట్టే రైతన్న (Farmers) తిండిలేక అలమటిస్తున్నాడు రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. పండించిన పంటలను అమ్ముకోవడానికి ఎన్నో నిబంధనలు అడ్డిస్తున్నాయి. ఒకో్కసారి కొనే నాథుడే లేక పంటలు కారుచౌకగా అమ్ముకోవడం జరుగుతున్న ది. వాతా వరణంమీద ఆధారపడి నిరంతరం ఆందోళనతో జీవించే అన్నదాతల కష్టాలను అవగతం చేసు కోవడంలో దాదాపుగా అన్ని ప్రభుత్వాలు విఫలమైనాయి. రైతుల జీవితాలు అప్పుల కుప్పలుగా మారి పోతున్నాయి. బ్యాంకు అప్పులు, ప్రైవేటు అప్పులు తీర్చలేక రైతులు దిగాలు పడుతున్నారు. అధిక వడ్డీలకు బయట అప్పులు తెచ్చి వాటిని తీర్చలేక, వత్తిళ్ళు భరించలేక, అవమానాలు సహించలేక పంట చేలో చల్లే పురుగు మందులతో జీవితాలను ముగిస్తున్నారు. రైతులపై అప్పల భారం విపరీతంగా పెరిగి పోయింది. రైతులకు జరు గుతున్న అన్యాయం అంతా ఇంతా కాదు. అన్నదాతల జీవి తాలు విషాదాంతంగా ముగియడానికి కారణమేమిటి? ఇందుకు బాధ్యులెవరు? వ్యవసాయ రంగంపై ఎందుకింత నిర్లక్ష్యం? ఎందుకింత వివక్ష? వ్యవసాయరంగం లేకపోతే పెరుగుతున్న జనాభాకు ఆహారం ఎక్కడ నుంచి లభిస్తుంది?
Read Also: http://Industrial Parks : పారిశ్రామిక పార్కుల్లో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం
చమురు ధరల ప్రభావం
ప్రపంచంలో సంభవించిన ఆర్థిక మాంద్యం ప్రభావం వలన చాలా దేశాల్లో ప్రజలకు తినడానికి తిండిలేక ఆకలి చావులు సంభవిస్తున్నాయి. చమురు ధరలు కూడా వ్యవసాయ రంగం పై ప్రతికూల ప్రభావం చూపిస్తు న్నాయి. అరకొరగా ఉపయో గించే యంత్ర పరికరాలు కూడా ఇంధన ధరలు భరించ లేక,రైతులకు భారంగా తయారైనాయి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు చేపట్టాలని, యాంత్రీకరణ ముమ్మరం చేయాలనే సలహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవి కేవలం ఉచిత సలహాలు మాత్రమే. ప్రస్తుతం వినియోగిస్తున్న ట్రాక్టర్లు, వరికోత యంత్రాల ఖర్చులకే కుదేలైపోతున్న పరిస్థితుల సరఫరా చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేక భారత్పై ప్రతీకార సుంకాలను పెంచు తూ, రష్యా నుండి చమురు కొనుగోలు చేయవద్దని హెచ్చరిస్తున్నది. ఇటీవల పుతిన్ భారత్ సందర్శన సందర్భంగా ఇరు దేశాల మధ్యగల చిరకాల సుహృద్భావ వాతావరణాన్ని మరింతగా పెంచారు. రష్యా నుండి భారత్కు చౌకగా చమురు లభిస్తున్ననేపథ్యంలో రైతులకు ప్రభుత్వం తక్కువ ధరకు ఇంధనాన్ని విక్రయించి, వ్యవసాయరంగం ఇంధన అవసరా లను తీర్చాలి. ప్రపంచంలోని పలుదేశాలు ఆకలి కేకలతో అలమటిస్తున్నాయి. ప్రపంచ జనాభా ఆకలి తీర్చగల శక్తి కేవ లం వ్యవసాయ రంగానికే ఉందన్న వాస్తవాన్ని గ్రహించాలి. వ్యవసాయ రంగం ప్రాధాన్యతను గుర్తించాలి. రైతుల కోసంఅనేక పథకాలు ప్రకటించారు. ప్రాథమిక వ్యవసాయసహకార పరపతి సంఘాల్లో వినూత్నమైన మార్పులకు శ్రీకారంచుట్టారు. సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టారు. వై.ఎస్.ఆర్ కూడా రైతుల శ్రేయస్సుకు పాటు పడ్డారు. ఉచిత విద్యుత్ అందించారు. కరెంటు కష్టాలతో సతమతమవుతున్న రైతాంగానికి చంద్రబాబు హయాంలోని విభజిత ఆంధ్రప్రదేశ్ను కరెంటు కష్టాల నుండి గట్టెక్కించిన మాట వాస్తవం. తెలంగాణ కూడా కరెంటు కష్టాలను కొంతవరకు అధిగమించిన సంగతిని విస్మరించలేం. అయితే రైతాంగ సమస్యలను పూర్తి గా పరిష్కరించడం ఎవరికీ సాధ్యం కాలేదు.
నష్టాలకు, కష్టాలకు నిలయం
వ్యవసాయరంగమంటే నష్టాలకు, కష్టాలకు నిలయమన్న అభిప్రాయం ప్రబలిపోయింది. పండించే పంటలు చేతికొచ్చే వరకు గ్యారంటీ లేదు. పంటలకు గిట్టుబాటు ధర లేదు. స్వంత భూములున్న రైతులే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న నేపథ్యంలో ఇక కౌలు రైతుల పరిస్థితి చెప్పనక్కరలేదు. ‘అమ్మబోతే అడవి కొనబోతే కొరివి’అన్న చందంగా తయా రైన పరిస్థితుల్లో రైతాంగం ఇక వ్యవసాయం చేసే స్థితిలో లేదు. ఇప్పటికే హలాలను వదిలేసి, పొలాలను అమ్ముకుని నగరాలకు వలస పోయి, ఏదో ఒక వ్యాపారంతో భద్రంగా జీవిస్తున్న వారిని స్ఫూర్తిగా తీసుకుని, కాడెద్దులను వదిలేస్తు న్న రైతు కుటుంబాలను చూస్తున్నాం. అనేక ఉపాధి రంగా లు ముందుకు దూసుకు వస్తున్నాయి. అయితే వెన్నెముక లాంటి వ్యవసాయం అంపశయ్య మీద పడితే మిగిలిన రంగాలు మనగలుగునా? ప్రజల క్షుద్బాధను తీర్చే ఆహారం లేకపోతే ఇక మిగిలిన రంగాలు ఆహార సమస్యను తీర్చగల వా? ప్రపంచం సమీప భవిష్యత్తులో ఆహార కొరతను ఎదు ర్కొనే అవకాశముంది. యూరప్ దేశాల్లో ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వలన ఆహార కొరత ఏర్పడింది. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ భారత్ ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. భారత్ తలసరి ఆదాయం కొన్ని దేశాలతో పోల్చిచూస్తేచాలాతక్కు వనే చెప్పాలి. ఈ పరిస్థితులు మారాలి. ప్రజల తలసరి ఆదాయమే నిజమైన అభివృద్ధికి కొలమానం. వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న వారి బ్రతుకులు బాగుపడాలి.
ప్రజల ఆకలిబాధలు
వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నా ప్రజలు ఆకలిబాధలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలిచ్చే సబ్సిడీ ఆహార పదార్థాల కోసం ఎదురు చూస్తున్నారు. పంటలు పండిస్తున్న రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మార్కెట్లో మాత్రం ఆహారధాన్యాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఒక దానికొకటి పొంతన లేని పరిస్థితుల మధ్య దగా పడుతూ దిక్కుతోచని రైతులు రుణ మాఫీల కోసం ప్రభుత్వాలను అర్ధిస్తున్నాయి. వాతావ రణ పరిస్థితుల మీద, మార్కెట్ మీద ఆధారబడి బ్రతుకీ డ్చుతున్న అన్నదాతల విషయంలో ప్రపంచమంతా ఏకం కావాలి. నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ఆహారకొరతను అధిగమించాలి. దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ అందించాలి. అన్ని రాజకీయ పార్టీలు ఉచిత విద్యుత్ విష యంలో స్పషతనివ్వాలి. రైతులను ఇబ్బంది పెట్టబోమని ప్రస్తుత ప్రభుత్వాలు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా రైతు సమస్యల విషయంలో తమ నిర్ణయా లను స్పష్టం చేయాలి.ఉద్యోగుల కిస్తున్న సదుపాయాలను రైతులకు కూడా వర్తింపచేయాలి. రైతుల జీవితాలకు భద్రత కల్పించాలి. మూడెకరాల లోపు వ్యవసాయ భూములు గల రైతులకు పెన్షన్ సదుపాయం కలుగ చేయాలి. వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడానికి ఎం.ఎస్. స్వామినాథన్ సిఫార్సులను, సూచనలను అమలు చేయాలి. మనదేశంలో అనేక పంటలు పండుతున్నాయి.
అయితే పండించిన పంటలకు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇతర రంగాల మాదిరిగా వ్యవసాయం చేసే రైతులకు స్వేచ్ఛ లేదు. ధరలు నిర్ణయించుకునే హక్కులేదు.ఇలాంటి పరిస్థి తులు మారాలి. వ్యవసాయం పట్ల మక్కువ చూపే యువతను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
– సుంకవల్లి సత్తిరాజు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: