విజయవాడ : అర్హులైన రైతులందరికీ ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పియం కిసాన్ (Annadata Sukhibhava-PM Kisan) నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వెల్లడించారు. ఈ అంశంపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆ యన సంబంధిత శాఖల అధికారులతో సమీ క్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రైతులకు ఆర్థికంగా మరింత చేయూతను అందించే లక్ష్యంతో సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 20వేల రూ.లు వంతున అన్నదాత సుఖీభవషియం కిసాన్ కింద సహాయం అందించడం జరుగు తోందని తెలిపారు.
ఈపధకానికి సంబంధించి ఇంకా ఇకెవైసి మరియు ఎన్సిపిఐ ఎన్సిపిఐ మ్యాపింగ్ కానివారు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రందించి ఇకెవైసి మరియు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని చెప్పారు. ఈపథకం అమలుకు ఇంకా మరో మూడు రోజులు వరకూ సమయం ఉన్నందున ఈరెండు అంశాలు పెండింగ్ లో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా రైతు (Farmers) సేవా కేంద్రాలను సంప్రదించాలని ఆయన సూచించారు.
ఈపథకం వర్తించలేదని రైతుల నుండి ఫిర్యాదులు వస్తుంటాయని కావున వాటిపై రెవెన్యూశాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. దీనిపై గురువారం నిర్వహించే కలక్టర్ల వీడియో సమావేశంలో కూడా చర్చించడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు.
అంతకు ముందు వ్యవసాయశాఖ సంచాలకులు ఢిల్లీ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈపథకం అమలుకు సంబంధించిన వివరాలను తెలియ జేస్తూ ఈపథకం కింద లబ్ది పొందాలంటే కెవైసిలో నమోదు తప్పనిసరని స్పష్టం చేశారు. ఈసమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్, అదనపు సిసిఎల్ఎ ప్రభాకర్ రెడ్డి, ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్, యుబిఐ ఎజియం శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గా సిసిఎస్ఏ జయలక్షిమి, సియం కార్యదర్శి రాజమోళి, పలువురు బ్యాంకరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల పనులు నిర్దిష్ట సమయానికి పూర్తి చేయాలి
రాష్ట్ర విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కార్యనిర్వహణ సామర్థ్యం, నిర్దిష్ట సమయానికి పనులను పూర్తీ చేయటం ఆర్థిక నిర్వహణ వంటివి అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. విజయవాడలోని విద్యుత్ సౌధాలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏ పీ జెన్కో ఏపీపీడీసీఎల్ ప్రాజెక్టుల పురోగతి, విద్యుత్ ఉత్పత్తి పనితీరును సిఎస్ సమీక్షించారు.
ఈ సమావేశంలో ఏపీట్రాన్స్కో జెఎండీ చెకూరి, ఏపీజెన్కో డైరెక్టర్లు పి. అశోక్ కుమార్ రెడ్డి, శ్రీ ఎం. సుజయ కుమార్, ఏపీట్రాన్స్కో డైరెక్టర్లు ఏకేవీ భాస్కర్, శ్రీ జె.వి. రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లడుతూ ఏపీజెన్కో ఏపీపీడీసీఎల్ సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో 10 వృద్ధిని నమోదు చేసా యని, గత ఆర్థిక సంవత్సరంలో 32,219 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 35,547 మిలియన్ యూనిట్లకు చేరిందని వెల్లడించారు. జల విద్యుత్ ఉత్పత్తిలో 95 వృద్ధి నమోదు కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రశంసించారు. ఇదే స్ఫూర్తి తో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించేలా సమర్థ వంతమైన ప్రణాళిక, సమయపాలనలో విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.
ప్రతి ఉత్పత్తి కేంద్రం తన అత్యధి. కంగా ఉత్పత్తి చేసిన స్థాయిని బెన్మార్క్ తీసుకుని, అలాంటి రికార్డును కొనసాగించేందుకు కోసం కృషి చేయాలని సూచించారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Development : ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు