📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Farmer Welfare : అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం

Author Icon By Shravan
Updated: August 6, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య మిస్తోందని.. రైతుల క్షేమం (Farmer Welfare) సంక్షేమంతోనే వికసిత్ భారత్, స్వర్ణాంధ సాకారమవుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక సాధి కారత సాధించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది. కార్యక్రమం మంగళవారం ఇబ్రహీం పట్నం మండలం, గుంటుపల్లిలో జరిగింది. కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ.. రైతు జి. రవీంద్రనాథ్ ఠాగూర్ (G. Rabindranath Tagore) పొలంలో వరి నాట్లు వేసి.. రైతులు అన్నివిధాలా ఎదిగేందుకు మేమంతా వారి వెనుక ఉన్నామనే భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి గ్రామానికీ ప్రత్యేక సమస్యలు ఉంటాయని.. ఈ నేపథ్యంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి మంగళ, బుధ వారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. సాగునీరు, విత్తనాలు, ఎరువులు, సీసీఆర్సీ కార్డులు, పంట రుణాలు ఈ క్రమాన్ని నిర్వహి స్తున్నట్లు వివరించారు. ఎక్కడా ఎరు వుల కొరత లేదని.. బయోమెట్రిక్ ఆధారిత ఆన్లైన్ విధానం ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే విచ్చలవిడిగా ఎరువులు వినియోగించవద్దని, తెలిసో తెలియకో అలా వినియోగిస్తే నేల నిస్సారమై, సాగుకు పనికిరాకుండా పోతుందన్నారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగుముందులు వినియోగించాలని సూచించారు. పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుందని.. అదేవిధంగా ప్రకృతి సేద్య విధానాలను కూడా అనుసరించాలని సూచించారు. గుంటుపల్లిలో ప్రధానంగా బీపీటీ, పీఎల్ 1100 రకాలు పండిస్తున్నారని.. వరికి సంబంధించి మొదటి దఫా యూరియా గుళికలు వేసి తర్వాత రెండు, మూడు విడతల్లో నానో యూరియాకు ప్రాధాన్యమివ్వాలని.. దీనివల్ల దాదాపు 50 శాతం ఎరువు ఆదా అవడమే కాకుండా సామర్థ్యమూ పెరుగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటికే 39 వ్యవసాయ డ్రోన్లు అందించామని, ఇక్కడ కూడా అవసరం మేరకు డ్రోన్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

రైతు సంక్షేమం లక్ష్యంగా హైటెక్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్, మార్కెట్ లింక్డ్ అగ్రికల్చర్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమి స్తోందన్నారు. సాగు వరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ (91549 70454) అందుబాటులో ఉందని.. కాల్ చేసి సమాచారమిస్తే వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎలాంటి వదంతులు నమ్మొద్దన్నారు. ఎరువులను అధిక ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా సంబంధీకులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/handloom-support-we-will-bear-gst-on-textiles-for-handloom-weavers-cm-chandrababu-naidu/andhra-pradesh/526639/

Agriculture support India Breaking News in Telugu Farmer subsidy news farmer welfare Google news Latest News in Telugu Rural Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.