📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Farmer : రైతు కష్టాలు తీరేదెలా?

Author Icon By Sudha
Updated: March 25, 2026 • 2:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్ని రుతువులు మారినా ఎన్ని ఉగాదులొచ్చి నా, ఎన్ని పంటకాలాలు మారినా ఏలిన వారి దయలేక యూరియా కష్టాలతోరైతుకన్నీళ్ల సాగు చేస్తున్నాడు. యూరియా కొరత ఉన్నప్పుడు లేన ప్పుడు కూడా రైతు యూరియా కోసం పీకల్లోతు కష్టా ల్లో దిగబడిపోతున్నాడు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో రైతు పంట పొట్టపోసే తరుణంలో యూరియా పంపిణీ లో చిత్రవిచిత్ర అనుభవాలను ఎదుర్కొంటున్నాడు. ఒక పక్క ప్రతి ఎకరాకు వినియోగించే యూరియాను క్రమ బద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెవినిల్లు కట్టుకుని పోరుతున్నా రైతు లెవరూ వినిపించుకునే పరి స్థితిలో లేరు. అందుచేత యూరియా వాడకం ఏమాత్రం తగ్గలేదు. రైతులుందరికీ ఎరువు ఇవ్వటం ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు. యూరియా అన్ని రాష్ట్రాలకూ కేటాయించేది, అవసరమైనంత మేరకు సమకూర్చేది కేంద్ర ప్రభుత్వమే. సాగుకవసరమైన అన్ని ఎరువుల సంగతి ఎలా ఉన్నా యూరియా విషయంలో పెద్ద గందరగోళాన్నే ఎదుర్కొంటున్నాడు. ఉభయ రాష్ట్రాల్లోనూ యూరియా పంపిణీ నియంత్రిత విధానాలతోనే జరుగుతుందని పాల కులు వాటినే అనుసరిస్తున్నారు. కొందరు రైతులైతే యూరియా కోసం ఎగబడే పరిస్థితి లేక ఆకాశంకేసి చూస్తూ పరాకుగా నిలబడిపోయి ఉన్నాడు. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న సాగులో యూరియా వాడకం జరుగుతోంది. వరిసాగులో ప్రతి ఎకరానికి 2,3, బస్తాల యూరియా, మొక్కజొన్న ఎకరానికి 2బస్తాల వరకు, అదే పత్తి పంట అయితే ఎకరాకు 1 నుంచి ఒకటిన్నర బ్యాగుల ఎరువు అవసరమౌతుంది. ప్రస్తుత పరిస్థితులలో రైతుకు ఉన్న భూమి పరిణామాన్ని బట్టి కేటాయింపు లుంటాయి. అంతకన్నా ఎక్కువ ఎరువు వాడితే దిగుమతులు అధికమౌతాయన్న యోచనతో రైతులు అధికమో తాదులో యూరియా వినియోగించటం పరిపాటే. అయినా సత్ఫలితాలు సాధించిన సందర్భాలు బహుతక్కువ.

Read Also : Rythu Runa Mafi : రైతు రుణమాఫీ పై మంత్రి సీతారామన్ క్లారిటీ

Farmer

ఇరురాష్ట్రాల్లోనూ ఇప్పుడు యూరియా తదితర వివరా లన్నీ వెర్ల్యాండ్ రికార్డుల ఆధారంగా కేటాయిస్తారు. ఆ మేరకే సహకార సంఘాల నుండి రైతు(Farmer)లు కొనుక్కొని తీసుకెళ్తారు. రైతాంగం సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నట్లు కొన్ని అంకెలను కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా వీటన్నిటిలోనూ అణుమాత్రం పొంతన కుదరదు. యూరియా వినియోగం తగ్గించాలని, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇచ్చినాఏమాత్రం ఫలితం దక్క డం లేదు. మామూలుగా చెపితే రైతులు విశ్వసించడం లేదన్నఅభిప్రాయంతో యూరియా బ్యాగ్కు తగు ప్రోత్సా హకం కూడా అందిస్తోంది. నానో యూరియా వినియోగిం చాలంటే రైతుకి ఎన్నో సందేహాలు ఉన్నాయి. రబీ సీజన్ లో యూరియా తెచ్చుకోవడానికి తెలంగాణలో రైతు లు చాలా ఇబ్బంది పడ్డారు. తెలంగాణలో ప్రతి రైతు తమకు కావాల్సిన యూరియా బుక్ చేసుకోవడంలో ప్రభుత్వం పెట్టిన ‘యాప్’ సరిగా పనిచేయకపోవడం, యాప్లో తమ పేర్లు నమోదుకు రైతులదగ్గర స్మార్ట్ఫోన్ లు లేక సమస్యలనెదుర్కొన్నారు. సరుకు తీసుకుని ఇంటికి చేర్చుకోవడం మరో యజ్ఞంలా రైతు నానాయాతన పడ్తు న్నాడు. ఒకే రైతుకు కొద్దిదూర ప్రదేశాల్లో వ్యవసాయ క్షేత్రాలున్నప్పుడు అదే రైతు రెండు ప్రాంతాలకూ వెళ్లి యూరియా తీసుకోవాల్సి వస్తేమరీ ఇబ్బంది. ఆంధ్రప్రదేశ్ లో యూరియా వ్యవహారం మరోలా నడుస్తోంది. రైతుకు యూరియా బస్తా కొనుగోలులో మరో పోషక ఎరువుల బస్తాను లింకుపెట్టి ఇస్తున్నారు. నిజానికి వీటిని క్రమ బద్ధం చేసే ప్రణాళికలు ప్రభుత్వం వద్ద ఏమీలేవు.

Farmer

తాజా పరిస్థితుల రీత్యారేపొచ్చే వానాకాలం సీజన్లో యూరియా పంపిణీ మరింత కష మౌతుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ సంకేతాలు పంపింది. సర్మెట సభలో తెలంగాణ ముఖ్యమంత్రి యూరియా విషయంలో రైతాంగానికి కొన్ని స్పష్టమైన సూచనలు కూడా చేశారు. వచ్చే సీజన్కు యూరియా కొరత రాబోతోందని నానో యూరియా వైపు మారాలని రైతాంగాన్ని కోరారు. యూరియా సరఫరాలో తమ బాధ్యతలను తప్పించుకుంటారని అని అనుకోలేం. గత మూడు సీజన్లుగా యూరియా, తదితర ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నందున రేపటి ఖరీఫ్ సీజన్కు రైతు(Farmer)ను సమాయత్తపరచడన్నమాట. యూరియా విదేశాల నుంచి రావాలి. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కార ణంగా ఎరువులతో రావాల్సిన నౌకల కదలిక నెమ్మదిం చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వాలు కొత్తప్రణాళికలు వేయాల్సిందే. తెలంగాణలో ని రామగుండం ఫాక్టరీలో ఎరువుల ఉత్పత్తిని పెంచాలని కేంద్రం నిర్ణయించినా, ఇక్కడ తయారైన ఎరువులు ఈ ప్రాంత వినియోగానికే అన్న విధానం ఏదీ అమలులో లేదు. ఈప్రాంత ఉత్పత్తులు ఏ రాష్ట్రానికైనాపంపేందుకు వీలుంది. అందుకే రామగుండం యూరియాను తెలంగాణ అవసరాలకే ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ముఖ్య మంత్రి ప్రసంగ సారాంశంలో ప్రధానాంశంగా ఉంది. వానాకాలం ప్రారంభానికి ముందు తెలంగాణలో 50వేల టన్నులు కూడా నిల్వఉండే అవకాశంలేదని ఆశాఖమంత్రే స్వయంగా తెలిపారు. రాబోయే సీజన్లో తెలంగాణ అవ సరాలకు 10లక్షల టన్నులు అవసరముంటుంది. సీజన్లో ప్రతినెలా రెండేసి లక్షల టన్నుల యూరియా సరఫరా చే యాలని మంత్రి ప్రధానికి రాసినలేఖలో కోరారు. గతంలో చేదు అనుభవాలు చవిచూసిన తెలంగాణ రైతాంగానికి ఈ యేడాది మరిన్ని చేదు అనుభవాలు చవిచూడాల్సి వస్తుంద న్న భయంఉంది. పాత అనుభవాలు, కొత్తకష్టాల అంచనాలతో యూరియా సరఫరాకు సరికొత్త ప్రణాళికలతో ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నప్పుడే రైతుకు మేలు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

agriculture Breaking News farmer issues Farmers Indian farmers latest news Rural Development Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.