రాష్ట్రంలో యాసంగి సాగు ఉపందుకుంది. వానాకాలం పంటకు మొంథా తుఫాన్ చేసిన బీభత్సం నుండి తేరు కుంటూ యాసంగి పంటకు రైతులందరూ సన్నద్ధమవుతు న్నారు. సాధారణంగా తుఫానులు జూలై, ఆగస్టు నెలలో ఎక్కువగా సంభవిస్తాయి. అప్పుడు పంటవయసు పెట్టిన పెట్టుబడి తక్కువ ఉంటుంది. కానీ ఈసంవత్సరం మొంథా తుఫాన్ మాత్రం అక్టోబర్ నెల చివరన వచ్చి రైతు చేతికందే పంటను నేలపాలు చేసింది. రైతు ఆరు నెలల కష్టాన్ని బూడిద పాలు చేసింది. ఈ తుఫాన్ రాష్ట్రంలో దాదాపుగా ఆరులక్షల ఎకరాలకు పైగా పంట నష్టం చేసింది. అందులో వరి మూడులక్షల ఎకరాలు, పత్తి లక్షన్నర ఎకరాలు, మొక్క జొన్న, మిగతా పంటలు అన్నికలసి 50 వేల ఎకరాల వరకు నష్టం చేసింది. ఒక వరంగల్ జిల్లాలోనే రెండు లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం చేసిందని అంచనా వేశారు. వానాకాలం పంట కాలంలో యూరియా కోసం రైతులు పడ్డ తిప్పలు అందరికీ తెలిసేఉంటుంది. ఎరుపెక్కి న పంటను తిరిగి పచ్చగా మార్చి నేలలో నత్రజని శాతాన్ని పెంచడానికి కావాల్సిన యూరియా కోసం పడినపాట్లు అన్నీ ఇన్నీకావు. ఇంతటి కష్టాన్ని గట్టెకి యూరియా సంపా దించి పంటను కాపాడుకుంటే తీరా చేతికొచ్చేసరికి తుఫాన్ ప్రభావానికి లోనయ్యాయి. ఈ పంట నష్టానికి రైతులకు ప్రభుత్వాల నుండి వచ్చే పరిహారం అంతంత మాత్రమే అని చె
ప్పాలి. సూర్యుడు అస్తమించిన తిరిగి ఉదయించి నట్టుగానే భూమినే నమ్ముకునే రైతులు సాగు చేయడం ఆపరు. రైతులకు(Farmer) ప్రత్యామ్నాయం లేకనే ఎంత నష్టం జరి గిన మళ్ళీ భూమినే నమ్ముకుంటాడు. వానాకాలం పంటల సాగు వర్షాలపై ఆధారపడిన యాసంగి సాగుకు మాత్రం బోర్లు, బావులు, చెరువులు, రిజర్వాయర్ల ద్వారా వచ్చే నీటి పారకం పైన ఆధారపడుతుంది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ సంవత్సరం సగటు సాధారణ వర్షపాతం 850 మీ.మీగా పడాల్సి ఉంటే ఇప్పటివరకు 1178 మి.మీ వర్షపాతం పడింది. ఇది సాధారణం కన్నా 39శాతం ఎక్కువగా నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే 1045మి. మి కన్నా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా 4జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైతే 29జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. ఈ అధిక వర్షపాతం వల్ల భూగర్భ జలాల నీటిమట్టం కూడా పెరిగింది. ప్రస్తుతం బావులు, చెరువులు, రిజర్వాయర్లు నీటితో కలకలలాడుతున్నాయి. అలాగే రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి 790 టీఎంసీలు ఉంటే అది ప్రస్తుతానికి 840 టీఎంసీలుగా ఉంది.
Read Also : http://Telangana weather update : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్, ఈ జిల్లాల్లో చలి పంజా విసురుతోంది
రాష్ట్రంలో సరాసరి భూగర్భ జలలా నీటి మట్టం నవంబర్ చివరి నాటికి అత్యల్పంగా నాగర్కర్నూల్ జిల్లాలో గ్రౌండ్ లెవల్ నుండి 1.89 మీటర్ లోతులో ఉంటే అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో 7.71 మీటర్ లోతులో ఉన్నాయి. రాష్ట్ర సరాసరి భూగర్భ జలాల నీటి మట్టం 4.41 మీటర్గా ఉంది. ఇది గతడేది నవంబరు చివరినాటికి 6.05 మీటర్గా ఉండేది. ఈ గణాంకలన్నీ యాసంగి సాగుకు కావాల్సిన నీటిలభ్యత పుష్కలంగా ఉంది అనే చెబుతున్నాయి. ఒకప్పుడు పత్తి ఏడాది పంటగా ఉండేది ఇప్పుడు ఆరు నెలలపంటగా మారింది. గత పది సంవత్సరాలుగా వర్షాలు పుష్టిగా పడటంతో పత్తి పంట వానాకాలానికే పరిమితమై యాసంగిలో మొక్కజొన్న పంటను వేస్తున్నారు. ఇప్పుడు యాసంగిలో వరి, మొక్కజొన్న ప్రధాన పంటలుగా సాగవుతున్నాయి. యాసంగిలో సాధారణ సాగు భూమి 68.67లక్షలుగా అంచనా వేస్తే డిసెంబరు ముడోవారానికి 8.20 ఎకరాలలో పంట సాగు మొదలైంది. వరి పంట 51 లక్షల ఎకరాలకు గాను లక్షఎకరాలు, మొక్కజొన్న ఆరున్నర లక్షల ఎకరాలకు గాను నాలుగులక్షల ఎకరాలలో సాగు మొదలైంది. లక్షన్నర ఎక రాలు శనగ సాగు ఐతేమిగిలినవి పప్పుధాన్యాలు సాగు అవుతున్నాయి. ఇప్పటివరకు 26 జిల్లాలో 25 శాతం లోపు 6 జిల్లాలో 25 శాతం పైగా సాగు జరుగుతుంది.పంట చేతికందే వరకు రైతు ముందున్నవి ప్రకృతి విపత్తులు ఒక సమస్య ఐతే మానవ విపత్తులు మరో సమస్య. యాసంగి పంట చేతికొచ్చేవేసవికాలంలోనే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయి. ఇవి వరి మొక్కజొన్న పంటలతో పాటుమామిడి తోటలకు తీవ్ర నష్టం చేస్తాయి. స్వార్థం లేని పుడమి పంటనివ్వడానికి సిద్ధంగా ఉన్న ధన దాహానికి మానవ స్వార్థపూరితమైన ఆలోచనలు రైతులకు (Farmer) ఎక్కువ నష్టం చేస్తున్నాయి. పంట ప్రారంభంలోనే నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల సమస్య ఒక వైపు ఐతే దిగుబడి అయిన పంటకు గిట్టుబాటు ధర లేక దళారుల మధ్య మోసపోవడం మరో సమస్య. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం క్రింద రైతు భరోసా అంది స్తున్న, ప్రధానంగా నకిలీ విత్తనాల తయారీని నిర్మూలిస్తు యాసంగిపంటకు కావాల్సిన ఎరువులు, యూరియా, విద్యుత్ ను అందుబాటులో ఉంచడంపై దృష్ట్టి పెట్టాలి . అలాగే వానా కాలంలాగా యూరియా కొరత లేకుండా చూస్తూ అవసరానికి కావాల్సిన యూరియా సరఫరాచేస్తూ పరిమితికి మించి వాడితే భూమిలో ఆమ్లశాతం పెరుగుతుందని, దాని పర్యవ సానాల పైఅలాగే పంటకు తగ్గట్టుగా నేలలో పోషకాలు వృద్ధి పై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరంఉంది.
-బైరబోయిన వెంకటేశ్వర్లు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: