हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Farmer: దిక్కుతోచని తోతాపురి రైతు

Ramya
Farmer: దిక్కుతోచని తోతాపురి రైతు

రోజు రోజుకు ధర పతనం

Chittoor: ఈ సీజన్లో తోతాపురి మామిడి (Totapuri mango) ధర రోజు రోజుకు పతనం అవుతుండటంతో రైతు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సీజన్లో తోతాపురి మామిడి (Totapuri mango) ఒక కేజీ రూ.12 గిట్టుబాటు ధరను ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం ఫ్యాక్టరీలు, ర్యాంపులు, మండీల్లో రైతుకు కేజీ తోతా పురి మామిడిపై రూ.6.50 కంటే మించి ఇవ్వడం లేదు. మామిడి సరఫరా చేసిన రైతుకు ఈ డబ్బులను సైతం ఫ్యాక్టరీలు ఇప్పటికిప్పుడు చెల్లించడం లేదు. రైతు మామిడి సాగు కోసం ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టివుండటం, ప్రస్తుతం కోత సమయంలో కూలీలు, మామిడి రవాణాకు వినియోగించే ట్రాక్టర్లకు సైతం ప్రభుత్వం, పల్ప్ ఫ్యాక్టరీలు డబ్బులు ఇవ్వడం లేదు. రైతు సొంత ఖర్చులు పెట్టుకుని మామిడి కోతలు కోసి, ట్రాక్టర్ బాడుగ చెల్లించి పల్ప్ ఫ్యాక్టరీలు, మండీలు, ర్యాంపుల వద్దకు వెళ్ళి తన మామిడి కాయలను ఇచ్చి ఒట్టి చేతులతో తిరుగుముఖం పడుతున్నాడు.

Farmer: దిక్కుతోచని తోతాపురి రైతు

ఫ్యాక్టరీల వద్ద 48 గంటల నిరీక్షణ– మద్దతు ధరపై నిలకడలేని వైఖరితో రైతుల ఆందోళన

అష్టకష్టాలుపడి తోట నుండి మామిడిని ఫ్యాక్టరీలకు వద్దకు తీసుకువస్తున్న రైతుకు తన కాయలను ఫ్యాక్టరీలో అన్లోడ్ చేయడానికి కనీసం 48 గంటలకు పైగా సమయం పడుతుంది. ఈ రెండు రోజుల పాటు ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు పడుతున్న రైతులకు భోజనానికి సైతం దిక్కులేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సీజన్లో తోతాపురి మామిడి పుష్కలంగా కాపు కాయడంతో మామిడి రైతుధరపై ఆశలు పెట్టుకొని ఆశల్లో విహరించాడు. అయితే పల్ప్ ఫ్యాక్టరీల వద్ద గత ఏడాది తయారు చేసిన పల్స్ అలాగే నిల్వ వుండటం, అంతర్జాతీయ మార్కెట్ నుండి పల్ప్ ఫ్యాక్టరీలకు ఆశించిన ఆర్డర్లు రాకపోవడంతో తోతాపురి మామిడి రైతులో గుబులు ఏర్పడింది. ఒక దశలో తోతాపురి మామిడిని అడిగేవారు లేకపోవడంతో ప్రభుత్వం పల్ప్ ఫ్యాక్టరీల యాజమానులు, మామిడి రైతులతో చర్చించి కేజీ తోతా పురి మామిడికి రూ.12 చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రభుత్వం రైతుకు సబ్సిడీ రూపంలో కేజీకి రూ.4 చెల్లిస్తే పల్ప్ ఫ్యాక్టరీలు కేజీ తోతాపురి మామిడిపై రైతుకు రూ.8 చెల్లించాల్సి వుంది. అయితే పల్ప్ ఫ్యాక్టరీ యాజమానులు సైతం కేజీపై రూ.8 చెల్లించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.

ధర తగ్గినా ఆశతో అమ్మకాలు – చేతికి మిగిలేది చిల్లిగవ్వే!

అయితే ప్రభుత్వం పట్టుబట్టడంతో కొన్ని రోజుల పాటు ఫ్యాక్టరీలు రైతుల నుండి తోతాపురి మామిడి (Totapuri mango) ని తీసుకోలేదు. మామిడి రైతులు ఎలాగైనా తన తోతాపురి మామిడి (Totapuri mango) ని అమ్ముకోవాలని భావించి ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా ప్రారంభించారు. అయితే ఫ్యాక్టరీలు కేజీకి ఎంత చెల్లిస్తామనే విషయంను మామిడి రైతులకు ముందు చెల్లించలేదు. ఈ మేరకు ప్రారంభంలో కేజీ తోతాపురి మామిడికి రూ.7 వరకు చెల్లించిన ఫ్యాక్టరీలు, ఆపై కేజీపై రూ.6, ఆపై రూ.5 వరకు చెల్లించడం ప్రారంభించాయి. అయితే ఈ డబ్బులను ఫ్యాక్టరీ యాజమానులు అప్పటికప్పుడు రైతులకు ఇవ్వడానికి సాధ్యం కాదని తేల్చిచెప్పడంతో రైతులు సైతం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందిలే! అని ఫ్యాక్టరీలకు మామిడి సరఫరాను ప్రారంభించాయి. అలాగే ర్యాంపులు, మండీల్లో తోతాపురి మామిడిని అడిగేవారు లేకపోయారు. మండీలు, ర్యాంపుల్లో తోతాపురి మామిడి ప్రస్తుతం కేజీ రూ.2.50 పలుకుతుంది. ఈ డబ్బులను సైతం మామిడి రైతులకు ర్యాంపుల యాజమానులు అప్పటికప్పుడు ఇవ్వడం లేదు.

సబ్సిడీ ఎప్పటికొస్తుందో స్పష్టత లేకపోవడంతో అప్పుల ఊబిలో మామిడి రైతు – తోట నుండి ఫ్యాక్టరీల దాకా ఉచితంగా సరఫరా

మరోవైపు ప్రభుత్వం మామిడి రైతులకు సబ్సిడీ రూపంలో కేజీపై రూ.4 చెల్లిస్తుందని చెప్పినప్పటికీ ఆ మొత్తం ఎప్పుడు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందనే విషయంను స్పష్టం చేయలేదు. ఈ పరిస్థితిలో రైతులు అప్పులు చేసి మామిడి కోత చేపట్టి ట్రాక్టర్ అద్దె చెల్లించి ఉచితంగా ఫ్యాక్ష రీలు, మండీల వరకు మామిడి తీసుకెళ్ళి అన్లోడ్ చేసి వస్తున్నారు. ఇప్పటికే మామిడిపంట సాగు కోసం లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన మామిడి రైతుకు ప్రస్తుతం పంట కోత దశకు వచ్చినప్పటికీ మళ్ళీ అప్పులు చేసి పంటను కోసి ఉచితంగా తీసుకెళ్ళి ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద ఇచ్చి వస్తుండటంతో మామిడి రైతు పరిస్థితి మరింత దిగజారింది. ఒక టన్ను మామిడి సరఫరా చేసిన రైతుకు కోత, రవాణా ఖర్చులు పోను కేవలం రూ.500 మాత్రమే మిగిలే పరిస్థితి నెలకొంది. ఈ రూ.500 సైతం ఇప్పటికిప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో పల్ప్ ఫ్యాక్టరీలు, ర్యాంపుల యాజమానులు లేకపోవడంతో కోత, ట్రాక్టర్ల అద్దెలు రైతు చెల్లించే సమయానికి ఆ మొత్తంకు వడ్డీ చెల్లిస్తే రైతుకు ఒక టన్నుపై మిగిలిన రూ.500 సైతం ఖర్చు అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో మామిడి రైతు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.

Read also: TDP నేతలను నిలదీయండి అంటూ సజ్జల పిలుపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870