ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్,(FakeLiquor Case) నకిలీ మద్యం తయారీ కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టై జైలులో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు కొంతమేర ఊరట లభించింది. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కేసును విచారించిన ఎక్సైజ్ కోర్టు, జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: AP: గూగుల్ మ్యాప్స్ వాడి ఆలయాలను టార్గెట్ చేస్తున్న ముఠా
79 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్
ఈ కేసులో జోగి రమేశ్, జోగి రాము గత 79 రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, ఇబ్రహీంపట్నం కేసులో వారికి తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది.
మరో కేసుతో కొనసాగుతున్న జైలు జీవితం
అయితే, జోగి రమేశ్‌కు ఇది పూర్తిస్థాయి ఊరట కాదని తెలుస్తోంది. ములకలచెరువు ప్రాంతంలో నమోదైన మరో నకిలీ మద్యం తయారీ కేసులో(FakeLiquor Case) కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులో ఇప్పటివరకు బెయిల్ మంజూరుకాకపోవడంతో, ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ములకలచెరువు కేసులో కూడా బెయిల్ లభిస్తేనే జోగి రమేశ్ జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: