📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Fake Liquor: కల్తీ లిక్కర్ పై ఉక్కుపాదం..

Author Icon By Rajitha
Updated: October 9, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Vijayawada : రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ, అమ్మకాలను ఏ మాత్రం ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కల్తీ లిక్కర్తో ప్రజల ప్రాణాలను హరించే వారిపై కఠిన చర్యల ద్వారా ఉక్కుపాదం మోపాలని సీఎం స్పష్టం చేశారు. 15 నెలల్లో పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికట్టామని…ఇంతే సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రంలో కల్తీ లిక్కర్ అనేది లేకుండా చేయాలని చెప్పారు. ఏ ఒక్క చోటా కల్తీ లిక్కర్ Liqueur తయారీ కేంద్రాలు కానీ, అటువంటి వ్యక్తులు కానీ ఉండకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్సైజ్, ఎన్ఫోర్స్ మెంట్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలను, దర్యాప్తు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరవు కేసులో మొత్తం 21 గుర్తించామని…అందులో ఇప్పటికి వరకు 12 మందిని అరెస్టు చేశామని… మిగితా నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.

YS Jagan: హెలికాప్టర్‌లో మాత్రమే జగన్ కు అనుమతి!

Fake Liquor: కల్తీ లిక్కర్ పై ఉక్కుపాదం..

ములకలచెరువు కేసులో ఎ1 గా ఉన్న అద్దేపల్లి జనార్దన్రావు లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ జరవుతున్నామని తెలిపారు. ముకలచెరువు కేసుల ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్రావుకు చెందిన వ్యాపారాలపై తనిఖీలు జరిపామని తెలిపారు. ఈ తనిఖీల్లో కిరాణా షాప్ వెనుక కల్తీ మద్యం నిల్వలను గుర్తించినట్లు తెలిపారు. అద్దేపల్లి జనార్ధన్రావు ఇబ్రహీంపట్నంలోని మెస్సర్స్ తివిళి బార్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. అతను 15 సంవత్సరాలుగా మద్యం వ్యాపారం చేస్తున్నాడు. అధిక లాభాల కోసం నకిలీ మద్యం తయారీ ద్వారా చట్ట విరుద్ధ కార్యక్రమాలు నిర్వహించారు. తన సోదరుడు అద్దేపల్లి జగన్ మోహన్ రావు మంది నిందితులు ద్వారా కల్తీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకం చేపట్టాడు. వీరిద్దరు కొందరితో కలిసి కల్తీ మద్యం తయారు చేసినట్లు తనిఖీల్లో గుర్తించామని అధికారులు తెలిపారు.

ఇక్కడ జరిపిన తనిఖీల్లో కల్తీ లిక్కర్ సీసాలు పట్టుకున్నామని తెలిపారు. ఇక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారంలో మొత్తం 12 మందిని నిందితులుగా గుర్తించామని వీరిలో ముగ్గురిని ఇప్పటికి అరెస్టు చేశామని తెలిపారు. నలుగురిని పీటీ వారెంట్ పై తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. నిందితుల కాల్ రికార్డులతో పాటు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని. అధికారులు వివరించారు. కల్తీ లిక్కర్పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి….. ఈ మొత్తం వ్యవహారంలో పలు కీలక సూచనలు చేశారు. అన్నమయ్య Annamayya జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నాయని సీఎం అన్నారు. రాష్ట్రం అంతటా కల్తీ లిక్కర్ అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని…. ప్రతి మూడు బాటిల్స్ లో ఒక బాటిల్ కల్తీ లిక్కర్ బాటిల్ ఉందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు.

రాష్ట్రంలో కల్తీ లిక్కర్తో ప్రాణాలు పోతున్నాయని ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టిన విషయాన్ని మంత్రులు కూడా అర్థం చేసుకోవాలని…. వైసీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని సూచించారు. కల్తీ లిక్కర్ కారణంగానే అక్కడ అని ప్రచారం చనిపోయారు… ఇక్కడ చనిపోయారు చేస్తున్నారని….. ప్రతీ ఆరోపణ పైనా విచారణ జరపించాలని అధికారులను సీఎం CM ఆదేశించారు. అవసరమైతే పోస్టుమార్టం వంటి విధానాల ద్వారా మృతికి కారణాలు సైంటిఫిక్గా నిర్ధారించి… వాస్తవాలు వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. ఏది నిజమో చెప్పడంతో పాటు.. రాజకీయ కుట్రల్లో భాగంగా సహజ మరణాలపై తప్పుడు ప్రచారాలు చేసేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్తీ లిక్కర్తో మరణాలు అని ప్రచారం చేస్తే దానికి రుజువు చూపాలని అడగాలని… తప్పుడు ప్రచారం అని తేలితే చట్టవరంగా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.

ఎలక్ట్రానిక్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దని సీఎం స్పష్టం చేశారు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి లాభం పొందుదామనుకుంటే ప్రభుత్వం, ప్రభుత్వ శాఖలు సైలెంట్ గా చూస్తూ ఊరుకోవని సీఎం హెచ్చరించారు. ఈ సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర లోకేష్ నేరుగా హాజరవ్వగా.. హోంమంత్రి సహా పలువురు మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 2019లో వివేకా హత్య సమయంలో వైసీపీ ఆడిన డ్రామాలు, శవ రాజకీయాలను మరిచిపోవద్దని చెప్పారు. వాళ్లు ఫేక్ ప్రచారంతోన ప్రజలను నమ్మించాలనే ప్రయత్నంలో ఉంటారన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Chandrababu Naidu fake liquor latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.