సిట్ విచారణలో కీలక మలుపు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన నకిలీ(Liquor case) మద్యం కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు (A1) విచారణ సందర్భంగా మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్ పేరును ప్రస్తావించినట్లు సమాచారం. సిట్ అధికారులు ఏడు రోజుల కస్టడీ భాగంగా జనార్ధనరావు మరియు జగన్మోహనరావులను నెల్లూరు, విజయవాడ జైళ్ల నుండి తూర్పు ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఈ విచారణలో జనార్ధనరావు, జోగి రమేశ్(Jogi Ramesh) ప్రలోభాలకు లోనై నకిలీ మద్యం వ్యాపారంలోకి ప్రవేశించానని వెల్లడించినట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు జోగి రూ.3 కోట్లు సహాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించారని ఆయన వెల్లడించారు.
Read also: యువతిపై అత్యాచార యత్నం.. ప్రతిఘటించిందని చంపిన నిందితుడు
జోగి రమేశ్‌పై ఆరోపణలు తీవ్రం
జనార్ధనరావు చెప్పిన ప్రకారం, ములకలచెరువులో నకిలీ(Liquor case) మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి, దానివల్ల అప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబును బద్నాం చేయాలని జోగి సూచించాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా, వైసీపీ ప్రభుత్వ కాలంలో కూడా జోగితో కలిసి అక్రమ మద్యం వ్యాపారం చేసినట్లు వివరించాడు.
ఎన్నికల సమయాన నిఘా పెరగడంతో ఆ వ్యాపారాన్ని నిలిపివేసినట్లు కూడా వెల్లడించాడు. ఆఫ్రికా వెళ్లే ముందు రోజు ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసినట్లు, ఆ తర్వాత ఆయన సహాయకులు ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలోని తయారీ కేంద్రాల సమాచారాన్ని అధికారులకు అందించారని తెలిపాడు.ఈ వివరాలతో సిట్ అధికారులు జోగి రమేశ్ పాత్రపై మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. కేసులో ఆయనపై ఆరోపణలు బలపడడంతో, రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: