📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest Telugu news : Fake doctorates : నకిలీ డాక్టరేట్లతో ప్రతిభకు మకిలి!

Author Icon By Sudha
Updated: October 15, 2025 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈమధ్య కాలంలో నకిలీ డాక్టరేట్ల ను ప్రదానం చేసే సంస్థలు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టిం చాయి. గౌరవప్రదమైన డాక్టరేట్లను ఒక ప్రహసనంగా మార్చారు. పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోవడం ఫ్యాషన్గా మారిపోయింది. కొందరు సాహితీవేత్తలు, కళాకారులు ఏదో ఒక బిరుదును పేరుకుముందు తగి లించుకుని తమ ప్రతిభకు తార్యాణం లా వాటిని సమాజానికి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కళాసంస్థలు, సామాజిక సంస్థలు అవార్డుల పేరుతో సన్మానాలు, సత్కా రాలు చేయడం తెలుగురాష్ట్రాలలో సర్వసాధారణంగా మారిపోయింది. కొంతమంది వ్యక్తులు ఏకంగా గౌరవ డాక్టరేట్లు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గొప్పగొప్ప యూనివర్సిటీ లు ఇచ్చే డాక్టరేట్లను ఆయా సంస్థలు ఎగతాళి చేసేలా డాక్టరేట్లు ఇవ్వడం మొదలు పెట్టారు. వీటికోసం ఆయా సంస్థలు ఒక్కొక్కరి నుంచి రూ.20వేల నుంచి రూ.50వేల వరకు కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంస్థలు చేసే నకిలీ డాక్టరేట్ల (Fake doctorates) అమ్మకాల వ్యాపారం వల్ల సామాజిక, సాంస్కృతిక, సాహితీ, కళల రంగాల్లో సేవ చేస్తూ వస్తున్న నిజమైన సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నకిలీ డాక్ట రేట్లు (Fake doctorates) ఇచ్చేవారు, తీసుకునేవారు ఇరువర్గాల వారు లాజిక్ గా మాట్లాడుతుంటారు. ఆ సంస్థ ఇస్తుంది కాబట్టి మేము తీసుకుంటున్నామని తీసుకునేవారు చెబుతుంటే, మాకు ఐఎస్ఓ గుర్తింపు ఉంది. కాబట్టి మేము డాక్టరేట్లను ఇచ్చే అర్హత పొందాము, డాక్టరేట్లు తీసుకునే వారు అంగీకరిస్తున్నారు కాబట్టే మేము ఇస్తున్నాము అని ఇచ్చెనమ్మ వాయి నం, పుచ్చుకోమ్మ వాయినంలో ఇరువర్గాలు మాట్లాడుతు న్నారు. అసలు డాక్టరేట్ఎలా వస్తుంది అనే మూలాల్లోకి వెళితే అనేక విషయాలు బహిర్గతమౌతాయి. వైద్య విద్యను అభ్యసించిన వారికి పేరుకుముందు డాక్టర్ అని పెట్టుకోవడానికి అర్హత ఉంది. అదేవిధంగా విశ్వవిద్యాలయాలలో అనేక సంవత్సరాలపాటు పరిశోధనలు చేసినవారు పట్టా పొందితే డాక్టరేట్వ స్తుంది.

Fake doctorates : నకిలీ డాక్టరేట్లతో ప్రతిభకు మకిలి!

నిజమైన అర్హత

పలు రంగాలలో జీవితాంతం కృషిచేసిన వారి ప్రతిభను మెచ్చి యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవి ద్యాలయాలు గౌరవ డాక్టరేట్ఇస్తాయి. ఈ రకమైన మూడు డాక్టరేట్లు పొందడమంటే ఆషామాషీ కాదు. అకుంఠిత దీక్షతో ఏళ్ళతరబడి కష్టపడి పనిచేస్తేనే అవి లభ్యమోతాయి. అలా డాక్టరేట్లు పొందిన వారికి సమాజంలో ఎంతో గౌరవమర్యా దలు కూడా లభిస్తాయి. ఇటువంటి గౌరవమర్యాదలను అడ్డదారిలో పొందాలని కొందరు ప్రాకులాడుతున్నారు. కేవ లం కీర్తికాంక్షతో తపించే ఇటువంటి వారి వద్ద డబ్బులు తీసుకుని కొన్ని సంస్థల వారు నకిలీ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నారు. కీర్తి కండూతి కలవారు ఇటువంటి నకిలీ డాక్టరేట్లు కొనుక్కుని తమ పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకుని ఈ సమాజాన్ని తామే ఉద్ధరిస్తున్నట్టు పోజులు కొడుతుంటారు. ఇటువంటి వారి బలహీనతలను తెలుసుకున్న సంస్థలు మాకు ఐఎస్ఓ గుర్తింపు ఉంది. మా సంస్థ డాక్టరేట్లు ఇవ్వడానికి నిజమైన అర్హతకలిగిందని నమ్మ బలికి నకిలీ డాక్టరేట్లను పప్పుబెల్లాలవలే పంచేస్తున్నారు. దీనివల్ల విశ్వవిద్యాలయల్లో కష్టపడి చదివి నిజమైన డాక్ట రేట్లు సాధించిన పరిశోధకులు, వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్లు, యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుండి ప్రతిభతో గౌరవ డాక్టరేట్లు పొందిన వారి ఆత్మగౌర వం దెబ్బతింటుంది. అటువంటి ప్రతిభగలవారి గౌరవం కాపాడాలంటే నకిలీ డాక్టరేట్ల (Fake doctorates)ను అరికట్టవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంస్థలు రూ.20 వేల నుండి రూ.50 వేల వరకు ఒక్కొక్కరి నుండి వసూలు చేసి పేరొందిన గొప్పకళాక్షేత్రంలో వైభవంగా నకిలీ డాక్టరేట్ల ప్రధాన సభను నిర్వహిస్తున్నారు. తమాషా విషయమేమిటంటే ఇటువంటి దోపిడీ సంస్థలు అతిథులుగా పిలవగానే పద్మశ్రీ పురస్కార గ్రహీతలు మొదలుకుని, కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతలు, కళారత్న ఆవార్డు గ్రహీతులు, ప్రముఖులుగా ప్రశంసలందుకుంటున్నవారు సైతం ఎగబడి అతిథులుగా వెళుతున్నారు. అటువంటి వారంతా పురస్కార ప్రదాతలుగా ఉండటం వల్ల ఆ పురస్కారం చాలా గొప్పదనే భావన చూసే వారికి ఇంతమంది ప్రముఖుల చేతులమీదుగా ఈ నకిలీ గౌరవ డాక్టరేట్ అందుకున్న కలుగుతుంది.

ఇదోరకమైన మాయ. వారు తమ పట్టణాలకు వెళ్ళి గౌరవ డాక్టరేట్ పొందినట్టు పత్రికలకు ప్రకటనలు ఇచ్చి తాము ప్రతిభావంతులమని సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫోటో లలో ప్రముఖులు ఉండటంతో ఇది చాలా గౌరవప్రదమైన డాక్టరేట్ అని భ్రమపడి విలేకర్లు విపరీతంగా కవరేజ్ ఇస్తు న్నారు. ఆ డాక్టరేట్ నకిలీది అని తెలిసేలోపు అందుకున్న వారు ప్రతిభావంతులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటు వంటి నకిలీ డాక్టరేట్ల ప్రధాన కార్యక్రమానికి ప్రముఖులు వెళ్ళడం మానుకుంటేనే వీటిని అరికట్టడానికి అస్కారం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మంచి, చెడు విజ్ఞత తెలిసిన విద్యాధికులు కూడా అనాలోచితంగా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని నకిలీ డాక్టరేట్లకు ఎక్కడలేని గుర్తిం పును ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి సంస్థలు ప్రముఖుల ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించినప్పుడు ‘ఇవి నకిలీ డాక్టరేట్లు, వీటిని ప్రదానం చేయడం తప్పు’ అని నిర్వాహు లను మందలించవలసిన బాధ్యత వారిపై ఉంది. ముఖ్య అతిథులుగా వెళ్ళి పేపర్లో ఫోటోలు వేయించుకుందామని భావిస్తే తమ ప్రతిష్ఠ కూడా దిగజారిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మాకు ఐఎస్ఓ గుర్తింపు ఉంది కాబట్టి మా సంస్థ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయడానికి అర్హత పొందిందని కొన్ని సంస్థలవారు బుకాయిస్తున్నారు.

Fake doctorates : నకిలీ డాక్టరేట్లతో ప్రతిభకు మకిలి!

ఐఎ అంటే ఏమిటి?

ఐఎస్ఓ అంటే (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజే షన్) ఈసంస్థ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న ఒక అంతర్జా తీయ ప్రమాణ సంస్థ. ఇది ఉత్పత్తులు, సేవలు,నాణ్యత నిర్వహణ వ్యవస్థలు ఇత్యాది వాటికి ప్రమాణాలు ఇవ్వడం మాత్రమే చేస్తుంది. ఐఎస్9001 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఐఎస్ 14001 ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇలాంటి వాటి ద్వారా ఒక సంస్థ పని నాణ్యత, విధాన పద్ధతులు సరైనవా అనిమాత్రమే నిర్ధారిస్తారు. అంతే కానీ ఐఎస్ఓ ఎప్పుడూ విద్యా అర్హతలు ఇవ్వదు. డాక్టరేట్లు ఇవ్వవడానికి అనుమతి అంతకన్నా ఇవ్వదు. ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ అది విద్యా గుర్తింపు కాదు. నిజమైన డాక్ట రేట్లను యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సి టీలు, విదేశీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలుమాత్రమే చట్టబద్ధమైన డాక్టరేట్లు ఇవ్వగలవు. కులం బలంగా పని చేస్తున్న ఈ రోజుల్లో మతపరమైన డాక్టరేట్లు ఇచ్చేవారు ఒక అడుగు ముందుకు వేసి పద్యకవులు, వచన కవులకు కూడా డాక్టరేట్లు ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలలోని పలురంగాలలో ప్రతిభావంతులకు డాక్ట రేట్లు ఇస్తున్నామని కొన్ని విదేశాలకు చెందిన విశ్వవిద్యాల యాలు సైతం హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతా లలో ఒకరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వంద మందిని సేకరించి ఒక్కోక్కరి నుండి రూ. 50వేలు వసూలు చేసి అట్టహాసంగా కార్యక్రమాన్ని జరిపి గౌరవ డాక్టరేట్లు ఇస్తున్నారు. ఈ విధంగా వారు ఒక్కరోజు నిర్వహించిన కార్యక్రమానికిగాను రూ. 50లక్షలు సంపాదించుకుంటు న్నారు. ఆ విశ్వవిద్యాలయానికి గుర్తింపు ఉందో? లేదో ఎవరు చూడరు. రూ.50 వేలు చెల్లించి గౌరవ డాక్టరేట్ తెచ్చేసి సమాజంలో రాత్రికిరాత్రి పేరుప్రఖ్యాతులు సంపాదించు కోవాలనే తపన తప్ప వీరివల్ల సమాజానికి ఎటువంటి ఉప యోగం లేదని గ్రహించలేకపోతున్నారు. ఇలా నకిలీ డాక్ట రేట్లు ఇచ్చే సంస్థలు తెలుగు రాష్ట్రాలలో చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రూ. 150 ఇస్తే చాలు ఆన్లైన్లో డాక్టరేట్ ఇస్తున్నట్టు ధ్రువపత్రాలను పప్పుబెల్లాలవలే పంచేస్తున్నారు. అలా ధ్రువపత్రాలను పొందినవారు వాటిని సామాజిక మాధ్యమాలలో పెట్టుకుని తెలుగు సాహిత్యన్ని తామే ఉద్దరి స్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రముఖులు ఇటువంటి నకిలీ సంస్థలు ఇచ్చే డాక్టరేట్లు, పురస్కార సభలకు వెళ్ళి వారి స్థాయిని తగ్గించుకోవద్దని రచయితలు సూచి స్తున్నారు. డాక్టరేట్లు, పురస్కారం ఇచ్చేవాడి అర్హత ఏమిటి అని ఎవరూ ప్రశ్నించడం లేదు. ఇటువంటి నకిలీ సంస్థ లపై ప్రభుత్వ దృష్టిపెట్టి తీవ్రస్థాయి చర్యలు చేపట్టి, వారి ఆటలు సాగకుండా అడ్డుకట్ట వేసి ప్రతిభావంతుల ఆత్మగౌర మాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది.
-షేక్ అబ్దుల్ హకీం జాని

నిజమైన డాక్టర్, పిహెచ్డి లేదా ఎంబిబిఎస్ ఎవరు?

ఇద్దరికీ “డాక్టర్” అని పేరు పెట్టారు, కానీ వారి పాత్రలు మరియు నైపుణ్యం గణనీయంగా భిన్నంగా ఉంటాయి. MBBS వైద్యులు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే వైద్య నిపుణులు, అయితే PhD వైద్యులు వారి ప్రత్యేక రంగాలలో పరిశోధకులు మరియు విద్యావేత్తలు.

ప్రైవేట్ పీహెచ్డీ చెల్లుతుందా?

రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయ పీహెచ్‌డీలు చెల్లుబాటు అవుతాయి. మరియు మీరు పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ అయినా లేదా పూర్తి సమయం అయినా 3 సంవత్సరాలలో పూర్తి చేయవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Academic Fraud Breaking News Education Scam Fake Degrees Fake Doctorates Honorary Doctorates latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.