हिन्दी | Epaper

Fake Degree Warning: ఫేక్ యూనివర్సిటీలపై UGC కీలక ప్రకటన

Aanusha
Fake Degree Warning: ఫేక్ యూనివర్సిటీలపై UGC కీలక ప్రకటన

Fake Degree Warning: ఫేక్ యూనివర్సిటీలపై యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక ప్రకటన చేసింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న యూజీసీ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 32 విశ్వవిద్యాలయాలు నకిలీవని స్పష్టం చేసింది. ఈ సంస్థలు చట్టబద్ధ గుర్తింపు లేకుండా డిగ్రీలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.ఈ ఫేక్ యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని స్పష్టం చేసింది. ఉద్యోగాలకు లేదా ఉన్నత చదువులకు ఈ విశ్వవిద్యాలయాలు జారీ చేసే ధృవపత్రాలు పనికిరావని తేల్చి చెప్పింది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు లేని ఈ సంస్థలు డిగ్రీలు జారీ చేసే అధికారం కలిగి లేవని తెలిపింది.

Amit Shah: చొరబాటుదారులనూ మరో ఐదేళ్లలో ఏరివేస్తాం

కీలక సూచనలు

విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందడానికి ముందే ఆయా సంస్థల గుర్తింపును విద్యార్థులు తనిఖీ చేసుకోవాలని కీలక సూచనలు జారీ చేసింది.దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 12 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని యూజీసీ వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 4 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు గుర్తించింది. యూజీసీ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్), 3 ప్రకారం.. ఢిల్లీ 12, ఉత్తర్‌ప్రదేశ్ 4, ఆంధ్రప్రదేశ్ 2, కర్ణాటక 2, కేరళ 2, మహారాష్ట్ర 2, పుదుచ్చేరి 2, పశ్చిమ బెంగాల్ 2.. అరుణాచల్ ప్రదేశ్ 1, హర్యానా 1, జార్ఖండ్ 1, రాజస్థాన్ 1 యూనివర్సిటీ ఉందని యూజీసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న క్రీస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ.. విశాఖపట్నంలో ఉన్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలు ఫేక్ యూనివర్సిటీలు అని స్పష్టం చేసింది.

Fake Degree Warning: UGC key statement on fake universities
Fake Degree Warning: UGC key statement on fake universities

ఢిల్లీలోని కొన్ని ముఖ్యమైన యూనివర్సిటీలు

  • యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ
  • వొకేషనల్ యూనివర్సిటీ
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం
  • కర్ణాటక బెంగళూరులోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ
  • కేరళలోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ
  • మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని రాజా అరబిక్ యూనివర్సిటీ
  • ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని గాంధీ హిందీ విద్యాపీఠ్
  • ఉత్తర్‌ప్రదేశ్‌‌ అలీఘర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870