📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Extensive revision of the voters’ list : ‘సర్’ ప్రకంపనలు

Author Icon By Sudha
Updated: November 26, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘సర్’ పేరెత్తితేనే విపక్షాల్లో అదీ అతి ముఖ్యం గా కాంగ్రెస్ పార్టీ వంటి మీద జెర్రిలు పాకుతున్నాయి. నిన్నగాక మొన్న ఎన్నికల కమిషన్ పై సవాల్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీపై తమ నిరసన ధ్వనులను పెంచుతున్నాయి. ఒకపక్క ఎన్నికల కమిషన్ త్వరలో ఎన్నికలు జరిగే పశ్చిమబెంగాల్, తమిళ నాడు, కేరళ వంటి రాష్ట్రాలలో ఓటర్ల జాబితా విస్తృత సవరణ (సర్) (Extensive revision of the voters’ list) కార్యక్రమాన్ని చేపట్టగా కాంగ్రెస్ అధ్యక్షు డు రాహుల్గాంధీ, ‘ఓట్ చోరీ’ ప్రచార కార్యక్రమాన్ని బహుళ ప్రచారం చేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో చతికిలపడినా ఓటరు జాబితా విషయంలో రాజీ పడేది లేదనే ధోరణిలో ముందుకు కదులుతున్నారు. ఎన్నికల కమిషన్ ఏం చేసినా, ఎలా చేసినా విమర్శించే విపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకెపార్టీలు తీవ్రంగా అడ్డుపడుతున్నాయి. బ్యాలెట్ బాక్స్ లతో ఓటింగ్ విధానం ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతికి మారాక కొన్ని ఎన్ని కల వరకూ బాగా నడిచిందని ప్రశంసలు ఇచ్చిన పార్టీలు ఇప్పుడు ఆ విధానం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని ఘోషిస్తున్నాయి. పార్టీ ఏదైనా తమకు ఓటింగ్ అనుకూలంగా రాకపోయి ఓటమిపాలైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రక్రి యలో లోటుపాట్లు ఉన్నందునే తాము ఓడిపోయామని విమర్శలు గుప్పించేవారు. వారు వీరుగా, వీరు వారుగా అధికార విపక్ష పార్టీలు తమ స్థానాలు మారినా విమర్శ లకు వెనుకాడడం లేదు. బీహార్లో ‘సర్’ (Extensive revision of the voters’ list) ర్యక్రమం చేపట్టినప్పుడు ఎన్నికల కమిషన్ను కాంగ్రెస్ పార్టీ విపరీ తంగా ఆరోపణలు గుప్పించింది. ఎన్నికల కమిషన్ తన ధోరణిలో తనప్రణాళిక ప్రకారం ఓటరు జాబితా సవరణ కార్యక్రమం చేపట్టింది. ఎన్నికలు సజావుగానే నడిపిం చింది. బీహార్లో అప్పటికే అధికారంలో ఉన్న పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. అంటే విపక్షాల అభ్యంతరాలు ఎవరినీ కదిలించలేదన్నది సుస్పష్టం. అయినా కాంగ్రెస్ తదితర పక్షాలు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న ధోరణిలో తమ పిడివాదంతో ‘ఓట్ చోరీ’ ర్యాలీకి సిద్ధమ వుతున్నాయి. డిసెంబరు 14న ఢిల్లీలోని రామ్ లీలా మైదా నంలో భారీ ర్యాలీ నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది. ఓటు దొంగల కబంధ హస్తాల నుంచి భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించే నినాదంతో కాంగ్రెస్ సంతకాల సేకరణ చేస్తోంది. బీహార్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఆలోచనలో మార్పు తెచ్చుకోగలదని అందరూ భావించారు. కానీ అలా జరుగలేదు. కనీసం ఆది నుంచీ ఒకే మాటమీద వ్యవహా రాన్ని నడిపిస్తున్నారు. బోగస్ ఓట్లను చేర్చడం, విపక్ష అనుకూల ఓటర్లను తొలగించడం, ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడడం వంటివి ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీలు కలిసికట్టుగా వ్యవహరిస్తున్నాయన్నది కాంగ్రెస్ ఆరోపణలు. బిజెపి ఓటర్లకు ఆయా నియోజక వర్గాల్లో నగదు పంచుతున్నా చర్యలు తీసుకో కుండా, ఇసి సహకరిస్తోందని విపక్షాలు గట్టిగా నమ్ముతున్నాయి. కర్ణాటక నుంచే బిజెపి ‘ఓట్ చోరీ’కి మద్దతు ఇస్తోందని, తాజాగా బీహార్ ఎన్నికల ఫలితాలు ‘ఓట్ చోరీ’ ప్రభావమేనని కాంగ్రెస్ తమ పార్టీ శ్రేణుల్లో నమ్మ కం కలిగించింది. కర్ణాటక కాంగ్రెస్ 1.12కోట్ల సంతకాలు సేకరించగా పంజాబ్, కాంగ్రెస్ యూనిట్ 27 లక్షల సంత కాలను సేకరించి పార్టీకి సమర్పించింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ మొదలైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఎన్నికల కమిషన్పై రుసరుసలాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక ఉద్దేశపూర్వక కుట్రగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. బీహార్ లో ‘సర్’ అమలులో విజయవంతమైన కార్యక్రమంగా రూపొందించి దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేప ట్టేందుకు ఇసి నిర్ణయం తీసుకుందంటే అది ఎంతోమంచి కార్యక్రమమేననుకోవాలి. అయినా బిజెపియేతర ఇండియా కూటమిలు ప్రధానపక్షమైన కాంగ్రెస్ఎన్నికల కమిషన్ వివవరణలను ఆకళింపు చేసుకోలేకపోయింది. దానికితోడు దేశవ్యాప్త ‘సర్’ విచారణ కోసం నియమితులైన 16మంది బిఎల్ఎలు ఒత్తిడి వల్లనే మరణించారన్న వార్తలను ఆస రాగా చేసుకుని ఇసి ఒత్తిడిలపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ బిఎల్ఎల పాలిట మృత్యుపాశంలా తయారయ్యిందని కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ఇసి నిర్ణయాలపై ఆరోపించారు. పశ్చిమ బంగలోని ధులగోరి, బిరాటి, న్యూటేన్ ఘసురి వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే బంగ్లా దేశీయులు ఓటర్ల జాబితా ఏరివేతలో తగు పత్రాలు చూపలేక అక్రమంగా వలస వచ్చినట్లు తేలినవా రంతా ఇప్పుడు బంగ్లాదేశ్ దారిపట్టారు. ఇప్పుడీ కార్యక్రమం వలన పశ్చిమ బెంగాల్లో సంక్లిష్ట పరిస్థితులేర్పడ్డా యి. బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాల్లో ఉండేవారి పత్రా లను చూసే పనిని బిఎస్ఎఫ్ జవాన్లకు అప్పగించారు. వెనక్కివెళ్లే సమయంలోనూ వీరే వారిపత్రాలను పరిశీ లించి పోలీసులకు పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎంతో కష్టమైనది. సుదీర్ఘమైనది. బంగ్లాదేశీయుల రివర్స్ మైగ్రే షన్తో బెంగాల్ పోలీసులు సతమత మవుతున్నారు. సరైన పత్రాలు లేనివారిని నిర్బంధించి జైల్లోపెట్టే పరిస్థితి ఉంది. నిజానికి బంగ్లాదేశీయులు పశ్చిమ బెంగాల్లో ప్రవేశించిన ప్పుడు దళారీల ద్వారా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు, ఓటరు ఐడీలతో ప్రవేశించారు. ఇప్పుడు లాంటి ఎన్నీ బయ టపడి పత్రాలన్నీ నకిలీవని తేలుతున్నందున ఎంతోమంది బంగ్లాదేశీయులుఇక్కట్ల పాలవు తున్నారు. తాత్కాలికంగా నైనా ఆ వారికి భద్రత కల్పించడం పోలీసులకు అంతే తేలికైన పనిలా లేదు. ఎఆర్ కారణంగా అసాధారణ వలస దారులను పట్టుకోవడం సాధ్యమౌతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BreakingNews Election Commission Electoral Roll Governance latest news Politics Telugu News Voters List

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.