ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) అధికార పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే, జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. “మీ రెడ్‌బుక్‌కు నేను భయపడను.. ఐ డోంట్ కేర్ చంద్రబాబు” అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
Read Also: Ambati Rambabu : ఇక అసలు సినిమా అంబటికి చూపిస్తాం – కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: