हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Tirumala-పరిపాలన భవనంలో ఇఒ సింఘాల్ తనిఖీలు

Pooja
Telugu News: Tirumala-పరిపాలన భవనంలో ఇఒ సింఘాల్ తనిఖీలు

Tirumala : ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలనపై మరింత పట్టుకలిగించుకునే దిశగా నూతన ఇఒ అనిల్కుమార్సింఘాల్ అడుగులు వేస్తున్నారు. గతంలో ఈయన ఇఒగా మూడు సంవత్సరాలు నాలుగునెలల కాలం బాధ్యతలు కొనసాగించిన అనుభవం ఉన్నప్పటికీ అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితుల్లో ఉద్యోగుల్లో సేవాభావం, వేగవంతమైన పనితీరును ఆశించే రీతిలో కదులుతున్నారు.

Tirumala

టిటిడి పరిపాలన భవన సందర్శన

రెండవసారి ఇఒగా బాధ్యతలు చేపట్టిన సింఘాల్ గురువారం ఉదయం తొలిసారిగా తిరుపతిలోని టిటిడి పరిపాలనభవనం చేరుకున్నారు. అక్కడ అన్ని విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులను స్వయంగా ఇఒనే వెళ్ళి కలసి పలకరించారు. కార్యాలయం పనివేళల్లో ఉద్యోగుల హాజరు,(Employee attendance), చేస్తున్న పని తదితర అంశాలను నిశితంగా గమనించారు. అంతేగాక ఆయా విభాగాలకు సంబంధించి రోజువారీగా రికార్డులను తనిఖీ చేశారు.

సేవాసంస్థలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. అంకితభావంతో విధులు నిర్వహించడం, నూతన సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకుని భక్తులకు అవసరమైన మేరకు సేవలందించాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా గతంలో ఇఒగా పనిచేసిన సమయంలోనే టిటిడి పరిపాలన భవనాన్ని ఆధునీకరించడం, అన్ని హంగులతో తీర్చిదిద్దే ప్రణాళికలు సింఘాల్ మదిలో తోచిన ఆలోచనే.

విభాగాల తనిఖీలు

మళ్ళీ ఇఒగా రావడంతో ప్రధానంగా ఆయన తన తొలిరోజునే అకౌంట్స్, అన్నదానం, బోర్సెల్, ఐటి, సోషల్ మీడియా(Social Media), ఇంజనీరింగ్, విద్య, ప్రజాసంబంధాల కార్యాలయం, ఎస్టేట్ కార్యాలయాలను సందర్శించారు. ఆయా విభాగాల్లో అధికారులు, సిబ్బందితో ఆప్యాయంగా పలకరించారు. అందరూ కలసికట్టుగా పని చేసి టిటిడికి మరింతగా మంచిపేరు తీసుకు వచ్చేద్దామని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ తరహాలో టిటిడిలో మినీ సచివాలయం పాలన ఉందని, ఉద్యోగులు, సిబ్బంది, అధికారులు సేవాభావంతోనే పనిచేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సానుకూలంగా పరిష్కరిస్తానని సింఘాల్ తెలిపారు.

బాధ్యతలు స్వీకరణ

అంతకుముందు పరిపాలన భవనంలోని ఆయన ఛాంబర్లో ఇఒగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అనిల్కుమార్సింఘాల్‌ను తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం అర్చకులు, స్థానిక ఆలయాల అర్చకులు పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు, ఉద్యోగులు ఇఒను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎసిఎఒ బాలాజీ, అదనపు ఎఫ్ఎసిఎఒ రవిప్రసాద్, సిఇ టివి సత్యనారాయణ, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, ఉద్యో గసంఘాల నాయకులు చీర్లకిరణ్, రవికుమార్, శివ, పవన్, తేజేశ్వర్, మాధవ్, ఈశ్వర్నాయక్, ఉమ, భరత్, అంకయ్య తదితరులు ఉన్నారు.

కొత్త ఇఒగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
అనిల్ కుమార్ సింఘాల్.

ఇఒ సింఘాల్ గతంలో ఎంతకాలం టిటిడిలో పనిచేశారు?
మూడు సంవత్సరాలు నాలుగు నెలలు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Latest News: Wind power project – కొత్తగా 2 వేల మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870