ఇరవైఒకటో శతాబ్దంలో మానవ హక్కుల భావన విస్త రించి, జీవన ప్రమాణం, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధి, స్వేచ్ఛలతోపాటు, శుద్ధి, ఆరోగ్యకరమైన, సుస్థిర పర్యావరణం కూడా ఒక మౌలిక మానవ హక్కుగా అంతర్జాతీయ స్థాయి లో అంగీకరించబడింది. పర్యావరణం (Environment) కేవలం ప్రకృతికి సం బంధించిన అంశం కాదు, అది మనిషి గౌరవంగా జీవించే హక్కుని నిర్వచించే ముఖ్యమైన ఆధారం. వాయు కాలుష్యం నుండి వాతావరణ మార్పులు, నీటి సంక్షోభం నుండి అటవీ విధ్వంసం వరకూ ప్రతి పర్యావరణ (Environment) సమస్య మానవ హక్కు లను లోతుగా దెబ్బతీస్తోంది. ప్రతి డిసెంబర్ 10న ప్రపం చం మానవ హక్కుల దినోత్సవాన్ని పాటిస్తుంది. ఈ సంవ త్సరం థీమ్ ‘మన రోజువారీ అవసరాలు’ అనే నినాదంతో పనిచేస్తోంది. ఐక్యరాజ్యసమితి 1948లో ప్రకటించిన యూని వర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ (యూడిహెస్ఆర్) ప్రపంచ ప్రజలకు సమాన హక్కులను హామీ చేస్తూమానవ నాగరి కతను కొత్త దశలోకి నడిపింది. ప్రజల జీవితాలను ప్రభా వితం చేసేపర్యావరణ సమస్యలు పెరుగుతున్నకొద్దీ, ప్రజలు పర్యావరణ పరిరక్షణను ఒక న్యాయపరమైన, రాజ్యాంగపర మైన హక్కుగా భావిస్తున్నారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ సమస్యలు మరింత క్లిష్టంగా మారాయి. అందుకే, మానవ హక్కులు పర్యావరణ
సమస్యల మధ్య సంబంధం నేటి సమాజంలో అత్యంత ప్రముఖమైన చర్చగా మారింది. వేగంగా మారుతున్న ప్రపంచ రాజకీయా లు, పెరుగుతున్న అసమానతలు, సాంకేతిక యుగంతెచ్చిన కొత్త ప్రమాదాలు ఇవన్నీ కలిపి మానవ హక్కుల పరిరక్షణ ను మరింత సవాలుగా మార్చుతున్నాయి. పర్యావరణం ఒక మానవ హక్కు’పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, స్థిరమైన పర్యావరణం సార్వత్రిక మానవ హక్కు.’ ఐక్యరాజ్యసమితి 2022లో స్పష్టం చేసింది. శ్వాసించడానికి శుద్ధమైన గాలి, తాగడానికి సురక్షితమైన నీరు, కాలుష్యం రహిత నేల, జీవ వైవిధ్యం పరిరక్షణ, పర్యావరణ ప్రమాదాల నుండి రక్షణ, వాతావరణ మార్పులకు అనుకూలించే సామర్థ్యం మొదలై నవి ప్రధానమైనది. ఇవే గనుక లేకపోతే, మానవుల అస్తి త్వం, ఆరోగ్యం, జీవనోపాధి అన్నీప్రమాదంలో పడతాయి.
Read Also: http://Telangana Tourism: తెలంగాణ రైజింగ్ సమ్మిట్: డిజిటల్ స్టాల్ ప్రారంభించిన మంత్రి జూపల్లి…
జీవించే హక్కు
భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 జీవించే హక్కుని హామీ ఇస్తుంది. భారత సుప్రీంకోర్టు దీనిని విస్తరించి, శుభ్రమైన పర్యావరణం జీవించే హక్కులో భాగం” అని పలు తీర్పుల్లో పేర్కొంది. ఉదాహరణకు ఢిల్లీలో వాయుకాలుష్యం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కర్మాగార కాలుష్యం వల్ల క్రమంగా కాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 2025లో విశాఖ, హైదరాబాద్ వాయు నాణ్యత ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా, కలు షితంగా ఉన్నట్లు కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సి. పి.సి.బి) నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో 70శాతం నీటి వనరులు కాలుష్యం గురవుతున్నాయని నీతి ఆయోగ్ హెచ్చరించింది. నీటి కాలుష్యం, అందరికి అందుబాటులోకి లేకపోవడం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ప్రభావితం చేస్తోంది. ప్రపంచ దేశాల ఒప్పందాలు, మానవ హక్కులు1972లో స్టాక్హోమ్ డిక్లరేషన్లో పర్యావరణం, మాన వ హక్కుల మధ్య సంబంధం, 1992 రియో డిక్లరేషన్లో సుస్థిర అభివృద్ధిని సాదించడం, 2015 పారిస్ క్లైమేట్ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రత నియంత్రణ చేయడం, 2021-2022 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ ప్రకారం పర్యావరణం మౌలిక హక్కు అని వెల్ల డించింది. భారతదేశంలోని అత్యంత వాయు కాలుష్య నగ రాల్లో ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, హైదరాబాదు, విశాఖ పట్నం, నాగ్పూర్ ప్రధానమైన స్థానంలో ఉన్నాయి. చిన్నా రుల ఊపిరితిత్తుల అభివృద్ధి దెబ్బతింటోంది, వృద్ధుల ఆరో గ్యం మరింత క్షీణిస్తోంది, పేద వర్గాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. యమునా, గంగా, గోదావరి, కృష్ణా నదులు
పరిశ్రమల వ్యర్థాలతో తీవ్రమైన కాలుష్యానికి గురవుతున్నాయి.
సుస్థిర అభివృద్ధి
పలు పర్యావరణ సంస్థలు ప్రకారం, మున్సిపల్ మురుగునీరు శుద్ధి లేకుండానే చాలా ప్రాంతాల్లో నదుల్లో కలుస్తోంది. అటవీ ప్రాంతాలను అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్నారు. వీటి వలన గిరిజన సమాజాలు అత్యంత ప్రభావితమవుతున్నాయి. భూములు కోల్పోవడం, సంస్కృతి, జీవనోపాధి నష్టం, శబ్దకాలుష్యం, భూగర్భ జలాలు తగ్గడం జరుగుతోంది. పర్యావరణ సమస్యలు ఎల్లప్పుడూ అసమానతలను పెంచుతాయి. పర్యావరణ ప్రయోజనాలు అందరికి సమానంగా లభించాలి. పర్యావరణ భారాలు ఒకవర్గం మీదపడకూడదు. ఇది సామాజిక న్యాయం పర్యావరణ పరిరక్షణ కలయిక. పర్యావరణ చట్టాలను కఠి సంగ అమలు చేయడం, కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన జరిమానాలు విధించడం, కచ్చితమైన పర్యావణాన్ని అంచనా వేయడం, ప్రజల అవగాహన పెంచడం, పాఠశాలల్లో పర్యా వరణ విద్య, స్థానిక స్థాయిలో పర్యావరణ కమిటీలు వేయ డం, సుస్థిర అభివృద్ధి మోడల్, పునరుత్పాదక విద్యుత్, రసాయన రహిత వ్యవసాయం, జల సంరక్షణ వంటి వాటి పై మరింత పరిశోధన పెరిగి కాలుష్యరహిత, రీసైక్లింగ్ని పెంచాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను పర్యా వరణ ప్రాజెక్టులకు వినియోగించడం పెంచాలి. ఇవన్నీకూడా పర్యావరణ పరిరక్షణలో తీసుకోవాల్సిన చర్యలు.
ప్రకృతిపై ప్రేమ
పర్యావరణ పరిరక్షణ ప్రకృతిపై ప్రేమ మాత్రమే కాదు మానవ హక్కుల సంరక్షణ కూడా భాగమే. మనిషి ఆరోగ్యం, జీవితం, జీవనో పాధి అన్నీ పర్యావరణంతో బలంగా అనుసంధానమై ఉన్నా యి. పర్యావరణం నాశనం అవుతుంటే, మానవ హక్కులు కూడా కూలిపోతాయి. అందుకే పర్యావరణ పరిరక్షణనుప్రభు త్వాలు, కోర్టులు, సంస్థలు మాత్రమే కాకుండా, ప్రతిపౌరుడు తనబాధ్యతగా తీసుకోవాలి. పర్యావణాన్ని కాపాడుకోవటం, రక్షించడం, బలోపేతం చేయడం పౌరుడిగా ప్రతిఒక్కరిబాధ్య త. సుస్థిర పర్యావరణం లేకుండా, సుస్థిరమానవ హక్కులు అసాధ్యం. ఈనిజాన్ని గుర్తించి, పర్యావరణం మానవ హక్కు ల పరిరక్షణ కోసం సమాజం మొత్తంకలిసి ముందుకు రావ లసిన సమయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణం గురించి చదవాలి, ముఖ్యంగా ఉన్నత పాఠశాల, కళాశాలలో ఒక పాఠ్యపుస్తకంగా, ఆచరణాత్మకంగా పెట్టాలి.
-డా. ఎ. భాగ్యరాజ్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: