మెప్మా మహిళలతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి
Women Entrepreneurs : రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఓ మహిళను పారిశ్రామికవేత్తగా (Woman as an entrepreneur) చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో మైపాడు గేట్ సెంటర్ వద్ద షాపులు పెట్టే మెప్మా మహిళలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ నేపధ్యంలో మోడల్గా మైపాడు గేట్ సెంటర్ వద్ద 240 షాపులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
కంటైనర్లు యుద్ద ప్రాతిపదికన సిద్దమవుతున్నట్లు తెలిపారు. తొలి విడతలో 120 షాపులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి అన్నారు. మహిళలకు కార్పొరేషన్ మెప్మాల ద్వారా రెండు లక్షల రూపాయలు సబ్సిడీ అందుతుందని, బ్యాంకు ద్వారా రెండు లక్షలు లోన్ మంజూరు అయిందన్నారు. అయితే వీరికి మంత్రి నారాయణ సొంత నిధులతో ఆర్థిక సహాయం లక్ష రూపాయలు సాయం చేస్తానని తెలిపారు. మహిళల ఆర్ధిక అభివృద్ధి కోసం ఈ షాపులు కేటాయిస్తున్నట్లు సద్వినియోగం చేసుకొని అందరికి ఆదర్శంగా నిలవాలని మంత్రి కోరారు. తమ వ్యాపార అభివృద్ధికి సొంత నిధులు ప్రకటించిన మంత్రికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :