ఎన్‌కౌంటర్‌లో(Encounter) మృతి చెందిన హిడ్మాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరాలుగా వెతుకుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా, మావోయిస్టులు నడిపే స్థానిక స్కూళ్లో చదువుకుని 17 ఏళ్లకే దళంలో చేరాడు. ఏడో తరగతి వరకే చదివినప్పటికీ, ఒక లెక్చరర్ సాయంతో ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్ పనుల్లో అతడికి ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఈ సామర్థ్యాలతో దళంలో అతని ఎదుగుదల వేగంగా కొనసాగింది.
Read Also: AP: ఉపాధి కల్పనే మా ప్రాధ్యానత : నారా లోకేష్
కాలక్రమంలో మావోయిస్టు(Encounter) దాడుల రూపకల్పన, గెరిల్లా ఆపరేషన్ల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తూ హిడ్మా ప్రధాన వ్యూహకర్తగా మారాడు. అతని నేతృత్వంలో జరిగిన అనేక దాడుల్లో భద్రతా బలగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఏళ్ల తరబడి భద్రతాబలగాలను ముప్పుతిప్పలు పెట్టిన హిడ్మా మరణం మావోయిస్టులకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: