Eluru crime: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం రామానుజపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేనమామ ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లిన 11 ఏళ్ల సుశాంత్ అనే బాలుడు విద్యుత్ షాక్‌తో మరణించాడు.
Read Also: Rajasthan: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం
ఘటన వివరాలు
శుభకార్యం జరుగుతుండగా, సుశాంత్ పొరపాటున వంటగదిలోని గ్రైండర్ వైర్‌ను పట్టుకున్నాడు. దీనితో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు
బాలుడిని వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి(Dead) చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జరగాల్సిన శుభకార్యం చిన్న నిర్లక్ష్యం కారణంగా విషాదంగా మారడంతో కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: