chandrababu agriculture plans : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏలూరు జిల్లాలో సుమారు 500 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘కోకో సిటీ’ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. సాగు నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు అన్ని కార్యకలాపాలు ఒకేచోట ఉండేలా ప్రత్యేక హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. మామిడి, జీడిమామిడి, కొబ్బరి తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేయాలని రైతులను ప్రోత్సహించనున్నారు.
Read Also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్
రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం తెలిపారు. ప్రస్తుతం లక్షలాది మంది రైతులు ప్రకృతి సేద్యానికి మారుతున్నారని, 2030 నాటికి సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లంబసింగిలో పీపీపీ విధానంలో కుంకుమపువ్వు సాగు, ఆక్వా రైతుల నమోదు తప్పనిసరి, పౌల్ట్రీ రంగానికి ప్రోత్సాహకాలు వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
ఇక టెక్నాలజీ వినియోగంపై కూడా దృష్టి సారిస్తూ ‘డిజి రైతు బజార్’, ‘కిసాన్ డ్రోన్’ వంటి యాప్‌లను ప్రారంభించారు. వీటి ద్వారా రైతులు ఉత్పత్తులను నేరుగా విక్రయించడం, పరికరాలను అద్దెకు తీసుకోవడం సులభమవుతుందని అధికారులు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: