📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Electricity: ఆంధ్రప్రదేశ్ లో తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన శుభవార్త రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల్లో సంతోషానికి నింపింది. గత ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను (Electricity charges) నిరంతరం పెంచడంతో సాధారణ ప్రజలపై ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా పెరిగింది.

ముఖ్యంగా ట్రూఅప్ (True up) అనే పేరుతో వసూలు చేసిన అదనపు ఖర్చులు గడిచిన ఐదు సంవత్సరాలలో వినియోగదారుల పై మరింత భారంగా నిలిచాయి. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం ఈ అదనపు ఛార్జీలను తగ్గిస్తూ, ప్రజలపై ఉన్న ఆర్థిక భారం కొంతవరకు తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది.

Aghori: వర్షిణి ఘాటు వ్యాఖ్యలు – అఘోరి పై సీరియస్ వార్నింగ్

డిస్కంలు వినియోగదారుల నుంచి రూ. 2,787 కోట్లు వసూలు

ఈ మేరకు ఏపీఈఆర్‌సీ (APERC) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నవంబర్ నెల నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు విద్యుత్ బిల్లుల భారం తగ్గనుంది.  2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిస్కంలు రూ.2,758.76 కోట్లకు ట్రూఅప్‌ కోసం దాఖలు చేయగా ఏపీఈఆర్‌సీ మాత్రం రూ.1,863.64 కోట్లకే ఆమోదం తెలిపింది.

డిస్కంలు వినియోగదారుల నుంచి రూ. 2,787 కోట్లు వసూలు చేశాయి. దీంతో ఆ మొత్తం నుంచి రూ. 1,863.64 కోట్లను మినహాయించి మిగిలిన రూ. 923.55 కోట్లను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది.

Electricity

ట్రూడౌన్‌ ఛార్జీల రూపంలో నవంబర్ నుంచి

దీంతో ఈ మొత్తాన్ని ట్రూడౌన్‌ ఛార్జీల రూపంలో నవంబర్ నుంచి వచ్చే ఏడాది అనగా 2026 అక్టోబర్ వచ్చే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. దీని వల్ల యూనిట్‌కు 13 పైసలు చొప్పున వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.

ట్రూఅప్ అంటే ఛార్జీల పెంపు అయితే.. ట్రూడౌన్ అంటే ఛార్జీల తగ్గింపు. వినియోగదారుల నుంచి ట్రూఅప్ పేరుతో వసూలు చేసిన మొత్తం కన్నా తక్కువ ఖర్చు అయితే.. డిస్కంల దగ్గర నుంచి ఆ మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి వినియోగదారులకు సర్దుబాటు చేయడాన్నే ట్రూడౌన్‌ అంటారు.
Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh News ap electricity department aperc orders Breaking News coalition government initiative consumer relief electricity bill reduction latest news Telugu News truup charges waiver

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.