📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఎన్నికల కోడ్​ ఉల్లంఘన, వైఎస్​ జగన్​పై కేసు

Author Icon By Uday Kumar
Updated: February 20, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్నికల కోడ్​ ఉల్లంఘన, వైఎస్​ జగన్​పై కేసు..!

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.ఎన్నికల కోడ్​ ఉల్లంఘన వైఎస్​ జగన్​పై కేసు.

ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు.

కోడ్​ ఉల్లంఘన :

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా జగన్‌ ఈసీ నుంచి అనుమతి తీసుకోకుండానే బుధవారం గుంటూరు మిర్చియార్డులో పర్యటించారు.

ఎన్నికల కోడ్‌తో పాటు, పోలీసు యాక్ట్‌ ప్రకారం విధించిన నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారు.

దీనిపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

ట్రాఫిక్​కు అంతరాయం :

జగన్‌ నేతలతో కలిసి గుంపుగా యార్డులోకి ప్రవేశించారని యార్డు కార్యదర్శి అనుమతైనా తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్థానిక ప్రజలు, మిర్చిలోడుతో వచ్చిన రైతులకు అసౌకర్యం, ఆటంకం కలిగించినట్లు గుర్తించామని, మిర్చియార్డు ఎదుట రోడ్డుపై పెద్ద సంఖ్యలో వైసీపీ నేతల అనుచరులు చేరడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారని వివరించారు.

అనుమతి లేకుండానే :

ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా అనుచరులతో వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్‌తోపాటు మరో ఏడుగురు నేతలపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు.

ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించి కేసులో చేర్చే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి.

పోలీసుల సవరణ చర్యలు

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. మిర్చి యార్డు వద్ద జరిగిన సమావేశంలో ఎవరెవరున్నారు, అసలైన సంఘటన ఏంటన్న దానిపై విచారణ చేపట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో మరిన్ని వ్యక్తులను కేసులో చేర్చే అవకాశముందని అధికారులు తెలిపారు.

వైసీపీ నేతల స్పందన

వైసీపీ నేతలు ఈ కేసును రాజకీయ ప్రతీకార చర్యగా చిత్రిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వమే తమను టార్గెట్ చేస్తోందని, నియంతృత్వ పోకడలతో కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తున్నారు. గుంటూరులో రైతులను కలవడానికి వెళ్లిన జగన్‌పై ఇలా అకారణంగా కేసు పెట్టడం ప్రజాస్వామ్యానికి మచ్చని పేర్కొన్నారు.

#YSJagan AndhraPradesh Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Police case Telangana Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.