గతకాలం వైభవం చెప్పు కోవటం అప్రస్తుతమేమో కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉన్నత తరగతుల విద్యాభ్యాసం తోపాటు క్రింది తరగతుల విద్యార్థుల చదువులను గురించి సమీ క్షిస్తే చాలా లోపాలు, కొట్టొచ్చి నట్లు కనబడుతాయి. పూర్వకాలం లోని గురుకులాలలోని విద్యాభ్యా సం (education) ఆచరించాల్సిన అవసరం ఈ మధ్యకాలంలో మళ్లీ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవటం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఆనాటి గురుకులాల్లోని విద్యార్థుల సంఖ్య చాలా పరిమితులకు లోబడి ఉండేది. ఈనాడు విద్య (education) తో ఉద్యోగం ముడిపడి ఉండటం చేత ఇబ్బడిముబ్బడిగా సంఖ్య విద్యాలయాల్లో పెరుగుతున్నది. చదువుకున్న విద్యార్థుల నాణ్యత తగ్గుతున్నది. పుస్తకాల బరువు పెరుగుతున్నది. సంపాదించుకున్న విజ్ఞానం అరకొరగా ఉంటున్నది. చివరకు విద్యార్హతలు విద్యగరిపే అధ్యాపకుల విషయాలు, విశ్వవిద్యాలయాల నాణ్యత తగ్గుముఖం పట్టడం, ఎక్కువ మంది విద్యార్థుల ఆత్మహత్యలూ ఇలాంటి విషయాల్లో కూడా కోర్టులు దృష్టి పెట్టి ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితులు రాష్ట్రాల్లో ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల ఆత్మహత్యల విషయం లో సుప్రీంకోర్టు తొమ్మిది ఆదేశాలు రాష్ట్రాలకూ, కేంద్రానికి ఇవ్వటం ఇటీవల విద్యార్థులనూ, విద్యాధికులనూ, విద్యాల యాలనూ ఆలోచింపచేసే విషయంగా మారింది. ఎక్కువగా విద్యాసంస్థలు ప్రభుత్వం నుంచి ప్రైవేట్పరం అవటంతో ఈ ప్రైవేట్ సంస్థలు ఆర్థిక కారణాలతో ‘మాస్’ లెవల్లో వివిధ తరగతుల్లో చేర్చుకొనే దుస్థితి దాపురించింది. ఎక్కువ సంఖ్యలో ఒక క్లాసులో విద్యార్థులుంటే, ఎంతవరకు అందరికీ సమస్థాయిలో విద్యగరపటం ఎంత కష్టమో ఈ విద్యా సంస్థలు పట్టించుకోకపోగా, మెరుగైన విద్యార్థులను గుర్తించి వారినే ప్రోత్సహించటం అందరూ గమనిస్తూనే ఉన్నారు.
Read Also : http://Gold price today : బంగారం ధర షాక్! ఢిల్లీలో 24 క్యారెట్ ₹1.56 లక్షలు దాటింది
సెలెక్టెడ్ విద్యాదానం
సెలెక్టెడ్ విద్యాదానం’ కొన్ని సంస్థలు, పేర్లు అందరికీ తెలుసు. ప్రస్తావించడం అప్రస్తుతం. విద్యార్హతలు కాకుండా ఆర్థికార్హతలు ఈ ప్రోత్సాహాలకు కారణంగా కనపడుతున్నా యి. ఈమధ్యకాలంలో అందుకనే కొన్నిప్రభుత్వాలు, విద్యా సంస్థలను మెరుగ్గా తీర్చిదిద్ది విద్యార్థుల భవిష్యత్తు సమ దృష్టితో బేరీజు వేసి, ప్రోత్సహించాలని, నిర్ణయాలు తీసు కుంటున్నాయి. ఆచరణలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటేనే ఇలాంటి ప్రయత్నాలు విజయాలను సాధించగలవు. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకనిర్దేశాలలో ఈ విషయం ప్రస్తావిం చారు. సుప్రీంకోర్టు, ఉన్నత విద్యలు, ప్రైవేట్పరం కావటం తో క్వాలిటీ తగ్గి క్వాంటిటీ పెరగటాన్ని గమనించింది. ఆర్థిక ప్రయోజనం కోసమే అన్న అంశాన్ని కూడా ఇందుకు కార ణంగా పరోక్షంగా చూపెట్టింది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 142 ప్రస్తావించి, మార్గదర్శక సూత్రాలలో రికార్డులు భద్రపర్చటం, రిపోర్టింగ్ కాకుండా ఆత్మహత్యలు ఉన్నత విద్య చదివే వారిలో ఎందుకు పెరుగుతున్నాయన్న సమీక్ష, (అంటే హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లలో) ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా తగు నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్స్ రిజిస్ట్రార్ల వెకెన్సీలు త్వరగా భర్తీ చేయాలని స్పష్టపరిచింది. అదే విధంగా ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయక తప్పదని కూడా ఈ ఆదేశాలలో చేర్చింది. విద్యార్థుల బాగోగులు ఈ ఆదేశాల అమలుపై ఆధారపడి ఉన్నాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు భారత దేశంలో, ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు 50 శాతం ఉన్నత విద్యాసంస్థలలో (హెచ్.ఇ.ఐ) ముఖ్యంగా విశ్వ విద్యాలయాల్లో ఖాళీలు ఉన్నాయని వేలెత్తి చూపింది. తమిళనాడులోని మద్రాసు యూనివర్సిటీని ఒక ‘కేసు స్టడీ’గా భావించి ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ విశ్వవిద్యాలయానికి ముఖ్యంగా మహిళల విద్య విషయంలో దేశంలోనే ప్రముఖ స్థానం ఉంది. క్వాలిటీ రిసెర్చికి ఈయూని వర్సిటీకి మంచి పేరు ఉంది. 1970 సంవత్సరంలో చదువు చెప్పేవిషయంలో ఈ సంస్థకు పెద్ద పేరు ఉండేది. తర్వాత ఆ పేరు క్రమేపీ తగ్గిపోయి యూనివర్సిటీ ప్రత్యేకతను కోల్పోయింది.
టీచింగ్ స్టాఫ్ సంఖ్య నామమాత్రం
అవసరమున్న టీచింగ్ స్టాఫ్ సంఖ్యలో సగం సంఖ్య మాత్రమే ఉండటం ఇందుకు ఒక కారణంగా చెప్పక తప్పదు. రీసెర్చి భాగం నామమాత్రంగా ఉంది. ఇంతకు ముందు ఫిలాసఫీ,మాథ్స్, బాటనీ సబ్జెక్ట్ లో ఈ యూనివ ర్సిటీకి గర్వపడేంత గొప్ప పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పేరు ఛాయామాత్రంగానే మిగిలింది. ఈ యూనివర్సిటీ ప్రస్తావన ఎందుకంటే మనదేశంలో ఒకప్పటి ఉన్నత విద్య ఎంత ఉన్నతంగా ఉండేదో చెప్పటానికి మాత్రమే గవర్నర్లు ప్రభుత్వాలుకుంపిన వైస్ ఛాన్స్ లర్ల నియామకాలను ఏదో ఒక వంకతో ప్రక్కన పెట్టటంతో వెకెన్సీలు భర్తీ చేయకపోవ టంలో ఇలాంటి పరిస్థితి దాదాపు అన్నిరాష్ట్రాలలోవచ్చింది. ప్రభుత్వాలు తమకు రాజకీయంగా అనుకూలురు అయిన వారి పేర్లను పంపటం కూడా ఒక కారణం కావచ్చు. అవినీతి, పవిత్రంగా ఉంచాల్సిన విద్యాసంస్థలలో పెరగటం మరొక ముఖ్య కారణంగా భావించక తప్పదు. వీటన్నిటిని, విద్యాసంస్థలు సరిచేయడానికి 4 నెలల గడువు సుప్రీంకోర్టు ఒక కేసు సందర్భంగా ఇచ్చింది. కానీ అది జరిగే పనికాదని అందరికీ తెలుసు. విద్యార్థుల ఇష్టాలను బట్టి వారు ఏ కోర్సు తీసుకోవాలో వారికే ఒదిలేయాలి. పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలనే తల్లిదండ్రుల ప్రగాఢమైన కోరికతోపాటు విద్యాసంస్థల ప్రైవేటేజేషన్ వల్ల విద్యకు సముచితస్థానం ఇవ్వలేకపోవడం ఈ దేశంలో దురదృష్టంగా దాపురించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన రైట్ టు లైఫ్ విద్యతోపాటు ఆరోగ్యాన్ని, సామాజికపరంగా, ప్రభుత్వపరంగా పౌరులకు కల్పించినప్పుడే నిజమైన అర్థం ఉన్నట్లు అవుతుంది. ఆ బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలది. న్యాయ స్థానాలు ఈ విషయంలో కల్పించుకుంటున్నాయంటే ప్రభుత్వాలు విఫలమైనట్లే అని అర్థం అవుతున్నది.
-రావులపాటి సీతారాం రావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: