📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

East Godavari District: కుటుంబంలో అనుమానం కలతలు..అతడిని హంతకుడిగా మార్చింది

Author Icon By Anusha
Updated: July 28, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రేమతో, విశ్వాసంతో జీవితాన్ని ప్రారంభించిన ఓ దంపతుల బంధం చివరికి హత్యతో ముగిసింది. రాజానగరం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. భర్తకు భార్యపై పుట్టిన అనుమానం చివరికి ఆమెను దారుణంగా హత్య చేయించేందుకు దారితీసింది.రాజమహేంద్రవరం (Rajahmundry) గ్రామీణ మండలం కొంతమూరుకు చెందిన ఉషారాణి (వయసు 45)కు పదేళ్ల క్రితం నర్సీపట్నం మండలం గిడుగుటూరుకు చెందిన వేమగిరి మాణిక్యం (వయసు 50)తో వివాహం జరిగింది. పెళ్లి తరువాత వీరిద్దరూ కొంతమూరులో స్థిరపడ్డారు. మాణిక్యం స్థానికంగా వెల్డింగ్ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు నిహంత్, ఏడేళ్ల కుమార్తె నిస్సి ఉన్నారు.

భర్త వేధింపులు మితిమీరడంతో ఉషారాణి పోలీసులను

గత కొంతకాలంగా మాణిక్యం తన భార్యపై అనుమానంతో ఉండటం ప్రారంభించాడు. ఆమె ఎవరితోనైనా మాట్లాడినా, బయటకు వెళ్లినా, ఏమన్నా ఫోన్‌లో మాట్లాడినా అనుమానంతో వేధించేవాడు. ఈ నేపథ్యంలో తరచూ దంపతుల మధ్య వాగ్వాదాలు జరిగేవి. భర్త వేధింపులు మితిమీరడంతో ఉషారాణి (Usharani) పోలీసులను ఆశ్రయించింది. ఆమె రాజానగరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త వేధింపులపై ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుతో భయపడ్డ మాణిక్యం కొన్ని రోజులు ఇంట్లో కనిపించకుండా ఉండిపోయాడు. అప్పటినుంచి అతను పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. అయితే శనివారం రాత్రి మాణిక్యం అకస్మాత్తుగా ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్యతో మధ్య వాతావరణం చల్లబడలేదు.

దాడి సమయంలో

మళ్ళీ గొడవ మొదలైంది. మాటలు మాటలు పెరిగాయి. ఆవేశంలో మాణిక్యం సమీపంలోని నాపరాయి (ఒక రకం రాయి) తీసుకుని ఉషారాణి తలపై బలంగా కొట్టాడు, దీంతో భార్య అక్కడికక్కడే పడిపోయింది. దాడి సమయంలో అక్కడే ఉన్న పిల్లలు వెంటనే పక్కవీధిలో ఉంటున్న అమ్మమ్మకు విషయం చెప్పారు. వాళ్లు వచ్చే సరికి ఉషారాణి అపస్మారస్థితిలో పడిపోవడం గమనించారు. వెంటనే ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఆక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ జీవితంపై అనుమానం ప్రభావం ఎలా ఉంటుంది?

ప్రేమ తగ్గుతుంది,అవిశ్వాసం పెరుగుతుంది,తరచూ గొడవలు,పిల్లలపై మానసిక ఒత్తిడి,విడాకుల వరకు కూడా దారి తీస్తుంది,హింస లేదా హత్య వంటి ఘోర పరిణామాలు సంభవించవచ్చు.

మంచి కుటుంబ జీవితానికి మంత్రం ఏమిటి?

ఆత్మీయత, అవగాహన, విశ్వాసం,ఇవే ఒక మంచి, శాంతియుత కుటుంబానికి పునాదులు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Indrakeeladri: కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు..ఎప్పటినుండంటే?

Andhra Pradesh crime news Breaking News Domestic Violence latest news Rajamahendravaram crime Rajanagaram police case suspicious husband kills wife Telugu News wife murder case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.