📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

East Godavari District: లోకాయుక్త జోక్యంతో లైబ్రరీ సెస్ వసూలు

Author Icon By Anusha
Updated: July 12, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తూ.గో జిల్లాలో పెండింగ్లో ఉన్న రూ.366.88 లక్షల చెల్లింపు

కర్నూలు, జూలై 11, ప్రభాతవార్త: స్థానిక సంస్థల నుండి లైబ్రరీలకు రావలసిన సెస్ బకాయిలను లోకాయుక్త తీర్పు మేరకు చెల్లించారు. గత పది సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సెస్ మొత్తం చెల్లించకపోవడంతో గ్రంథాలయాల అభివృద్ధికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. కె.సాంబశివరావు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త (Lokayukta) విచారణ చేపట్టింది. అవిభక్త తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ స్థానిక సంస్థల నుండి రూ.366.88 లక్షల లైబ్రరీ సెస్ బకాయిలను గ్రంథాలయ సంస్థ తిరిగి పొందడంలో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సంస్థ కీలక పాత్ర పోషించింది. 2007,2008,2016,2017 మధ్య అనేక మున్సిపాలిటీలు, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం, కాకినాడ, పిఠాపురం, తుని అన్ని గ్రామ పంచాయితీ (Gram Panchayat) లు సేకరించిన లైబ్రరీసెస్ ను జిల్లా గ్రంధాలయ సంస్థకు చెల్లించటంలో విఫలమయ్యాయని ఫిర్యాదిదారుడు ఫిర్యాదు చేయటం జరిగింది.

East Godavari District: లోకాయుక్త జోక్యంతో లైబ్రరీ సెస్ వసూలు

అనేక నివేదికలను

లోకాయుక్త సంస్థ జారీ చేసిన ఆదేశాలకు ప్రతిస్పందిస్తూ, జిల్లా కలెక్టరు విచారణలు నిర్వహించి బకాయిలు ఉన్నమాట వాస్తవమని అంగీకరిస్తూ అనేక నివేదికలను సమర్పించారు. లోకాయుక్త నిరంతర జోక్యం మరియు పర్యవేక్షణ కారణంగా, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం, కాకినాడ, పిఠాపురం, తుని మున్సిపాలిటీలు, పంచాయితీలతో సహా అన్ని స్థానిక సంస్థలు తన బకాయిల మొత్తం రూ.366.88 లక్షలు చెల్లించాయి. సంస్థగతంగా ఏర్పడిన అవకతవకలు నివారించడం, స్థానిక సంస్థల మధ్య జవాబుదారీతనాన్ని పెంపొందిచడంలో, లైబ్రరీ సెస్ (Library Cess) వంటి చట్టబద్దమైన బాధ్యతలను నెరవేర్చటంలో లోకాయుక్త సంస్థ తన పాత్రను సమర్ధవంతగా సోషిస్తుంది. ప్రజాసేవలు అందించటంలో పారదర్శకత,సమస్యలు పరిష్కరించడానికి ఈ సంస్థ తన నిబద్ధతను పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది.

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఛైర్మన్ ఎవరు?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఛైర్మన్‌గా జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి (Justice P. Lakshmana Reddy) వ్యవహరిస్తున్నారు.

భారత దేశ లోకపాల్ ఛైర్మన్ ఎవరు?

ప్రస్తుత భారత దేశ లోకపాల్ ఛైర్మన్‌గా న్యాయమూర్తి అజయ్ మాణికరావ్ ఖాన్విల్కర్ (Justice Ajay Manikrao Khanwilkar) పదవిలో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bandi Sanjay: హిందూమతంపై భక్తి, చిత్తశుద్ధి ఉన్న వారికే ఉద్యోగాలు కల్పించాలి

Andhra Pradesh Lokayukta Breaking News cess recovery East Godavari library funds library cess dues library development Sambasiva Rao complaint Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.