ఇ-వ్యర్థాలతో అనర్థాలు ఉన్నట్లు ఈ మధ్య కాలంలో కొంత సమాచారాన్నిచ్చి ప్రభుత్వమే హెచ్చరిస్తోంది. కాగా ఇవేవ్యర్థాలు వేలం వేస్తే ప్రభుత్వానికి బోలెడంత రాబడి వచ్చింది. దీంతో సృష్టిలో వ్యర్ధమైనవేనీ ఉండవని తేలిపోయింది. పనికి రానివని బయట వదిలేసిన ఈ వ్యర్థాలు (E-waste)వల్ల అనర్థాలతో పాటు, వాటిని అమ్మేస్తేకొనుక్కునే వాళ్ళుకూడా ఉంటారని తేటతెల్లమవుతోంది. ఈ వేలంలో వ్యర్థాల విక్రయంతో కేంద్రనికి రూ.2200కోట్ల రాబడులు వచ్చాయి. ప్రభుత్వ విభాగాల్లో తొలగించిన ఈవేస్ట్,(E-waste) ఇతర వ్యర్థాలను తొల గించడం లేదా వేలం ద్వారా మొత్తం రూ.2200 కోట్ల రూపాయలు రాబట్టగలిగింది. గత ఏడాది కూడా మంచిఆదాయమే వచ్చింది. 2021 డిసెంబరు నుంచి ఈ ఏడాది నవంబరు నెలాఖరు వరకూ నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రి యలో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో వ్యర్ధాలన్నింటినీ ఈ వేలం వేయడంతో రూ.220 కోట్లు సమకూరింది. ప్రభుత్వ ఈ మార్కెట్స్ (జిఇఎం) ఈ ప్రక్రియ నిర్వహించగా, మొత్తం 13 వేలకు పైగా వేలాలు నిర్వహిస్తే సుమారు 23 వేలమంది కన్నా ఎక్కువ సంఖ్యలో రిజిస్టరు బిడ్డర్లు పాల్గొన్నారు. అలాగే 17 వేల మంది వేలం పాటదారులు కూడా ఈ నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వ స్క్రాప్ను కొనుగోలు చేసారని అంచనా. లక్నోలో ఆలిగంజ్లో 100కు పైగా ఈడ్చ్యుఎస్ ప్లాట్లను ఎస్బిఐ వేలం వేస్తే సుమారు రూ.3453 కోట్లు రాబడులు వచ్చాయి. అలాగే నేషనల్ జూలాజికల్ పార్క్ లో కూడా అత్యధిక బిడ్ వచ్చింది. జిప్సమ్ వేలంలో 3.35 కోట్లు ఆరావళి జిప్సమ్ మినరల్స్ ఇండియా కంపెనీ 216 కాలం చెల్లిన వాహనాలు జమ్ము డివిజ న్లోను, బోర్డర్ రోడ్స్ సంస్థలో సాల్వేజ్ ఉత్పత్తులు, గుల్మర్ డార్మిటరీని ఐదేళ్లకాలానికి లీజు వంటివి ఈ వేలంలోనే జరిగాయి. ఇలా ప్రభుత్వ శాఖల్లో వృధాఅయిన వ్యర్థాలు, గవర్నమెంట్ ఈ మార్కెట్స్ వేలం ద్వారా విక్రయిస్తోంది. మొత్తం ఈ వ్యవస్థను ఇకపై జిఇఎం పర్యవేక్షించడంవల్ల పారదర్శకతతో పాటు రికవరీ రాబడులు కూడా అత్యధి కంగానే ఉంటున్నాయి. భారతదేశంలో విసర్జన వ్యర్థాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం స్పష్టంగా ఒకే సంఖ్యలో ఇవ్వడం కష్టం, ఎందుకంటే ఇది పలు వివిధ కారకాలు, విధానాలు, వ్యర్థాల నిర్వహణ విధా నాలపై ఆధారపడి ఉంటుంది.అయితే, ఆ ఆదాయం భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి, ప్రభుత్వం ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీవిధానం ప్రారంభించింది. ఈవిధానం ప్రకారం, ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవారు వాటి సేకరణ, పునర్వినియోగానికి బాధ్యులవు తారు. ఈ విధానం ద్వారా, ఉత్పత్తి చేసే వారికి చెల్లిం చాల్సిన ఫీజులు, క్రీడా పథకాలు, పునర్వినియోగ కేంద్రాల స్థాపన వల ప్రభుత్వానికి ఆదాయం అందిస్తాయి. భారతదేశంలో వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే పథ కాలు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ ప్రాజెక్టుల ద్వారా ఆదాయం పొందుతాయి. వాటి ద్వారా పన్నులు కూడా ప్రభుత్వానికి వస్తాయి. శహరీ – వ్యర్థాల నిర్వహణ నగరాల్లోని వ్యర్థాల నిర్వహణ కు సంబంధించి, మునిసిపల్ సంస్థలు వసూలు చేసే ఫీజులు కేంద్ర ప్రభుత్వానికి వేర్వేరు పన్నులు, ఫైనాన్స్ అండ్ ఈ గ్రాంట్స్ రూపంలో ఆదాయం అందిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా భాగస్వామ్యం ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ కోసం, ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఉన్న పన్నులు, నూతన పథకాల ద్వారా వచ్చిన ఆదాయం ఇలాంటి మార్గాలలో కేంద్ర ప్రభుత్వం ఆదాయం పొందు తుంది. దేశంలో విసర్జన వ్యర్థాల నుంచి ప్రత్యక్షంగా ఎలాంటి ఒక అంచనా ఇవ్వడం కష్టం. అయితే, ప్రభు త్వానికి వచ్చే ఆదాయం ప్రధానంగా పన్నులు, ఫీజులు, పెట్టుబడులు, శక్తి ఉత్పత్తి ప్రాజెక్టుల ద్వారా వస్తుంది. విస ర్జన వ్యర్థాల నిర్వహణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రత్య క్షంగా ఆదాయం పొందుతుంది. అవి స్థానిక ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగసంస్థలు, పునర్వినియోగ ప్రక్రియలు, వ్యర్థాల నిర్వహణ విధానాలపై ఆధారపడి ఉంటాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే కంపెనీలు వాటి సేకరణ, రీసైక్లింగ్ బాధ్యత ను తీసుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం పలు ఫీజులు, పన్నులు వసూలు చేస్తుంది. ప్రస్తుతం, దేశంలో 2.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరిస్తే, ఈ వ్యర్థాల నిర్వహణకు అవసరమైన వనరుల కోసం 10వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చిందని అంచనా. దేశంలో ప్రతి యేటా 50మిలియన్ టన్నుల మునిసిపల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వ్యర్థాల నిర్వహణ పథకాలు ద్వారా 8వేల కోట్లు పైగా ఆదాయం దేశవ్యాప్తంగా ప్రణా ళిక, నిర్వహణ ద్వారా సమీకరించబడు తుంది. నగరాల నుండి సేకరించే వ్యర్థాల నిర్వహణసేవలు, రీసైక్లింగ్, పునర్వినియోగం ద్వారా మునిసిపాలిటీలు స్థానిక ప్రభు త్వాలు ఆదాయం సేకరిస్తాయి. నగరాల నుండి శహరీ వ్యర్థాల నిర్వహణ కోసం సేకరిం చబడే ఫీజులు కూడా కేంద్రానికి వస్తాయి. ప్రతి నగరంలో పర్యావరణ పరి రక్షణ కోసం నగర సంస్థలు, మునిసిపాలిటీలు వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ కోసం ఫీజులు వసూలు చేస్తాయి. ప్రభుత్వం ప్లాస్టిక్ ఉత్పత్తులపై పన్నులను విధించింది. ప్లాస్టిక్ వాడకం తగ్గించ డానికి తీసుకున్న చర్యలు ద్వారా పన్నులు, ఫీజులు, గ్లోబల్ గ్రీన్ బాండ్లు, తదితర మార్గాలలో ఆదాయం సేకరించబడుతుంది. ఈ పన్ను లు, ఫీజులు వెయ్యి కోట్ల రూపాయల వరకు వసూలు అవుతాయి. 20వేల కోట్ల రూపాయల వరకు సేకరించబడుతున్న ఆదాయం దేశాభివృద్ధికే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: