ఇంద్రకీలాద్రి: తెలంగాణలో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా శ్రీ భాగ్యనగర్ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల్లో కొలువైన అమ్మవార్లకు బెజవాడ దుర్గమ్మ (Bezawada Durgamma) వారి ఆషాడం సారె (Durgamma Saare) ను శుక్రవాం అందించారు.
ఉప్పుగూడలోని శ్రీ మహంకాళీ దేవాలయం, లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళీ దేవాలయం, గౌలిపురాలోని శ్రీ మహంకాళీ దేవాలయం, సుల్తాన్ షాహీలోని జగదాంబ దేవాలయం, హరిబౌలి లోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, మీర్ఆల్మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయం అమ్మవార్లకు బెజవాడలోని శ్రీ దుర్గామల్వేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇఓ వికె శీనా నాయక్ (EO VK Sheena Naik) ఆధ్వర్యంలో ఆషాడం సారెను (Durgamma Saare) తీసుకెళ్ళగా అక్కడ మేళతాళాలు మంగళవాయిద్యాలు, వేదమంత్ర పఠనాలతో స్వాగతం పలికి ఆషాడం సారెను శ్రీ అమ్మవార్ల ముందుంచి పూజాదికాలు నిర్వర్తించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇఓ వికె శీనా నాయక్, ఆలయ ప్రధానార్చకులు ఎల్ దుర్గాప్రసాద్, ఆర్ శ్రీనివాస శాస్త్రి, వేదపండితులు, ఎఇఓ డా కొచ్చెర్ల గంగాధర్, సూపరింటెండెంట్ చందు శ్రీనివాస్, ఈఓ సిసి జయప్రకాష్, కార్యాలయ సిబ్బంది పునీత కుమార్ కె లీలా కృష్ణ బృందంకు మెమొంటో, శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: TG Horticulture Department: ఉద్యాన శాఖలో 175 మంది విస్తరణాధికారుల నియామకం