ఇంద్రకీలాద్రి : దుర్గమ్మవారి ఆలయంలో జరగబోయే(Vijayawada) భవానీ దీక్షల విరమణలు విజయవంతం చేయాలని దీని కోసం సమన్వయంతో పనిచేయాలని ఆలయ ఇఓ వికె శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధా కృష్ణలు అధికారులకు, సిబ్బందికి సూచించారు. సోమవారం ఆలయంలోని మహామండపంలో నిర్వహించిన సమావేశంలో అధికారులు, సిబ్బందినుద్దేశించి వారు మాట్లాడుతూ డిసెంబర్ 4న నిర్వహించే కలశజ్యోతి ఉత్సవాలను కూడా కట్టుదిట్టంగా భద్రత, తదితర ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలన్నారు. క్యూలైన్లు, మంచినీరు, మెడికల్ క్యాంప్స్, కేశఖండన, పుణ్య స్నానాలకు తదితర ఏర్పాట్లు సరిగా చేయాల న్నారు. గిరి ప్రదక్షణకు సకల సౌకర్యాలు పూర్తి చేసి సేవలందించాలన్నారు. మంగళవారం జరగ బోయే కలెక్టర్ సమావేశంలో మరిన్ని నిర్ణయా లపై చర్చించి పనిచేయాలన్నారు.
Read also: వైకుంఠ ద్వార దర్శనంలో స్థానికులకు అవకాశమిస్తారా?
వేదోక్తంగా కార్తీకమాస పూజలు
దుర్గమ్మవారి(Vijayawada) ఆలయంలో సోమవారం కార్తీకమాస(Kartik month) పూజలు వేదోక్తంగా నిర్వహించారు. బిల్వార్చన వేదోక్తంగా చేశారు. ఇఓ, చైర్మన్లు కార్యక్రమంలో పాల్గొనగా వేదపండితులు అర్చనలు చేశారు. చతుర్వేద స్వస్తి, పంచ హారతులు, మహానివేదనలు గావించారు. సహస్ర దీపకాంతులతో శ్రీ స్వామి అమ్మవార్లు భక్తులను ఊంజల్ సేవలందుకుని అను గ్రహించారు. పవిత్ర కార్తీకమాసం సందర్భంగా సహస్ర లింగార్చన సేవలో పాల్గొనాలని భక్తులకు ఇఓ వికె శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణలు తెలిపారు. అర్చకస్వాములు వేద మంత్ర పఠనాలతో శ్రీ స్వామివారికి సేవలు నిర్వహించి ధూప, దీప నైవేద్యాలు సమర్పిం చారు. సాయంసంధ్యాకాలంలో శ్రీ స్వామి అమ్మవార్లు ఊంజల్పై భక్తుల సేవలందుకుని అనుగ్రహించారు. ఈ సందర్భంగా చతుర్వేద పఠనాలు పండితులు చేశారు. కార్తీకమాసం సోమవారం సందర్భంగా శ్రీమల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 2,500 మందికి అన్నప్రసాద వితరణ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: