📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Drugs: సూత్రధారులే మూలం

Author Icon By Sudha
Updated: January 10, 2026 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చట్టాలకు సామాన్యులు లోకువ. సమర్థులకు చట్టాలు లోకువ అంటారు. ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ మారిన కాల మాన పరిస్థితుల్లో ఇది అక్షరాల నిజం అనిపిస్తున్నది. ఆర్థిక, అంగ, అధికార రాజకీయ బలం ఉన్నవారు తప్పుచేస్తే చర్యల సంగతి అటుంచి వేలెత్తి చూపడానికి కూడా జంకే దురదృష్టపు పరిస్థితులు దాపురించాయి. మిగిలిన నేరాల విషయంలో -ఎలా ఉన్నా మానవ జాతిని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల నియంత్రణలో అటు పాల కులు కానీ, ఇటు అధికారయంత్రాంగం కానీ సమర్థవం తంగా వ్యవహరించలేకపోతున్నారే మోననిపిస్తున్నది. దేశ వ్యాప్తంగా ఎంతో పోలీసు సిబ్బందిఉంది. నిఘా వ్యవస్థ లున్నాయి. ఏకంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉంది. ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ తదితర విభాగాలు ఉన్నాయి. నిత్యం నిఘా పెడుతున్నారు. అప్పుడప్పుడు తనిఖీల్లో పట్టుబడుతూనే ఉన్నాయి. కేసులు పెడుతున్నారు. జైళ్లకు పంపుతున్నారు. అయినా ఇవి ఆగడం లేదు. నిరాటంకంగా మాదకద్రవ్యాలు (Drugs) సరఫరా అవుతున్నాయి. ఇటీవల కాలంలో చెన్నై, ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, హైదరా బాద్ లాంటి నగరాల్లోని విమానాశ్రయాల్లో మాదక ద్రవ్యాలు వేలాది కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. గతం లో కేరళ సమీపంలో అరేబియా సముద్రంలో నౌకాదళం స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల (Drugs) విలువ అంతర్జాతీ య మార్కెట్లో దాదాపు ఐదారువేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికార వర్గాలే అంచనా వేశాయి. ఇవన్నీ ఏదో ఒక వ్యూహం ప్రకారం పట్టుకున్నవి కావు. అధికారులు చేస్తున్న తనిఖీల్లో పట్టుబడినవే. ఇక విమా నాల్లో రకూస్యంగా తీసుకువస్తున్న మత్తుపదార్థాలు తక్కు వేమీ కాదు. రకరకాల మార్గాల్లో వీటిని తరలిస్తున్నారు. మొన్న ఆ మధ్య ఇద్దరు మహిళలు రహస్యంగా సూట్ కేసుల్లో వైర్ బండిళ్ల మాటున మత్తుపదార్థాలను తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆహార సరఫరా ముసుగులో మత్తుపదార్థాలు పంపిణీ చేస్తున్న బాగోతం ఉత్తరభారతంలో తరచుగా బయటపడుతున్నది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో మత్తుపదార్థాల వినియోగం అంతకంతకు పెరిగి పోతున్నట్లు అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. ముం బాయి నగరం కొకైన్కేంద్రంగా మారినట్లుకు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థే అంగీకరించక తప్పడంలేదు. ఇక గంజాయి సాగు దేశంలో అనేక రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాగు చేస్తున్నారు. అప్పుప్పుడు ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నా మళ్లీ రెండు, మూడు నెలల్లో యధా విధిగా సాగులోకి వస్తున్నాయి. అడవుల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇది సాగు చేసే స్మగ్లర్లు పట్టుబడగానే సూత్ర ధారులు అదృశ్యమైపోతున్నారు. కేవలం ఆ ప్రాంతంలో అమాయక రైతులు, రైతు కూలీలు ఇరుక్కుపోతున్నారు. అంతేకాదు అత్యంత విలువైన మాదకద్రవ్యాల రవాణాలో పట్టుబడుతున్నది పాత్రధారులే. వారి వెనుకఉండే సూత్ర ధారులను పట్టుకోలేకపోతున్నారు. స్పష్టంగా తెలిసినా కూడా సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల వారి జోలికి వెళ్లలేకపోతున్నారు. వెళ్లినా న్యాయస్థానాల ముందురుజువు చేయకపోవడంతో చర్యలు చేపట్టలేకపో తున్నారు. మాదక ద్రవ్యాలు అఫ్ఘానిస్థాన్ నుండి ఆఫ్రికా మీదుగా భారత్కు చేరుకొని వివిధ మార్గాలద్వారా దేశంలోని అన్ని ప్రాంతా లకు సరఫరా అవుతున్నాయి. మరొకపక్క మయన్మార్లో జరిగిన సైనిక తిరుగుబాటు నుంచి మణిపూర్, మిజోరం వరకు భారీగా మాదకద్రవ్యాలు ప్రవేశిస్తున్నాయి. కొన్ని మాదకద్రవ్యాల ముఠాలు ఈశాన్యభారతంలోని కొన్ని తీవ్రవాద బృందాలకు నిధులు అందిస్తున్నాయి. ఇది దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఆ మధ్య మయన్మార్ వలసదారుల నుంచి పద్దెనిమిది ఆయుధాలు డెబ్భైనాలుగు కోట్ల రూపాయల విలువైన అక్రమ రవాణా వస్తువులు, దాదాపు రెండువందల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టు బడ్డాయి. సరఫరా ముఠాల కదలికలపై నిఘావేసినియంత్రించాల్సిన నార్కోటిక్ కంట్రోల్బ్యూరో ఎక్సైజ్ ఎన్ఫోర్సెమెంట్ విభాగం, పోలీసులు తదితర శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఈ మత్తు పదార్థాల విస్తరణకు కారణం అవుతున్నది. తెలుగురాష్ట్రా లతో పాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం అంతకంతకు పెరిగి సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తుపదార్థాల వాడకం, వినియోగం ఆందోళన కలిగిస్తున్నది. ఈ మహమ్మారి దేశ వ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చాపకింద నీరులా ఈ స్మగ్లర్లు తనసామ్రాజ్యాన్ని పెంచు కుంటూపోతున్నారు. యేటా కొకైన్, బ్రౌన్ షుగర్ లాంటి మాదకద్రవ్యాలు వేలాది టన్నులకుపైగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు అనధికార అంచనాలనుబట్టి తెలు స్తున్నది. లక్షలాది కోట్లరూపాయల వ్యాపారం జరుగుతు న్నది. ఈ జాఢ్యం విస్తరించడం అత్యంత ప్రమాదకరం. మాదకద్రవ్యాలను నిరోధించే విషయంలో మాటలకే పరి మితం కాకుండా ఆచరణలో చూపించాల్సిన తరుణమిది.ముఖ్యంగా మాదకద్రవ్యాల సరఫరాలో పట్టుబడుతున్న పాత్రధారులను కాకుండా సూత్రధారులను బయటకుతీసి న్యాయ స్థానాల ముందు తిరుగులేని సాక్ష్యాలతో రుజువు చేసి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. వినియోగం ఉత్పత్తి, నిల్వ, వ్యాపారానికి పాల్పడడం అత్యంత తీవ్రమైన నేరా లుగా కొన్నిదేశాలు పరిగణిస్తున్నాయి. ఆయాదేశాలు మరణ శిక్షలు కూడా విధిస్తున్నాయి. పాలకులు అలాంటి శిక్షలవైపు దృష్టిసారించాలి. పాత్రధారులతోపాటు సూత్రధారులను పట్టుకుంటే తప్ప ఇది ఆగే పరిస్థితి కన్పించడం లేదు. ఏమాత్రం జాప్యం చేసినా యువతపై తీవ్ర ప్రభావం చూపి అరాచకం ప్రబలే ప్రమాదం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Crime Investigation Drug Mafia Drug Racket Drugs latest news masterminds Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.