📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

GGH Vijayawada Doctor Death: డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

Author Icon By Siva Prasad
Updated: March 9, 2026 • 11:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

GGH Vijayawada Doctor Death: విజయవాడ జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్న యువ వైద్యురాలు డాక్టర్ దీపిక(Deepika) ఆత్మహత్య(Suicide) కేసులో మిస్టరీ వీడింది. దీపికను ప్రేమించి, ఆ తర్వాత ఆమెను నట్టేట ముంచి మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైన డాక్టర్ అమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషాదకర ఘటన ఇప్పుడు వైద్య వర్గాల్లో సంచలనంగా మారింది.

Read Also: డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

ప్రేమ పేరుతో మోసం

పోలీసుల కథనం ప్రకారం.. దీపిక, అమర్ ఇద్దరూ అనంతపురం మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే, అనంతర కాలంలో దీపిక విజయవాడ జీజీహెచ్‌లో డాక్టర్‌గా విధుల్లో చేరగా, అమర్ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి దీపిక తీవ్ర మనస్తాపానికి గురైంది.

GGH Vijayawada Doctor Death: ఘోర నిర్ణయం

గత నెల 5వ తేదీన డాక్టర్ దీపిక తనకు తానుగా ప్రమాదకరమైన ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కదా . అయితే ఆత్మహత్యకు ముందు ఆమె అమర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీపిక కుటుంబ సభ్యులు కూడా అమర్ వేధింపుల వల్లే ఆమె ప్రాణాలు తీసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Mystery left in Dr. Deepika’s suicide case

పోలీసుల విచారణ

దీపిక ఫోన్ కాల్ డేటా మరియు కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన విజయవాడ పోలీసులు, అమర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో మోసం చేయడం మరియు ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anantapur Medical College Love Case AP crime news Dr Amar Arrested Dr Deepika Case Updates GGH Vijayawada Doctor Death Love Failure Suicide Vijayawada Doctor Suicide

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.