📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Double Engine: డబులింజిన్ సర్కార్తోనే ఎపి అభివృద్ధి

Author Icon By Ramya
Updated: July 2, 2025 • 10:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ

Double Engine: డబుల్ ఇంజన్ సర్కార్ తోనే ఎపి అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యాఖ్యా నించారు. కూటమి నేతలతో సమన్వయం చేస్తూనే.. ఏపీ బిజెపిని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మనం ఐదు శాతం సీట్లు తీసుకో వడం కాదని.. మనమే మరో పార్టీకి సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. మంగళవారం విజయవాడ బిజెపి కార్యాలయంలో శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడారు. ఎపి బిజెపి రథసారథిగా ఎంపికైన పివిఎన్ మాధవ్కు శ్రీనివాస వర్మ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నేతలతో సమన్వయం చేస్తూనే.. ఏపీ బిజెపిని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మనం ఐదు శాతం సీట్లు తీసుకోవడం కాదని.. మనమే మరో పార్టీకి సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. ఏపీ బీజేపీ రథసారథిగా ఎంపికైన పీవీఎన్ మాధవ్కు శ్రీనివాస వర్మ శుభాకాంక్షలు తెలిపారు. పురంధేశ్వరి ఎపి బిజెపీ అధ్యక్షురాలిగా పార్టీ కోసం ఎంతో పని చేశారని శ్రీనివాస వర్మ కొనియాడారు. తాను ఎంపీగా, కేంద్రమంత్రిగా పురంధేశ్వరి సహకారంతో ఎదిగానని ఉద్ఘాటించారు. పివి ఎన్ మాధవ్ కూడా నిత్యం పార్టీ కోసం పని చేస్తారని అన్నారు. మాధవ్ తండ్రి చలపతిరావు కూడా పార్టీ కోసం పరితపించే వారని గుర్తుచేసుకున్నారు. ఇప్పటి నాయకులకు చలపతిరావు సేవల గురించి తెలియదని చెప్పారు. 1980 నుంచి 1986 వరకు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తి చలపతిరావే అనిగుర్తుచేసుకున్నారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన మాధవ్ కూడా సొంతంగా ఎదిగారని కొనియాడారు.

మాధవ్ నేతృత్వంలో బీజేపీ బలోపేతం అవుతుందన్న నమ్మకం

Double Engine: మాధవ్ ఏపీ బీజేపీని బలోపేతం చేస్తారనే నమ్మకం తమకు ఉందని ఉద్ఘాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే గమ్యంగా కార్యకర్తలు పనిచేసేలా పీవీఎన్ మాధవ్ చూడాలని కోరారు. కింది స్థాయి కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేలా మాధవ్ పని చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సూచించారు. ఎపి బిజెపి అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చిన్న వయసు నుంచే రాజకీయాల్లో ఉన్నారని ఎమ్మెల్సీ, బిజెపి సీనియర్ నేత సోము వీర్రాజు పేర్కొ న్నారు. పివిఎన్ మాధవ్కు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కేంద్ర పెద్దలకు సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. పీవీఎన్ మాధవ్ ఎపి బిజెపి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. మాధవ్ తండ్రి చలపతిరావు ఉమ్మడి ఏపీలో బిజెపి అధ్యక్షుడిగా పని చేశారని గుర్తుచేశారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన మాధవ్ బిజెపి కోసం పనిచేశారని తెలిపారు. ఇప్పుడు మాధవ్ కూడా ఏపీ బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని చెప్పుకొచ్చారు. నాడు తండ్రి, నేడు తనయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం గొప్ప విషయమని ఉద్ఘాటించారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవని సోము వీర్రాజు స్పష్టం చేశారు. మాధవ్ వ్యక్తిగతంగా నిజమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారని అన్నారు. ఆయన ఆలోచనల్లో ఒక బాణి, ఒక వాణి ఉంటుందని ప్రశంసించారు. తాను మాధవ్ను ఎప్పటి నుంచో గమనిస్తున్నానని అన్నారు. ఆయన పని తీరును ఇప్పుడు అందరూ చూస్తారని తెలిపారు. మాధవ్ నేతృత్వంలో ఎపిలో బిజెపి తప్పకుండా బలోపేతం అవుతుందని చెప్పుకొచ్చారు. బిజెపి అధ్యక్షుడిగా పూర్తి స్థాయి సామర్థం ఉన్న నేత మాధవ్ అని కొనియాడారు. దేశం దశ, దిశ మార్చేలా దీక్షతో పని చేసే పార్టీ బీజేపీ అని అభివర్ణించారు. ఎపిలో బిజెపి తప్పకుండా అధికారంలోకి వచ్చి తీరుతుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.

Read also: Tirumala: వడ్డీకాసులవాని దర్శనానికి గణనీయంగా పెరిగిన భక్తులు

#AndhraPolitics #AndhraPradesh #APBJP #BJPAlliance #BJPGrowth #BJPLeadership #BJPPresident #BJPStrength #BJPVision #ChalapathiRao #DoubleEngineSarkar #IndianPolitics #LocalElections #PoliticalLegacy #Purandeswari #PVNMadhav #SomuVeerraju #SrinivasaVarma #YoungLeader Andhra politics AP BJP BJP alliance BJP Andhra Pradesh BJP cadre BJP development BJP leadership BJP President AP central minister Chalapathi Rao double engine government local body elections party strengthening political coordination political legacy political vision Purandeswari PVN Madhav Somu Veerraju Srinivasa Varma young leadership

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.