📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vaartha live news : CM Chandrababu : ఎక్కడా రాజీ పడొద్దు.. కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం

Author Icon By Divya Vani M
Updated: September 15, 2025 • 10:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాష్ట్ర కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.ఏపీ అభివృద్ధిలో లాజిస్టిక్స్ రంగం కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటవుతోందని చెప్పారు. అలాగే ఎయిర్‌పోర్టులను హబ్ అండ్ స్పోక్ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని విమర్శించారు. ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్లను (Collectors) ఆదేశించారు. లాజిస్టిక్స్ విషయంలో రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు.

రహదారుల అభివృద్ధి

రహదారుల నిర్మాణంలో నాణ్యత కీలకం అని చంద్రబాబు స్పష్టం చేశారు. డిసెంబర్ నాటికి గుంతలేని రహదారులు రాష్ట్రంలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 5,946 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు రూ.500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. తీవ్రంగా దెబ్బతిన్న 4,229 కిలోమీటర్ల రహదారుల మరమ్మతులకు రూ.2 వేల కోట్లు అవసరమని చెప్పారు. పీపీపీ మోడ్‌లో 12,653 కిలోమీటర్ల రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. వానాకాలంలో రోడ్ల సంరక్షణకు ఎకోఫిక్స్ పద్ధతిని అనుసరించాలని సూచించారు.నీటి నిల్వలు రాష్ట్ర భవిష్యత్తుకు బలమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాన, ఉప ఇరిగేషన్ ప్రాజెక్టులు వందశాతం నీటితో నిండాలని కలెక్టర్లను ఆదేశించారు. జూన్‌లోనే నారుమళ్లకు నీళ్లు విడుదల చేస్తామని తెలిపారు. రబీ సీజన్‌లోనూ నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. చెక్ డ్యామ్‌లు తనిఖీ చేసి పునరుద్ధరించాలని, వర్షపు నీటి రీఛార్జ్ చర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. మైక్రో ఇరిగేషన్ ప్రాముఖ్యతను కలెక్టర్లకు వివరించారు.

పరిశుభ్రతపై దృష్టి

ప్రజలకు శుభ్రమైన వాతావరణం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛత విషయంలో రాజీ పడబోమని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సహా అనేక మంది అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లు సమగ్ర ప్రణాళికలు రూపొందించి పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also :

https://vaartha.com/cm-revanths-special-focus-on-the-development-of-medaram-temple/telangana/547944/

Andhra Pradesh Development Review Andhra Pradesh Roads and Irrigation Projects AP Infrastructure Development News AP Logistics Development Updates Chandrababu Directions to Collectors Chandrababu Naidu Latest News CM Chandrababu Collectors Meeting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.