అనుకోని వృత్తాంతాలు అకస్మా త్తుగా బయటకు రావటం ఎప్పు డో గాని జరగదు. మానవ సంకల్పం వలనా, దైవ సంకల్పం వలనా, చెప్పటం కష్టం! కానీ కనపడని శక్తు లు మానవ జాతిలోని బలాలనూ, బలహీనతలూ, బయటపెట్ట తలపెట్టినప్పుడు ఎవరూ ఏదీ ఆపలేరు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న రెండవసారి అమెరికా దేశం అధ్యక్షుడిగా ఎన్నికయి తర్వాత క్లిష్ట సమస్య ఒకటి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు ఎన్నో నెలలు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రాజకీయ రహస్యాన్ని యు.యస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బయటపెట్టే బిల్లు మీద సంతకం పెట్టక తప్పలేదు. కాంగ్రె సు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డి.ఓ.జి)ను జెఫ్రీ ఎపిస్టైన్ (పేరు మోసిన ఫైనాన్షియల్ సెక్స్ అఫెండర్గా చేసిన నేరాల గురించి జరిపిన దర్యాప్తును బయటపెట్టమని ఆ బిల్లు ద్వారా ఆదేశించడంతో, ఆ బిల్లు పాస్చే యడానికి ట్రంప్కు మరో దారి లేక సంతకం పెట్టాల్సి వచ్చింది. డెమాక్రట్స్, రిపబ్లికన్ పార్టీలోని వారు ఆయన మీద బాగా ఒత్తిడి తేవడం వల్ల ఎపిస్టైన్ సమాచారం రహస్యాల ఉదం తం బయటపెట్టే బిల్లును అందరూ ఒక్కరు తప్ప దాదాపు ఏక గ్రీవంగా ఆమోదించారు. అలాంటి స్థితిలో ప్రెసిడెంట్ ఆ బిల్లు మీద ఆమోదముద్ర వేయక తప్పింది కాదు. క్షుణ్ణంగా తయారు చేసిన అన్ని డాక్యుమెంట్లు ఎపిస్టైన్ ను గురించి బయట పెట్టడానికి సిద్దపడక తప్పలేదు. మైనర్ బాలిక రేప్తో సహా ఒక వ్యక్తి కోర్టు విచారణను ఎదుర్కో లేక ఆత్మహత్య చేసుకున్న ఉదంతంతోసహా అన్నీ డి.ఓ.డి ముప్పైయి రోజులలోపు బయట పెట్టాలన్న ఆదేశంతోపాటు వ్యక్తుల వివరాలు, అదేవిధంగా ఇబ్బంది కలిగించే విషయా లకు మినహాయింపు ఇవ్వడం కూడా జరిగింది. ఈ బిల్లు ఆమోదం వెనుక ఇంత ఆర్భాటం ఉండటానికి కారణం ఎపిస్టైన్ట్రంప్కు స్నేహితుడవటం వల్లనే. ట్రంప్ ఎపిస్టైన్ నేర పూరిత వ్యవహారాలతో తనకు సంబంధం లేదని, తెలియదని, ఖండితంగా చెప్పినప్పటికిని ఒత్తిడి తగ్గలేదు. ఎన్నో రోజుల క్రిందటే తను సంబంధాలు తెగతెంపులు చేసుకున్నానని ట్రంప్ చెప్పినా ప్రజలూ, లెజిస్లేటర్లూ నమ్మలేదు. నేర పూరిత సంబంధం విషయం ఆ ఎంక్వరీలో తేలకపోయినా, 20వేల పేజీల ఆ డాక్యుమెంట్లో ట్రంప్ పేరు చాలాసార్లు ఉండటం విశేషం. ఈ డాక్యు మెంట్లన్నీ ఎపిస్టెన్ ఎస్టేట్ నుంచి సేకరించినవే. లెజిస్లేచర్స భ్యులు విడుదల చేశారు.
Read Also: http://Delhi Blast: ఢిల్లీ కారు బాంబుతో వాయిదాపడ్డ నెతన్యాహు భారత్ పర్యటన
పీటముడి
ఎపిసైన్ చాలా మంది పెద్దలతో, యు.కె ఫార్మర్ ప్రిన్స్ ఆండ్ర్యూతో సహా సంబంధాలు పెట్టుకున్న విషయాలు ఈ డాక్యుమెంట్ల వల్ల బయటకు వచ్చాయి. స్టీవ్ బానన్, ట్రంప్ పూర్వసలహాదారు, హార్వర్డ్ పూర్వ ప్రెసిడెంట్ హ్యరీ సమ్మరు కూడా ఈ డాక్యుమెం ట్లు బయటపెట్టాయి. బాధితుల వివరాలు అనేకం బయట కొచ్చాయి. అయితే ఈ బిల్లుకు ఆమోదం తెల్పుతూనేట్రంప్ మొత్తం వ్యవహారానికి ఒక పీటముడి వేశాడు. అటార్నీ జనరల్ పాంబొండితో (తమ వ్యవహారం నుంచి దృష్టి మళ్లించడానికి ఇంకా ప్రముఖులు ఎవరెవరితో అంటే బిల్ క్లింటన్, జె.పి మొర్గాన్, లింర్డిన్ ఫౌండరయిన రియిడ్ హాఫ్మన్,(డెమాక్రటిక్ పార్టీలో విరాళాలు ఇచ్చే ప్రము ఖుడు) ఛేజ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఎపిస్టైన్తో ఉన్న లాలూచీల విషయాల్లో కూడా దర్యాప్తుచేసి ఫైళ్లను బయటకు తీయాలని ఆదేశించాడు. ట్రంపు ఎపిస్టైన్ నిర్వహించే సెక్స్ వ్యవహారాలతోపాటు లైంగికపరమైన విషయాల్లో సంబంధాలున్నాయని అమెరికన్ సొసైటీ ఎంతకాదనుకున్నా నమ్ముతున్నట్లు కనపడుతున్నది. ట్రంప్కు సపోర్టు చేసిన మహిళలను దూరం చేయడానికి వేసిన ఎత్తుగడగా, అసలే అస్తవ్యస్తంగా ఉన్న ట్రంప్ పాలన మీద మరిన్ని నీలినీడలు ప్రసరింపచేయడానికి ఈ ఉదంతం పనికి వస్తుందని మీడి యా నమ్ముతున్నది. ఇలాంటి స్కాండల్స్ అమెరికా దేశ ప్రముఖుల విషయంలోచోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. వాటర్ గేట్ స్కాండల్ నిక్సనన్ను అధ్యక్ష పదవిలో ఉన్నప్పు డు ముప్పుతిప్పలు పెట్టింది. బిల్ క్లింటన్ వ్యవహారాలు విపరీతంగాచెడ్డపేరు తెచ్చుకోవడంతో హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పదవికి రెండుసార్లు పోటీ చేసినా (రెండోసారి) 2016లో డొనాల్ట్ ట్రంప్ పైన కూడా గెలవలేకపోయింది.
నైతిక విలువలకు ప్రాధాన్యత
అమెరికాలోనిప్రజలు స్వేచ్ఛా జీవులైనా అక్రమ సంబంధా లు స్కాండల్స్లో ఇరుకున్నవారి వ్యవహారాల్లో తీవ్రంగా స్పందిస్తారు. రాజకీయాల్లో నైతిక విలువలకు కొంత ప్రాధాన్యత ఇవ్వటం, గమనించదగ్గ విషయం. ప్రపంచ దేశాల్లో క్రమేపీ రాజకీయ విలువలు అడుగంటుతున్న దాఖలాలు కనపడుతున్నాయి. భారతదేశంలో చాలా సంవత్సరాలు స్వాతంత్య్రం సాధించిన తర్వాత మంచి నడవడిక, మచ్చ లేని జీవితాలు గడిపిన నాయకులను రాజకీయాల్లో ప్రజలు గౌరవించటమే కాకుండా ప్రలోభాలకు లొంగకుండా, శాసన సభలకూ, లోక్సభకూ ఎన్నుకొనే వారు. శాసన మండలిలో, రాజ్యసభలో కూడా సాహిత్య, సంగీత స్పోర్ట్స్ లలోనే కాకుండా వివిధ కళారంగాల్లో పేరు తెచ్చుకున్నవారిని నామి నేట్ చేసి గౌరవించేవారు. ఆ రోజులు కనుమరుగవుతున్నాయి. ఎక్కువగా ప్రస్తుతం వాణి జ్యంలో, వ్యాపారాలలో మునిగి తేలుతూ ఆర్థికంగా ఎదిగిన వారు ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నారు. చట్ట సభలలో సభ్యత్వం, ధనసహాయంతో పొందుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఆ రంగాల్లోని వారికి పెద్ద పీట వేస్తున్నాయి. అవినీతి రాజకీయపరంగా ఇప్పుడు పెద్ద సమస్యగా ఓటర్లూ ప్రజలూ పట్టించుకోవడం లేదు. భారత్లో కూడాస్కాండల్స్ మీడియా ద్వారా ప్రజల దృష్టికి వస్తున్నా, ఎందుకోగాని, ఎన్నికలలో గెలిపించడానికి ఓటర్లు సంశయించడం లేదు. బిజినెస్మాన్గా డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అత్యున్నత స్థానానికి ఎదిగిన తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చి, రిపబ్లిక్ పార్టీలో ప్రముఖ స్థానం పొంది అనతికాలంలోనే రెండు సార్లు (వరుసగాకాదు) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొదటి సారి ఎన్నికయినప్పుడే వ్యాపార రంగంలోని వారు, బాగా సహకారం అందించడంతో బిల్ క్లింటన్ సతీమణి, హిల్లరీ క్లింటను రిపబ్లిక్ కాండి డేట్గా ఓడించగలిగారు. అక్కడమన యన్.ఆర్.ఐతోపాటు శాశ్వతంగా నివాసం ఏర్పరుచు కున్న భారతీయులు కూడా ట్రంప్కు అండదండలుగా ఉండి ఎన్నికలలో సహకరించా రు. రెండవసారి అధ్యక్షుడిగా గెలిచి నప్పుడు భారతదేశ మూలాలు ఉన్న వనితను పెళ్లాడిన జె.డివాన్స్ ఉపాధ్య క్షులయ్యారు. మన ప్రధాని మోడీ ట్రంప్కు మంచి స్నేహి తుడిగా ఆ మధ్యకాలంలో దగ్గర య్యారు. కానీ తర్వాత దూరం అయ్యారు. ట్రంప్ రెండవ సారి గెలిచిన తర్వాత పూర్తిగా మారిపోయారు. తనకు సహకరించిన భారతీయులనుఅక్కడ అనేక రంగాల్లో పైకి వస్తున్న వారు అమెరికా లో అగ్రస్థానాలు వహిస్తున్నారని, చిన్నచూపు చూడటమేకా కుండా కిందికి తోసే ప్రక్రియలో చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. బహుశా ఎపిస్టైన్ సెక్స్ స్కాండల్స్ విస్తృత ప్రచారం ఆదేశంలో పొందటంతో, టారిఫ్ వ్యవహారం సాకుతో, అమెరికన్ దేశస్తులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ ఎపిస్టైన్ వ్యవహారం దృష్టి మళ్లించడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవినీతి భాగోతాలతో పాటు లైంగిక నేరస్థులకు సహకరిం చే రాజకీయ నాయకులకు ఏదేశంలోనైనా ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు. ప్రస్తుతం ఈ బిల్లు అందుకే రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంటున్నది.
– రావులపాటి సీతారాం రావు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: